మైత్రేయ మహర్షి బోధనలు - 84
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 84 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 70. ఈనాటి విజ్ఞత 🌻
పంచ భూతములకు అంతరాయము కలిగించినచో అందుండి విషము పుట్టునని శాస్త్రజ్ఞులకు తెలియదు. ఆధునిక యుగమున మానవుడు భూమిని, నీటిని, వాయువును, ఆకాశమును చీకాకు పరచుచున్నాడు. అది కారణముగ పుట్టిన విషవాయువులు సూర్య కిరణముల ద్వారా భూమిని చేరి మానవులను చీకాకు పెట్టుచున్నవి.
మానవుని ప్రవర్తనయే భూమిపై అనర్థము లేర్పరచుచుండగ, అట్టి ప్రవర్తనను సరిదిద్దుకొనక భూమిని పవిత్రీకరించ వలెనని ప్రయత్నము చేయుచున్నారు. అపరిశుద్ధము చేయుచు, పరిశుద్ధత కొరకు ప్రాకులాడు చున్నాడు. ప్రకృతితో కలసిమెలసి జీవించుట అను స్నేహభావము లేకుండుట వలననే అలజడి చెందుచున్నాడు. జీవితము అపాయకరము చేసుకొను చున్నాడు. అతని విజ్ఞతను ఏమని వివరించగలము ?
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
06 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment