🌹 13, MARCH 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 13, MARCH 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 13, MARCH 2023 MONDAY, సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 339 / Bhagavad-Gita -339 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 01 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 186 / Agni Maha Purana - 186 🌹 🌻. కుంభాధివాసము - 1 / Consecration of pitchers - 1 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 051 / DAILY WISDOM - 051 🌹 🌻 20. మనల్ని మనం తెలుసుకుంటే తప్ప విశ్వాన్ని మనం తెలుసుకోలేము. / 20. We Cannot Know the Universe Unless We Know Ourselves 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 316 🌹
6) 🌹. శివ సూత్రములు - 53 / Siva Sutras - 53 🌹 
🌻 17. వితర్క ఆత్మజ్ఞానం - 2 / 17. Vitarka ātmajñānam - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹13, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 24 🍀*

45. ఈశాన ఈశ్వరః కాలో నిశాచారీ పినాకవాన్ |
నిమిత్తస్థో నిమిత్తం చ నందిర్నందికరో హరిః
46. నందీశ్వరశ్చ నందీ చ నందనో నందివర్ధనః |
భగహారీ నిహంతా చ కాలో బ్రహ్మపితామహః

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఆంతరంగిక పరిస్థితులు - ధ్యానసాధన - వివిధ భావోద్వేగాలకు ఆలవాలమైన చిత్తం అంతకంతకు విశుద్దము, ప్రశాంతము కావడం ధ్యానసాధనకు ముఖ్యమైన మరియొక అంతరం గిక పరిస్థితి. అనగా, ఐహిక సంఘటనల మూలమున శోక, భయ, క్రోధాది ఉద్వేగాలకు వశుడు కాకుండా వుండడం సాధకుడు నేర్చుకోవాలి.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ షష్టి 21:28:52 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: విశాఖ 08:22:04 వరకు
తదుపరి అనూరాధ
యోగం: హర్షణ 17:10:01 వరకు
తదుపరి వజ్ర
కరణం: గార 09:46:38 వరకు
వర్జ్యం: 12:20:30 - 13:55:54
దుర్ముహూర్తం: 12:49:42 - 13:37:40
మరియు 15:13:35 - 16:01:33
రాహు కాలం: 07:55:57 - 09:25:53
గుళిక కాలం: 13:55:39 - 15:25:35
యమ గండం: 10:55:48 - 12:25:43
అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:48
అమృత కాలం: 21:52:54 - 23:28:18
సూర్యోదయం: 06:26:02
సూర్యాస్తమయం: 18:25:26
చంద్రోదయం: 23:38:40
చంద్రాస్తమయం: 10:07:25
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: మిత్ర యోగం - మిత్ర
లాభం 08:22:04 వరకు తదుపరి మానస
యోగం - కార్య లాభం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 339 / Bhagavad-Gita - 339 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 01 🌴*

*01. శ్రీ భగవానువాచ*
*ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామనసూయవే |*
*జ్ఞాన విజ్ఞాన సహితం యద్ జ్ఞాత్వా మోక్షసేశుభాత్ ||*

🌷. తాత్పర్యం :
*శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! నీవు నా యెడ ఎన్నడును అసూయ కలవాడవు కానందున ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసెదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతికస్థితి వలన కలిగెడి క్లేశముల నుండి నీవు ముక్తుడవు కాగలవు.*

🌷. భాష్యము :
భక్తుడు శ్రీకృష్ణభగవానుని గూర్చి అధికముగా శ్రవణము చేసినకొలది అధికముగా ఆత్మవికాసము నొందుచుండును. ఇట్టి శ్రవణవిధానమే శ్రీమద్భాగవతమునందు ఈ విధముగా ఉపదేశింపబడినది. “భాగవత్కథలు పరమశక్తిపుర్నములు. 

భవత్సంబంధిత విషయములు భక్తుల సంగములో చర్చించినచో అవి అనుభవమునకు వచ్చును. అనుభవపూర్వక జ్ఞానమైనందున ఇది ఎన్నడును మానసికకల్పనాపరులు లేదా లౌకికవిద్వాంసుల సాంగత్యమున సాధింపబడదు.”

భక్తులు సదా శ్రీకృష్ణభగవానుని సేవలో నిలిచియుందురు. ఆ విధముగా కృష్ణభక్తిభావనాయుతుడైన జీవుని మనోగతమును, శ్రద్ధను గమనించిన ఆ భగవానుడు భక్తుల సాంగత్యములో తనను గూర్చి సంపూర్ణముగా అవగతము చేసికొను బుద్ధిని అతనికి ప్రసాదించును. 

కృష్ణపరమగు చర్చ అత్యంత శక్తివంతమైనది. అదృష్టభాగుడైన మనుజుడు అట్టి సాంగత్యమును పొంది ఈ జ్ఞానమును అవగతము చేసికొనుటకు యత్నించినచో తప్పక ఆధ్యాత్మికానుభావమును బడయగలడు. 

తన శక్తిపూర్ణమైన సేవ యందు అత్యంత ఉన్నతస్థితిని అర్జునుడు బడయనట్లుగా చేయుటకే శ్రీకృష్ణుడు తానింతవరకు తెలియజేసిన విషయముల కన్నను పరమరహస్యమైనవానిని ఈ నవమాధ్యాయమున వివరింపనున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 339 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 01 🌴*

*01 . śrī-bhagavān uvāca*
*idaṁ tu te guhya-tamaṁ pravakṣyāmy anasūyave*
*jñānaṁ vijñāna-sahitaṁ yaj jñātvā mokṣyase ’śubhāt*

🌷 Translation : 
*The Supreme Personality of Godhead said: My dear Arjuna, because you are never envious of Me, I shall impart to you this most confidential knowledge and realization, knowing which you shall be relieved of the miseries of material existence.*

🌹 Purport :
As a devotee hears more and more about the Supreme Lord, he becomes enlightened. This hearing process is recommended in the Śrīmad-Bhāgavatam: 

“The messages of the Supreme Personality of Godhead are full of potencies, and these potencies can be realized if topics regarding the Supreme Godhead are discussed amongst devotees.” 

This cannot be achieved by the association of mental speculators or academic scholars, for it is realized knowledge.

The devotees are constantly engaged in the Supreme Lord’s service. 

The Lord understands the mentality and sincerity of a particular living entity who is engaged in Kṛṣṇa consciousness and gives him the intelligence to understand the science of Kṛṣṇa in the association of devotees.

Discussion of Kṛṣṇa is very potent, and if a fortunate person has such association and tries to assimilate the knowledge, then he will surely make advancement toward spiritual realization. 

Lord Kṛṣṇa, in order to encourage Arjuna to higher and higher elevation in His potent service, describes in this Ninth Chapter matters more confidential than any He has already disclosed.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 186 / Agni Maha Purana - 186 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 57*

*🌻. కుంభాధివాసము - 1 🌻*

*హయగ్రీవుడు చెప్పెను: దేవతాప్రతిష్ఠా పూజల కొరకై గ్రహంచిన భూమిపై నారసింహా మంత్రము చదువుచు రాక్షసులను తొలిగించు అక్షతలు, ఆవాలు, పంచగవ్యములు చెల్లవెలను. రత్నయుక్తమగు కలశ##పై అంగదేవతా సమేతుడగు శ్రీహరిని పూజింపవలెను. అస్త్ర మంత్రముతో నూట ఎనిమిది పాత్రలను పూజింపవలెను. అవిచ్ఛిన్న ధారతో వేదిని తడిపి, ధాన్యము చల్లవలెను. కలశను ప్రదక్షిణాక్రమమున త్రిప్పి చిమ్మిన అన్నముపై ఉంచవలెను. కలశకు వస్త్రము చుట్టి దానిపై లక్ష్మీ నారాయణులను పూజింపవలెను. "యోగే యోగే" ఇత్యాది మంత్రము పఠించుచు మండలమున శయ్యను స్ధాపింపవలెను.*

*(స్నాన మండపమున కుశలపపై శయ్యదానిపై పరువు పరిచి దిక్కుల యందును. విదిక్కుల యందును విద్యాధిపతులను) (విష్ణువు యొక్క విభిన్న విగ్రహములను) పూజింపవలెను. పూర్వాది దిక్కులందు క్రమముగ విష్ణు-మధు సూదన-త్రివిక్రమ-వామనులను, ఆగ్నేయాది విదిక్కులందు క్రమముగ శ్రీధర-హృషీకేశ-పద్మనాభ-దామోదరులను పూజింపవలెను. దామోదరుని ఈశాన్యమున పూజింపవలెను. పిమ్మట స్నాన మండపమున, ఈశాన్యమునందున్న వేదిపై ఉన్న నాలుగు కలశలలో స్నానమునకు ఉపయోగించు అన్ని ద్రవ్యములను ఉంచవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 186 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 57*
*🌻Consecration of pitchers - 1 🌻*

The Lord said:

1. One should do (the ceremony) of taking possession of the ground. One should scatter grains and mustard seeds uttering (the sacred syllable) ‘Nārasiṃha’ which destroys demons. One should sprinkle pañcagavya (the five things got from a cow).

2. Having worshipped the earth in the pitcher containing gems as well as Hari and his retinue, worship the eighteen pitchers therein with the sacred syllable of weapons.

3. The rice grains should be purified by an incessant shower (of water) and scattered around. The pitcher should be placed in their midst.

4-5. Lord Acyuta and (his consort) Śrī should again be worshipped in the pitcher (provided with) a cloth. The bed as well as the mattress should be spread on the kuśa grass on a drawn circle with (the recitation of) the sacred syllable yoge yoge.[1] Lord Viṣṇu, the slayer of (the demon) Madhu and the lord of the three (divisions of the universe) and also the different lords of learning are worshipped on the bed.

6-7. Having worshipped Vāmana, Śrīdhara, Hṛṣīkeśa, Padmanābha (different forms of Viṣṇu) in the north-west and other (corners) of the bathing place and the Dāmodara (form of Viṣṇu) in the north-east and having brought all the materials to the bathing pavilion they should be deposited in the four pitchers and the altar in the north-east.

8. These pitchers should be consecrated in the four quarters with the pitchers containing water for the consecration. The pitchers should be placed with due regard for the purpose of consecration.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 51 / DAILY WISDOM - 51 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 20. మనల్ని మనం తెలుసుకుంటే తప్ప విశ్వాన్ని మనం తెలుసుకోలేము. 🌻*

*మనల్ని మనం తెలుసుకుంటే తప్ప విశ్వాన్ని మనం తెలుసుకోలేము. ఇది నిజం అయితే, అదే సమయంలో దాని విపరీతం కూడా నిజం. విశ్వం మొత్తం మనకు తెలియకపోతే మనల్ని మనం నిజంగా తెలుసుకోలేము. మొదటిది, రెండవది ఒక్కటే. ఇప్పుడు, శాస్త్రం మనల్ని ఈ నిర్ణయానికి ఎలా నడిపిస్తుంది? ప్రకృతి యొక్క అవిభాజ్య నిరంతరాయత యొక్క రహస్యం కనుగొనడమే దీనికి మార్గం. దాని వెలుపల ఏ వ్యక్తి, ఏదీ ఉనికిలో ఉండదు. సాపేక్షతా విశ్వంలో ఈ రోజు శాస్త్రవేత్తలు మాట్లాడే స్థల - కాల నిరంతరాయత మిమ్మల్ని మరియు నన్ను మరియు అన్ని విషయాలను కలుపుకొని ఉంటుంది. మనము దాని వెలుపల నిలబడలేము.*

*స్థల - కాల నిరంతరాయత అని పిలువబడే ఈ శక్తి సముద్రంలో మనం ఒక సుడిగుండం. మరి మనం దానిలో ఒక భాగమే కాబట్టి, మనల్ని మనం తెలుసుకోకపోతే దానిని ఎలా తెలుసుకోగలం? అలాగే, తెలుసుకోవడం అంటే వాస్తవం గురించి అవగాహన కలిగి ఉండటం. దాని వల్ల ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అవగాహన అనేది మన జీవి యొక్క ఆవశ్యకత. మన ఉనికి మరియు మన చైతన్యం ఒకటే. అవి రెండు వేర్వేరు విషయాలు కాదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 51 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 20. We Cannot Know the Universe Unless We Know Ourselves 🌻*

*We cannot know the universe unless we know ourselves. While this is true, the reverse also is true, at the same time. We cannot know ourselves truly, unless we know the whole universe. The one is the same as the other. Now, how does science lead us to this conclusion? The secret is the discovery of an indivisible continuum of nature, outside which no individual, nothing, can exist. The space-time continuum which scientists speak of today, in the relativity cosmos, is inclusive of yourself and myself and all things. We cannot stand outside it.*

*We are an eddy in this ocean of force which is called the space-time continuum, and so, how can we know it unless we know ourselves, since we are a part of it? Also, it becomes more obvious on account of the fact that to know is to have an awareness of the fact; and awareness is an essentiality of our being. Our being and our consciousness of our being are the same; they are not two different things.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 316 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. చైతన్యంగా వుండండి. స్పృహతో వుండండి. చైతన్యంతో జీవించండి. చైతన్యాన్ని మీ కరదీపికగా పెట్టుకోండి. బాహ్యం నించీ ఎలాంటి క్రమశిక్షణనూ విధించకండి. 🍀*

*నేను ఎట్లాంటి మతాన్నీ బోధించను. నేను నా వాళ్ళు మరింతగా బాహ్య, అంతర చైతన్యంతో వుండడానికి సహకరిస్తాను. నా బోధనల సారాంశమదే. చైతన్యంగా వుండండి. స్పృహతో వుండండి. చైతన్యంతో జీవించండి. చైతన్యాన్ని మీ కరదీపికగా పెట్టుకోండి. బాహ్యం నించీ ఎలాంటి క్రమశిక్షణనూ విధించకండి. అది లోపలి నించీ వసంతంలా విచ్చుకోనీ. అప్పుడు అంతా తాజాగా వుంటుంది. యవ్వనంతో వుంటుంది. అనురాగంతో వుంటుంది. ఆనందంతో జ్వలిస్తుంది. అదే ఆశీర్వాదం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శివ సూత్రములు - 053 / Siva Sutras - 053 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 17. వితర్క ఆత్మజ్ఞానం - 2 🌻*
*🌴. అత్యున్నత స్థాయి స్పృహ లేదా సరైన విచక్షణ అనేది స్వీయ జ్ఞానం. 🌴*

*ఆధ్యాత్మికత అనేది అహం తో కూడిన స్వయాన్ని నాశనం చేయడం తప్ప మరొకటి కాదు. ఆధ్యాత్మిక పురోగతి పూర్తిగా అహంభావ స్వభావాన్ని నాశనం చేయడంపై ఆధారపడి ఉంటుంది. ఇంతకు మించి ఆధ్యాత్మికతలో చేయకూడనివి చేసేవి ఏమీ లేవు. స్వయం లో అహంకార స్థాయి తగ్గినప్పుడు, వితర్కం పెరుగుతుంది, ఇది ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది. వితర్కం అంటే స్థిరమైన విశ్వాసం అని అర్థం. తాను శివుడనని ఎప్పుడైతే స్థిరమైన నిశ్చయం లేకుండా ఉంటాడో, అతడు ఎప్పటికీ శివ స్థితికి చేరుకోలేడు. విశ్వాసం మరియు నమ్మకం కలిసి ఉంటాయి. ఒకరికి ఏదో ఒక విషయంలో విశ్వాసం ఉంటే తప్ప, దాని మీద నమ్మకం ఉండదు. ఒప్పుకుని నమ్మితే, ఆ నమ్మకం వృద్ధి చెంది కొంత కాలానికి తాను నమ్మిన విషయం తానే అవుతారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 053 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 17. Vitarka ātmajñānam - 2 🌻*
*🌴. Highest level of consciousness or Right discernment is the knowledge of the self. 🌴*

*Spirituality is nothing but destroying egoistic self and spiritual progression purely depends upon the extent of destroying his egoistic self. Beyond this, there are no dos and don’ts in spirituality. When the level of egoistic self decreases, vitarka increases which in turn leads to ātmajñānam. Vitarka is said to mean un-afflicted affirmation. When one says that he is Śiva without any conviction, he can never reach the state of Śiva. Conviction and belief go together. Unless one is convinced about something, he cannot have belief in that. If he is convinced, he begins to believe in that and when he has developed total belief, he himself over a period of time transforms into what he has believed in.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

No comments:

Post a Comment