శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 438 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 438 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 438 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 438 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀

🌻 438. 'కుళ కుండాలయా' - 2 🌻

ఆరోహణ, అవరోహణములకు యోగు లనుసరించు మార్గము సుషుమ్న మార్గమే. ఈ మార్గము యొక్క అంతమున మూలాధార కుండ మున్నది. అందు సర్పాకార చైతన్యము చేరి వసించును. పుట్టలో సర్పమున్నట్లు ఈ కుండమున సర్పమువలె చైతన్య ముండును. భక్తి తత్పరతతో వసించువారి యందు ఈ చైతన్యము మేల్కొని యుండును. ఇతరులయందు నిద్రావస్థ యందుండును. ఇట్లు మూలాధార కుండమున నివాస మేర్పరచుకొని శ్రీమాత విశ్రాంతి గొనుచున్నదని ఈ నామమున కీర్తింపబడుచున్నది. జాగ్రదావస్థయందు మూడు చుట్టలు విప్పుకొని పడగ విప్పినట్లుండునని, సమాధి స్థితి యందు ఏడు చుట్టలనూ విప్పుకొని పడగను విప్పి తోకపై నిలచి యుండునని పెద్దలు తెలుపుదురు. సృష్టియందు విశ్రాంతి స్థానము మాత్రము మూలాధార కుండలిని. అదియే కులకుండము. అందు వసించునది గనుక శ్రీమాత కుళ కుండాలయా.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 438 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 93. Kushala komalakara kurukulla kuleshvari
Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻

🌻 438. 'Kula Kundalaya' - 2 🌻


Sushumna Marga is the way to use yoga for ascent and descent. At the end of this path is the muladhara chakra. The serpentine consciousness resides in it. Like a snake resides in its abode, this serpentine consciousness resides at the muladhara. This consciousness is awakened in those who live with devotion. In others it is dormant. It is glorified by this name that Sri Mata resides and is resting in muladhara. It is symbolised that in the state of vigilance, three serpentine coils unwind with open hood, and in the state of samadhi, all seven coils unwind, with its hood open and standing on its tail. The source of "resting" in creation is Kundalini. That is kulakunda. Srimata resides here and hence is called Kula Kundalaya.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment