మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 20


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 20 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యుక్తాయుక్త విచక్షణ 🌻


సహజమైన భగవద్ధత్తమైన ఆనందిస్థితిని నిలుపుకోవటానికి‌ మనకు కావలసినది వివేకము. అనగా యుక్తాయుక్త విచక్షణ. దీనినే బుద్ధి అంటారు.

నీ మనస్సు 'నా' యందు నిలుపు. నీ బుద్ధిని 'నా' యందు ప్రవేశింపజేయి. అప్పుడు నిస్సందేహముగా 'నా' యందే నిలిచిఉంటావు అని భగవద్గీతలో చెప్పాడు స్వామి. ఇక్కడ 'నా' యందు అనగా ఆయన యందు అని అర్థం కాదు. 'నేను' అనగా అంతర్యామియైన వెలుగు.

ఆ విధంగా అంతర్యామి యందు మనస్సు, బుద్ధి నిలిచి‌ ఉన్నప్పుడున్న స్థితినే ఆనందము అంటారు.

ఆనందము కన్నా భిన్నమైన వానిని తొలగించినపుడు మిగిలేది ఆనందమే. ఇదే ప్రతి ఒక్కరు చేయవలసిన సాధన. ఈ సాధనను సులభతరం చేసేవి సహజీవనము, సేవ.

సేవాధర్మాన్ని అనుసరించినపుడు మనలో ఆనందస్థితికి అడ్డుతగిలే పొరలన్నీ క్రమంగా తొలగిపోతాయి. ఈ విధానాన్ని మనకు ఆచరణ పూర్వకంగా మనకు బోధించేవారే మాస్టర్స్ లేక పరమగురువులు అంటారు.

అటువంటి వారిలో మాస్టర్ సి.వి.వి. గారు ఒకరు. వీరు నిత్యజీవితంలో మన కర్తవ్యపాలనము చేస్తూనే అమరత్వసిద్ధిని పొందే సులువైన మార్గాన్ని అందించారు. నిజానికిది‌ సనాతనమైన మార్గమే.

రోగార్తులైన వారి ఆర్తి‌ పోగొట్టి యోగమార్గాన్ని అందించడమనేది వీరి పద్ధతి. వారి సహజీవన మార్గాన్ని అనుష్టించడానికి సాధన అవసరము‌.

దీనికి అందరనీ ఉన్ముఖము చేయడం కోసమే 'గురుపూజలు'......

🌹 🌹 🌹 🌹 🌹


01 May 2021

No comments:

Post a Comment