మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 130


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 130 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు -4 🌻

యాదవులు కృష్ణునాశ్రయింపలేదు. కృష్ణుడాధారముగ తాము సాధింపదలచిన ఆదర్శములకై ఉపయోగించు కొనుటకు యత్నించిరి. అతడు వారికి కావలసిన సమస్త సంపదలను ఇచ్చెను. అవి వారిని రక్షింపలేక పోయినవి.

నిజముగా కృష్ణునికాశ్రితులు పాండవులు. వారికి శాశ్వతమైన , స్థిరమైన రక్షణ మార్గము లభించెను. శత్రువులపై జయము , రాజ్యసంపద , ధర్మపాలనము , మోక్షము లభించినవి.

పాండవుల కన్న శ్రీకృష్ణున కెక్కువ ఆశ్రితులు వానిని ప్రేమించిన వ్రజ గోపికలు . వారన్యమెరుగరు. వారికి తన నిరంతర సాన్నిధ్యము ప్రసాదించెను.

..... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


06 JAN 2022

No comments:

Post a Comment