వివేక చూడామణి - 178 / Viveka Chudamani - 178


🌹. వివేక చూడామణి - 178 / Viveka Chudamani - 178 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 33. బంధనాలు - 4 🍀

578. ఆ విధముగా గురు శిష్యుల సంభాషణ ఆత్మ యొక్క స్వభావమును తెలియజేసి, విముక్తి తరువాత చేయు సాధనను గూర్చి తెలికగా వివరించుట జరిగింది.

579. సన్యాసులు విముక్తి తరువాత సాధన ఎలా సాధించాలో, మనస్సులోని అన్ని మలినములను ఎలా తొలగించుకోవాలో ఇందులో వివరించిన విధానములను గమనించి, ఈ బాహ్య ప్రపంచానికి చెందిన వస్తు సముదాయము ఎడల విముక్తి పొంది, పవిత్రమైన మనస్సును పొంది, సృతులలోని విషయములను గ్రహించి ఈ యొక్క పవిత్రమైన బోధనలను అనుసరించెదరు గాక!

580. ఎవరైతే ఈ ప్రాపంచిక వ్యవహారములలో విముక్తి పొందారో వారు ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖాల నుండి బయటపడి వెలుగును చూసి, మాయా ప్రపంచములో ఎడారిలో నీటి కొరకై వెదికే ప్రయత్నము మాని, అట్టివారు శ్రీ శంకరాచార్యుల వారి ఈ వివేక చూరామణి అనే గ్రంధమును పఠించుట ద్వారా తేలికగా ఓదార్పుతో కూడిన అమృత సమానమైన ఈ మహా సముద్రములో ఈదులాడి బ్రహ్మమును తెలుసుకొని, బ్రహ్మానంద స్థితిలో విముక్తి కొరకై సాధన చేసెదరు గాక!

... ఓం తత్ సత్ ...

సమాప్తం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 VIVEKA CHUDAMANI - 178 🌹

✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda
📚 Prasad Bharadwaj

🌻 33. Attachments - 4 🌻

578. Thus by way of a dialogue between the Teacher and the disciple, has the nature of the Atman been ascertained for the easy comprehension of seekers after Liberation.

579. May those Sannyasins who are seekers after Liberation, who have purged themselves of all taints of the mind by the observance of the prescribed methods, who are averse to worldly pleasures, and who are of serene minds, and take a delight in the Shruti – appreciate this salutary teaching !

580. For those who are afflicted, in the way of the world, by the burning pain due to the (scorching) sunshine of threefold misery, and who through delusion wander about in a desert in search of water – for them here is the triumphant message of Shankara pointing out, within easy reach, the soothing ocean of nectar, Brahman, the One without a second – to lead them on to Liberation.

.... Om Tat Sat ...

..The End...

🌹 🌹 🌹 🌹 🌹


06 Jan 2022

No comments:

Post a Comment