నిర్మల ధ్యానాలు - ఓషో - 304
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 304 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఈ క్షణంలో నీ శక్తి కేంద్రీకరింప బడితే అనంతమయిన గాఢత ఏర్పడుతుంది. వర్తమానంలో జీవించడమే జీవించడానికి ఏకైక మార్గం. నీ శక్తితో జ్వలిస్తావు. కాంతితో కదుల్తావు. 🍀
వర్తమానంలో జీవించడమే జీవించడానికి ఏకైక మార్గం. నువ్వు వర్తమానంలో జీవిస్తే నిన్ను గతం లాగదు. భవిష్యత్తు లాగదు. ఈ క్షణంలో నీ శక్తి కేంద్రీకరింప బడితే అనంతమయిన గాఢత ఏర్పడుతుంది. అది వ్యామోహ పూరితమైన ప్రేమ వ్యవహారమవుతుంది. నీ శక్తితో జ్వలిస్తావు. కాంతితో కదుల్తావు. సంపన్నం కావడానికి అదొక్కటే మార్గం. ఎదుగుదలకు అదే దారి. తక్కినవన్నీ నీరసాలే. అది లేని వాళ్ళు ఎంత డబ్బున్నవాళ్ళయినా పేదవాళ్ళే.
ప్రపంచంలో రెండు రకాల పేదవాళ్ళున్నారు. పేదవాళ్ళయిన పేదవాళ్ళు, ధనవంతులయిన పేదవాళ్ళు, ఆస్తిపాస్తులు కూడ బెట్టుకోవడంలో ఐశ్వర్యానికి సంబంధం లేదు. ఎట్లా జీవించాలి. జీవన కవిత్వాన్ని ఎట్లా పలికించాలి. అన్న వాటిని బట్టి ఐశ్వర్యం ఆధారపడి వుంటుంది. ఇవన్నీ కేవలం ధ్యానం మీద ఆధారపడి వుంటాయి. యింకో మార్గం లేదు. యింకో మార్గం వుండదు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment