గీతోపనిషత్తు -302
🌹. గీతోపనిషత్తు -302 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 19-3 📚
🍀 19-3. ద్వంద్వ స్థితులు - కనిపించనపుడు లేదనుకొనుట, కనిపించినపుడు ఉన్నదను కొనుట అజ్ఞానము. తారకలు, గ్రహములు ఎప్పుడునూ ఉన్నవి గదా! పాలయందు వెన్నె, నేయి కనిపింపక యున్నవి. అగ్ని సహాయమున అందలి వెన్న, నేయి దర్శింపవచ్చును. ఇట్లుండుట లేకుండుటగ సృష్టి గోచరించును. అట్లే సత్యా సత్యములు గోచరించును. అట్టి ద్వంద్వ స్థితులకు మూలము తానే అని దైవము పలుకుచున్నాడు 🍀
తపామ్యహ మహం వర్షం నిగృహ్లా మ్యుత్స్పజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదాసచ్చాహ మర్జున || 19
తాత్పర్యము : తపింపజేయువాడను నేనే. వర్షము కురిపించువాడను నేనే. వర్షము నిలుపుదల కూడ నేనే. మరణమును నేనే. అమృతత్త్వము నేనే. సద్వస్తువు నేనే. అసద్వస్తువు నేనే.
వివరణము : ఆకాశమున తార లున్నవి. గ్రహము లున్నవి. అవి రాత్రి సమయమున కనిపించును. పగలు కనిపింపవు. కనిపించనపుడు లేదనుకొనుట, కనిపించినపుడు ఉన్నదను కొనుట అజ్ఞానము. తారకలు, గ్రహములు ఎప్పుడునూ ఉన్నవి గదా! పాలయందు వెన్నె, నేయి కనిపింపక యున్నవి. అగ్ని సహాయమున అందలి వెన్న, నేయి దర్శింపవచ్చును. ఇట్లుండుట లేకుండుటగ సృష్టి గోచరించును.
అట్లే సత్యా సత్యములు గోచరించును. అట్టి ద్వంద్వ స్థితులకు మూలము తానే అని దైవము పలుకుచున్నాడు. రూపాయి బిళ్ళయందు బొమ్మ బొరుసు ఉండును. బిళ్లకు బొమ్మ ఎంత అవసరమో, బొరుసు కూడ అంతే అవసరము. బొరుసులేని బొమ్మలేదు. బొమ్మ లేని బొరుసు లేదు. పూర్ణ సత్యమందు అన్నియు ఇముడును. కనుక మనమెరిగిన సత్యము, మన మసత్యమనుకొనునది కలిపి సత్యమని, పూర్ణసత్యమున అన్నియు మిగులునని తెలియ జేయుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
06 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment