నిర్మల ధ్యానాలు - ఓషో - 229
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 229 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ధ్యానం నీ కేంద్రం. అది మెలకువ, నిశ్శబ్ద పరిశీలన. ప్రేమ నీ పరిధి. అది విస్తరించి వుంటుంది. నువ్వు మారితే నీతో బాటు సమస్త అస్తిత్వం మారుతుంది. 🍀
అస్తిత్వం ఎందుకు అర్థరహితంగా కనిపిస్తుందంటే మనం అర్థాన్ని సృష్టించం. అదెందుకు నీరసంగా కనిపిస్తుందంటే మనం నీరసంగా వుంటాం. బుద్ధుడిలాంటి వ్యక్తికి అది అట్లా కనిపించదు. బుద్ధుడు నేను ఏ క్షణం జ్ఞానోదయాన్ని పొందానో సమస్త అస్తిత్వం జ్ఞానోదయాన్ని పొందింది అన్నాడు. అది వాస్తవం, అది నా అనుభవం కూడా. మీలో ఎవరికయినా అది మీ అనుభవం కూడా కావచ్చు.
ధ్యానం మీకు రెండు విషయాల్ని బోధిస్తుంది. ధ్యానం మీ లోపలి ప్రపంచానికి సంబంధించినది. ప్రేమ అన్నది వునికికి సంబంధించింది. ధ్యానం నీ కేంద్రం. అది మెలకువ, నిశ్శబ్ద పరిశీలన. ప్రేమ నీ పరిధి. లొంగని వెచ్చదనం. కేంద్రం ధ్యానంలో వుంటుంది. పరిధి ప్రేమతో విస్తరించి వుంటుంది. నువ్వు మారితే నీతో బాటు సమస్త అస్తిత్వం మారుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
22 Aug 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment