నిర్మల ధ్యానాలు - ఓషో - 356


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 356 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. వ్యక్తి మనసు నుండీ బయటపడితే కానీ ఆందోళన నుండి బయటపడడు. వ్యక్తి మనసును దాటి వెళ్ళాలి. అప్పుడే శాంతి. మనసంటే అశాంతి. మనను లేకపోవడమే శాంతి. 🍀


మనసు ఎపుడూ దేన్నో ఎంచుకోవాలన్న స్థితిలో వుంటుంది. ఆ ఎంచుకోవడం ఎపుడు సగమే అయి వుంటుంది. తక్కిన సగం ప్రతీకారం తీర్చుకుంటుంది. ఫలితంగా మనసులో ఆ వేగం ఆందోళన. మనసు ఎప్పుడూ శరీరంలో కానీ, ఆత్మలో కానీ భాగం కాలేదు. వ్యక్తి మనసు నుండీ బయటపడితే కానీ ఆందోళన నుండి బయటపడడు.

వ్యక్తి మనసును దాటి వెళ్ళాలి. అప్పుడే శాంతి. మనసు ప్రశాంతంగా వుండడం అన్నది ఎక్కడా వుండదు. జనం 'మానసిక ప్రశాంతి' గురించి మాట్లాడుతూ వుంటారు. అది నాన్సెన్స్. మనసంటే అశాంతి. మనను లేకపోవడమే శాంతి. కాబట్టి 'మనసు లేని శాంతి' అన్న మాటే సరైనది. అప్పుడు నీ నిజమైన అస్తిత్వ కేంద్రానికి చేరుతావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment