1) 🌹17, FEBRUARY 2023 FRIDAY,శుక్రవారం, బృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 135 / Kapila Gita - 135 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 19 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 19 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 727 / Vishnu Sahasranama Contemplation - 727 🌹
🌻727. సవః, सवः, Savaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 688 / Sri Siva Maha Purana - 688 🌹 *🌻. శివ స్తుతి - 1 / The Prayer of the gods - 1 🌻*
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 309 / Osho Daily Meditations - 309 🌹 🍀 309. ప్రతి క్షణం ఒక నృత్యం / 309. EVERY MOMENT IS A DANCE 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 434-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 434-1 🌹 🌻 434. 'కుశలా' -1 / 434. 'Kushala' -1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹17, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -32 🍀*
32. వరలక్ష్మి నమో ధనలక్ష్మి నమో
జయలక్ష్మి నమో గజలక్ష్మి నమః ।
జయ షోడశలక్ష్మి నమోఽస్తు నమో
శరణం శరణం సతతం శరణం ॥
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : దైవప్రేరణ నిత్యమూ నీవు పొందుతూ వుండాలంటే, మొట్ట మొదట నీలో అందుకొరకై నిరంతరమైన ఆకాంక్ష ఉండాలి. పిమ్మట బాహ్య ప్రవృత్తుల నుండి మరలి, అంతరంగంలో ఒక విధమైన ప్రశాంత స్థితిని నీవు చిక్కబట్టుకోవాలి. అచటి నుండి శ్రద్ధాళుడవై ఆలకిస్తే నీ అంతరాత్మనుండి వచ్చిన దివ్య ప్రేరణానుభవం నీకు కలుగగలదు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 23:37:25
వరకు తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: పూర్వాషాఢ 20:29:51
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: సిధ్ధి 23:45:20 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: కౌలవ 13:13:08 వరకు
వర్జ్యం: 07:32:00 - 08:58:20
మరియు 27:33:20 - 28:58:12
దుర్ముహూర్తం: 09:01:09 - 09:47:35
మరియు 12:53:20 - 13:39:46
రాహు కాలం: 11:03:03 - 12:30:07
గుళిక కాలం: 08:08:55 - 09:35:59
యమ గండం: 15:24:15 - 16:51:19
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 16:10:00 - 17:36:20
సూర్యోదయం: 06:41:51
సూర్యాస్తమయం: 18:18:24
చంద్రోదయం: 03:55:29
చంద్రాస్తమయం: 15:08:52
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 20:29:51 వరకు తదుపరి
ఆనంద యోగం - కార్య సిధ్ధి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 136 / Kapila Gita - 136 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 20 🌴*
*20. అకర్తుః కర్మబంధోఽయం పురుషస్య యదాశ్రయః|*
*గుణేషు సత్సు ప్రకృతేః కైవల్యం తేష్వతః కథమ్॥*
*తాత్పర్యము : తత్త్వములను గూర్చి, ఆలోచించుట వలన ఒకానొక వ్యక్తికి సంసార బంధముల వలన తీవ్ర భయము తొలగిపోయినను, వాటికి నిమిత్త కారణమైన ప్రకృతి గుణములు (అనగా - ఆసక్తి) తొలగనందు వలన మరల ఆ భయము ఉండనే యుండును గదా!*
*వ్యాఖ్య : *విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః| రసవర్ణం రసోఽప్యస్వ పరం దృష్ట్వా నివర్తతే॥*- (గీత. 2-59) ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపకుండా నిగ్రహించిన వానికి ఇంద్రియార్థములు మాత్రమే దూరమగును. కాని, వాటిపై ఆసక్తి మిగిలి ఉండును.అట్టి వ్యక్తికి పరమాత్మను దర్శించిన మీదట విషయము లందు గల ఆసక్తి గూడా నశించి పోవును.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 136 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 20 🌴*
*20. kvacit tattvāvamarśena nivṛttaṁ bhayam ulbaṇam*
*anivṛtta-nimittatvāt punaḥ pratyavatiṣṭhate*
*MEANING : Even if the great fear of bondage is avoided by mental speculation and inquiry into the fundamental principles, it may still appear again, since its cause has not ceased.*
*PURPORT : Material bondage is caused by putting oneself under the control of matter because of the false ego of lording it over material nature. Bhagavad-gītā (BG 7.27) states, icchā-dveṣa-samutthena. Two kinds of propensities arise in the living entity. One propensity is icchā, which means desire to lord it over material nature or to be as great as the Supreme Lord. Everyone desires to be the greatest personality in this material world. Dveṣa means "envy." When one becomes envious of Kṛṣṇa, or the Supreme Personality of Godhead, one thinks, "Why should Kṛṣṇa be the all and all? I'm as good as Kṛṣṇa." These two items, desire to be the Lord and envy of the Lord, are the beginning cause of material bondage. As long as a philosopher, salvationist or voidist has some desire to be supreme, to be everything, or to deny the existence of God, the cause remains, and there is no question of his liberation.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 727 / Vishnu Sahasranama Contemplation - 727 🌹*
*🌻727. సవః, सवः, Savaḥ🌻*
*ఓం సవాయ నమః | ॐ सवाय नमः | OM Savāya namaḥ*
*స సవోఽధ్వర ఈశానః సోమోయత్రాభిషూయతే*
*సోమరసముల యందు అభిషవణము అనగా పిండ బడునట్టి యజ్ఞమునకు 'సవము' అని వ్యవహారము. అది శ్రీ విష్ణు రూపమే.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 727🌹*
*🌻727. Savaḥ🌻*
*OM Savāya namaḥ*
*स सवोऽध्वर ईशानः सोमोयत्राभिषूयते / Sa savo’dhvara īśānaḥ somoyatrābhiṣūyate*
*The Soma sacrifice called Savah in which the some is crushed. He who is in the form of Soma Yāga is Savaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥
ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥
Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 688 / Sri Siva Maha Purana - 688 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴*
*🌻. శివ స్తుతి - 1 🌻*
వ్యాసుడిట్లు పలికెను -
ఓ బ్రహ్మవేత్తా! నీవు మహాప్రాజ్ఞుడవు, వక్తలలో శ్రేష్ఠుడవు. తరువాత ఏమి ఆయెను? దేవతలు ఎట్లు సుఖమును పొందగల్గిరి? నాకు చెప్పుడు (1).
బ్రహ్మ ఇట్లు పలికెను -
గొప్ప ధీశాలియగు వ్యాసుని ఈ మాటను విని సనత్కుమారుడు శివుని పాదపద్మములను స్మరించి ఇట్లు పలికెను (2).
సనత్కుమారుడిట్లు పలికెను -
తరువాత వారి తేజస్సు ముందు వెలవెల బోయిన ఇంద్రాది దేవతలు అందరు ఒకరితో నొకరు చర్చించుకొని, దుఃఖముతో బ్రహ్మను శరణు పొందిరి (3). అపుడు ఆ దేవతలందరు దుఃఖమును త్రోసిపుచ్చి పితామహునకు ప్రీతితో ప్రణమిల్లి సరియగు సమయములో ఇట్లు విన్నవించు కొనిరి (4).
దేవతలిట్లు పలికిరి -
ఓ బ్రహ్మా! మయుడు తారకుని పుత్రులతో గూడి మూడు పురములకు నాధుడై దేవతలనందరిని నిశ్చయముగా దుఃఖపెట్టు చున్నాడు(5) ఓ బ్రహ్మా! ఈ కారణంగా దుఃఖితులమైన మేము నిన్ను శరణు జొచ్చినాము. వానిని వధించే ఉపాయమును పన్ని మాకు సుఖమును కలిగించుము (6).
సనత్కుమారుడిట్లు పలికెను -
దేవతలు ఇట్లు విన్నవించగా, సృష్టికర్తయగు బ్రహ్మ నవ్వి మయుని భయముతో నిండిన మనస్సు గల ఆ దేవతలనందరినీ ఉద్దేశించి ఇట్లు బదులిడెను (7).
బ్రహ్మ ఇట్లు పలికెను -
దేవతలారా! ఆ రాక్షసుల గురించి మీరు అధికముగా భయపడకుడు. వారిని వధించి సుఖమును కలిగించే ఉపాయమును చెప్పెదను. ఆ పనిని శివుడు చేయగలడు (8). నాచే వర్థిల్లచేయబడిన రాక్షసుని నేనే చంపుట తగదు. పైగా ఆ మూడు నగరములలో పుణ్యము వర్దిల్లుచున్నది (9). ఓ ఇంద్రాది దేవతలారా! మీరందరు శివుని ప్రార్ధించుడు. సర్వాధ్యక్షుడగు ఆయన ప్రసన్నుడై మీ పనిని చేయగలడు (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 688🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 02 🌴*
*🌻 The Prayer of the gods - 1 🌻*
Vyāsa said:—
1. O son of Brahmā, of great intellect, and most eloquent, please narrate. What happened after that? How did the gods become happy?
Brahmā said:—
2. On hearing the words of Vyāsa of immeasurable intellect, Sanatkumāra spoke after remembering the lotus-like feet of Śiva.
Sanatkumāra said:—
3. Indra and other gods scorched by their brilliance and distressed consulted one another and sought refuge in Brahmā.
4. After bowing to and circumambulating Brahmā, they narrated their grievances to him after awaiting the proper opportunity.
The gods said:—
5. O Brahmā, the heaven-dwellers have been subjected to great distress by Maya the virtual ruler of the three cities, accompanied by the sons of Tāraka.
6. Hence, O Brahmā, we are distressed and we seek refuge in you. Please plan out the way of their annihilation whereby we can be happy.
Sanatkumāra said:—
7. Requested thus by the gods, Brahmā, the creator of the worlds laughed and replied to them all who were utterly frightened of Maya.
Brahmā said:—
8. O gods, I tell you, do not be afraid at all of those Asuras. Śiva will hit upon a good way of killing them.
9. The Asuras have flourished due to my favour. They do not deserve destruction at my hands. Their merit is bound to increase in the three cities [1] again.
10. All of you gods including Indra pray to Śiva. If the lord of all is pleased, he will carry out your task.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 309 / Osho Daily Meditations - 309 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 309. ప్రతి క్షణం ఒక నృత్యం 🍀*
*🕉. ప్రతి క్షణం ఒక నృత్యం. ఏదైనా క్రమాన్ని కలిగి ఉండటానికి రెండు క్షణాలు అవసరం లేదు. 🕉*
*సంకుచితత్వ మనస్సు నిరంతరం ఏదో ఒక అర్ధాన్ని అడుగుతుంది. అనేక క్షణాల ద్వారా కనబడే అర్థం వుండాలని, ప్రతిదీ ఒక కారణ-ప్రభావ గొలుసుతో అనుసంధానించ బడాలని కోరుకుంటుంది. ప్రతిదీ ఎక్కడికో తరలించ బడాలని, ఎక్కడికో చేరుకోవాలని, ముగించాలని కోరుకుంటుంది. అది తార్కిక మనస్సు, ఏక మితి కలిగిన మనస్సు లక్షణం. కానీ జీవితం బహుమితీయమైనది. దీనికి నిజంగా లక్ష్యం లేదు, విధి లేదు. అన్ని క్షణాలు ఒకదానిని ఒకటి అనుసరిస్తూ, ఎక్కడికో చేరుకుంటున్నాయి అనే దానికి అర్థం లేదు.*
*జీవితం ఎక్కడికీ కదలదు. ఇది కేవలం ఇక్కడి నృత్యం. సరైన పదం నృత్యం, కదలిక కాదు. ప్రతి క్షణం ఒక నృత్యం. ప్రతి క్షణం వచ్చినప్పుడు, అది జరిగినట్లుగానే ఆనందించాలి. అప్పుడు మీ భారం పూర్తిగా తొలగి పోతుంది. స్వేచ్ఛ అంటే అదే- క్షణంలో ఉండటం. ఈ క్షణంలో ఉండటం. గతం గురించి ఎప్పుడూ చింతించకండి. దేన్నయినా కూడా తార్కిక అనుగుణ్యమైన క్రమ సంఘటనలుగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండవద్దు. ఇంకా రాని దాని గురించి ఎప్పుడూ చింతించకండి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 309 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 309. EVERY MOMENT IS A DANCE 🍀*
*🕉. Every moment is a dance. There is no need for two moments to have any sequence. 🕉*
*It is the one-dimensional mind that continuously asks for some meaning, some meaning that runs through all moments, that wants everything to be connected by a cause-and -effect chain, that wants everything to move somewhere, to reach somewhere, to conclude somewhere. That is the logical mind, the one- dimensional mind. Life is multidimensional. It has no goal really, no destiny. And it has no meaning, in fact-meaning in the sense that all the moments are following each other in a queue, reaching somewhere.*
*No, life is not moving anywhere. It is simply dancing here. The right word is dance, not movement. Each moment is a dance, and one should enjoy each moment as it comes, as it happens. Then your burden will disappear completely. That's what freedom is-to be in the moment, to be of the moment, never worried about the past, never worried about that which has not come yet, and never trying to make a logical sequence out of anything.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 434 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 434 - 1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।*
*కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀*
*🌻 434. 'కుశలా' -1🌻*
*'కుశలా' అనగా సృష్టి నిర్మాణము నందు నేర్పు గలది శ్రీమాత అని అర్థము. కుశలముగ నుండుట శ్రీమాత అనుగ్రహమే. ఏడు లోకము లందు కుశలముగ నుండుట పరిపూర్ణ ఆనందము నిచ్చును. అట్టివారు పూర్ణయోగులు. జీవుల గమ్యము ఇట్టి పూర్ణత్వము కొఱకే. మానవ దేహ నిర్మాణము సృష్టి నిర్మాణము చేయుటలో శ్రీమాత కౌశలము గమనింప వచ్చును. బ్రహ్మాండము నందున్నది పిండాండము నందు కూడ ఏర్పరుచుట శ్రీమాతకే సాధ్యము. సృష్టి యందున్న సమస్త దేవతలు, రాక్షసులు కూడ మానవ దేహమునం దున్నారు. మానవుడు తన ప్రవర్తనను బట్టి దైవము కాగలడు. అసురుడు కూడ కాగలడు. దైవాసురులకు మిత్రుడు కూడ కాగలడు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 434 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 93. Kushala komalakara kurukulla kuleshvari*
*Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻*
*🌻 434. 'Kushala' -1🌻*
*'Kushala' means Srimata who is skilled in creation. Being at bliss is the grace of Sri Mata. Being blissful in the seven worlds is perfect happiness. They are Purnayogis. The goal of living beings is to achieve this perfection. Srimata's skill in creation can be observed in the structure of the human body. It is only possible for Shrimata to create what is in the universe also in an atom. All the gods and demons in creation have taken human body. A man can become a god or a demon by his behavior. He can also be a friend to the gods.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
No comments:
Post a Comment