నిర్మల ధ్యానాలు - ఓషో - 146


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 146 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. దేవుడు మనతో వుండని పక్షంలో క్షణకాలం కూడా మనం వునికిలో వుండం. కానీ ఏ క్షణం మనమాయనతో వుంటామో అపుడు మనం జీవనం పట్ల స్పృహతో వుంటాం. అప్పుడు మనలో కృతజ్ఞత పెల్లుబుకుతుంది. 🍀


దేవుడు ఎప్పుడూ మనతోనే వుంటాడు. సమస్య ఎప్పుడూ మన వేపే వుంటుంది. దేవుడు మనతో వుండని పక్షంలో క్షణకాలం కూడా మనం వునికిలో వుండం. ఆయన మన జీవితం, ఆయన మనలో శ్వాసిస్తాడు. మన హృదయంలో స్పందిస్తాడు. ఆయన మన మనస్సాక్షి. ఎప్పుడూ మనతోనే వుంటాడు. కానీ మనమే ఆయనతో వుండం.

ఏ క్షణం మనమాయనతో వుంటామో అప్పుడు విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. అపుడు మనం జీవన సంగీతం పట్ల స్పృహతో వుంటాం. అపుడు మనపైన ఎంత అనురాగ వర్షం కురిసిందో గుర్తిస్తాం. అప్పుడు మనలో కృతజ్ఞత పెల్లుబుకుతుంది. కృతజ్ఞత అన్నది మత జీవనానికి మౌలిక లక్షణం. తక్కిందంతా ఆచార కర్మకాండే. కృతజ్ఞతా లక్షణమే మతజీవన సారాంశం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


06 Mar 2022

No comments:

Post a Comment