06 - MARCH - 2022 ఆదివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 06, మార్చి 2022 ఆదివారం, భాను వాసరే 🌹 
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 168 / Bhagavad-Gita - 168 - 4-06 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 566 / Vishnu Sahasranama Contemplation - 566🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 15 / Agni Maha Purana 15 - అయోధ్య కాండ వర్ణనము - 2🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 245 / DAILY WISDOM - 245 🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 146 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 84 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 06, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస వినాయక చతుర్థి, Masik Vinayaka Chaturthi 🌻*

*🍀. ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాలు - 9 🍀*

*🌟 9. అంశుమన్ –*
*అథాంశుః కశ్యపస్తార్‍క్ష్య ఋతసేన స్తథోర్వశీ |*
*విద్యుచ్ఛత్రుర్మహాశంఖః సహోమాసం నయంత్యమీ*
*సదా విద్రావణరతో జగన్మంగళ దీపకః |*
*మునీంద్రనివహస్తుత్యో భూతిదోఽంశుర్భవేన్మమ*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అహాన్ని విజ్ఞతతో ఉపయోగిస్తే, అది మనకు ఎంతో ఉపయోగకారి. స్వార్థ ప్రయోజనాలకు దూరంగా ఉండండి. 🍀*
🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం 
తిథి: శుక్ల చవితి 21:13:19 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: అశ్విని 27:52:38 వరకు
తదుపరి భరణి
యోగం: బ్రహ్మ 24:00:40 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: వణిజ 08:50:25 వరకు
సూర్యోదయం: 06:31:04
సూర్యాస్తమయం: 18:23:51
చంద్రోదయం: 08:56:16
చంద్రాస్తమయం: 21:43:05
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మేషం
వర్జ్యం: 23:37:30 - 25:18:54
దుర్ముహూర్తం: 16:48:48 - 17:36:19
రాహు కాలం: 16:54:45 - 18:23:51
గుళిక కాలం: 15:25:39 - 16:54:45
యమ గండం: 12:27:27 - 13:56:33
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:50
అమృత కాలం: 20:14:42 - 21:56:06
మరియు 24:42:12 - 26:26:28
ఆనంద యోగం - కార్య సిధ్ధి 27:52:38
వరకు తదుపరి కాలదండ యోగం
- మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 168 / Bhagavad-Gita - 168🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. చతుర్ధ అధ్యాయము - జ్ఞాన యోగము - 06 🌴*

*06. అజోపి సన్నవ్యయాత్యా భూతానామీశ్వరోపి సన్ |*
*ప్రకృతిం స్వామధిష్టాయ సమ్భవామ్యాత్మమాయయా ||*

*🌷. తాత్పర్యం :*
*జన్మలేని వాడనైనను, నా దివ్యదేహము ఎన్నడును నశింపనిదైనను, సకల జీవులకు ప్రభువునైనను ఆదియైన దివ్యరూపముతో నేను ప్రతి యుగము నందును అవతరింతును.*

🌻. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు తన జన్మ యందలి ప్రత్యేకతను గూర్చి పలుకుచున్నాడు. అతడు సాధారణ మానవుని వలె గోచరించినను తన పూర్వపు “జన్మల” విషయముల నన్నింటిని జ్ఞప్తియందుంచుకొనును. కాని సామాన్యుడు తాను కొలదిగంటల క్రిందట యేమి ఒనర్చెనో సైతము గుర్తుంచుకొనలేడు. గడచిన దినమందు అదే సమయమున ఏమి చేయుచుంటివని ఎవారినేని ప్రశ్నించినచో వెంటనే సమాధాన మొసగుట ఆ సామాన్యునికి బహుకష్టతరము కాగలదు.క్రిందటి రోజు అదే సమయమున ఏమి చేయుచుండెనో గుర్తు తెచ్చుకొనుటకు అతడు తన జ్ఞాపకశక్తినంతటినీ తిరిగి తోడవలసియే వచ్చును. 

అయినప్పటికిని తాను దేవుడనని(లేదా కృష్ణుడనని) పలుకుటకు మానవులు ఏమాత్రము జంకరు. కాని అట్టి అర్థరహిత పలుకులచే ఎవ్వరును మోసపోరాదు. ఇంకను ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు తన “ప్రకృతి”ని (తన రూపమును) గూర్చి వివరించినాడు. ప్రకృతియనగా స్వభావము మరియు స్వరూపము(స్వీయరూపము) అని భావము. భగవానుడు తాను తన స్వీయరూపముముతో అవతరింతునని పలికెను. సాధారణజీవులు మార్చునట్లుగా అతడు తన దేఃమును మార్చడు. బద్ధజీవుడు ప్రస్తుత జన్మమందు ఒక రకమైన దేహమును కలిగి యుండవచ్చు. కాని మరుసటి జన్మలో వేరోక దేహము లభించగలదు. 

అనగా భౌతికజగము నందు జీవుడు స్థిరమైన దేహమును కలిగియుండక ఒక దేహము లభించగలదు. అనగా భౌతికజగమునందు జీవుడు స్థిరమైన దేహమును కలిగియుండక ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందుచునే యుండును. కాని భగవానుడు ఆ విధముగా కావింపడు. అతడెప్పుడు అవతరించినను అంతరంగికశక్తి ద్వారా తన ఆది దివ్యశరీరముతోనే ఆవిర్భవించుచుండును. వేరుమాటలలో మురళిని దాల్చిన ద్విభుజరూపము నందు(ఆదియైన నిత్యరూపము) శ్రీకృష్ణుడు ఈ భౌతికజగమున అవతరించును. భౌతికజగత్తు యొక్క కల్మషముచే ప్రభావితము కాకుండా తన దివ్యరూపముతోనో అతడు అవతరించును. 
🌹 🌹🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 168 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 06 🌴*

*06. ajo ’pi sann avyayātmā bhūtānām īśvaro ’pi san*
*prakṛtiṁ svām adhiṣṭhāya sambhavāmy ātma-māyayā*

*🌷 Translation :*
*Although I am unborn and My transcendental body never deteriorates, and although I am the Lord of all living entities, I still appear in every millennium in My original transcendental form.*

🌷 Purport :
The Lord has spoken about the peculiarity of His birth: although He may appear like an ordinary person, He remembers everything of His many, many past “births,” whereas a common man cannot remember what he has done even a few hours before. 

If someone is asked what he did exactly at the same time one day earlier, it would be very difficult for a common man to answer immediately. He would surely have to dredge his memory to recall what he was doing exactly at the same time one day before. And yet, men often dare claim to be God, or Kṛṣṇa. One should not be misled by such meaningless claims. Then again, the Lord explains His prakṛti, or His form. Prakṛti means “nature,” as well as svarūpa, or “one’s own form.” The Lord says that He appears in His own body. He does not change His body, as the common living entity changes from one body to another. 

The conditioned soul may have one kind of body in the present birth, but he has a different body in the next birth. In the material world, the living entity has no fixed body but transmigrates from one body to another. 

The Lord, however, does not do so. Whenever He appears, He does so in the same original body, by His internal potency. In other words, Kṛṣṇa appears in this material world in His original eternal form, with two hands, holding a flute. He appears exactly in His eternal body, uncontaminated by this material world. Although He appears in the same transcendental body and is Lord of the universe, it still appears that He takes His birth like an ordinary living entity. 
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 566 / Vishnu Sahasranama Contemplation - 566 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 566. గతిసత్తమః, गतिसत्तमः, Gatisattamaḥ 🌻*

*ఓం గతిసత్తమాయ నమః | ॐ गतिसत्तमाय नमः | OM Gatisattamāya namaḥ*

*గతిశ్చాసౌ సత్తమశ్చ గతిసత్తమ ఉచ్యతే ।*
*గత్యా విష్ణుః సత్తమ ఇతీర్యతే గతిసత్తమః ॥*

*ఈతడే ప్రాణులకు గతీ మరియూ సత్తముడు. ఇట సత్తముడు అనగా ఉత్తములలో ఉత్తమమైనవాడు అయినందున గమ్యము. గతీ మరియూ గమ్యము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 566 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 566. Gatisattamaḥ 🌻*

*OM Gatisattamāya namaḥ*

गतिश्चासौ सत्तमश्च गतिसत्तम उच्यते ।
गत्या विष्णुः सत्तम इतीर्यते गतिसत्तमः ॥

*Gatiścāsau sattamaśca gatisattama ucyate,*
*Gatyā viṣṇuḥ sattama itīryate gatisattamaḥ.*

*He is the Gati and is also Sattama. Gati means refuge and Sattama is the Best and most Superior Existent.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 15 / Agni Maha Purana - 15 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 6*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. అయోధ్యాకాండ వర్ణనము - 2 🌻*

మంథర పలికెను -- ''ఓ తెలివితక్కువదానా ! భరతుని, నిన్ను, నన్ను కూడ రామునినుండి రక్షించుము. రాముడు రాజు కాగలడు. అతని పిమ్మట ఆతని కూమారుడు రాజు కాగలడు. ఈ విధముగా భరతడు రాజవంశమును కోల్పోవును. పూర్వము దేవాసుర యుద్ధమునందు శంబరుడు దేవతలను సంహరించెను. ఆ రాత్రి అచట నున్న నీ భర్తను నీవు విద్యా ప్రభావముచే రక్షించితివి. అపు డాతడు రెండు వరముల నిచ్చెను. ఇపుడు ఆ రెండు వరములను కోరుము. ఒక వరముచే, పదునాలుగు సంవత్సరములు రాముడు వనములో నివసింపవలె ననియు, రెండవ వరముచే భరతునికి ¸°వరాజ్యమీయవలె ననియు కోరుము. అతడు దానినీయగలడు.

ఈ విధముగ ఆ కుబ్జచే ప్రోత్సహింపబడిన కై కేయి, అనర్థమును లాభకర మని భావించినదై ''ఈ మంచి ఉపాయము దశరథునిచేత ఆ పని చేయించునా ?'' అని పలికి కోప గృహమును ప్రవేశించి, మూర్ఛితురాలు వలె భూమిపై పడి యుండెను. రాజు బ్రాహ్మణులను పూజించి, కోపించి ఉన్న కై కేయిని చూచి ఇట్లు పలికెను. '' ఇట్లున్నావేమి? రోగముతో బాదపడుచున్నావా ? భయపడినావా ? నీ కేమి కావలెను. చెప్పుము. అది చేసెదను. ఏ రాముడు లేకున్నచో ముహూర్తకాల మైనను జీవింపజాలనో ఆ రామునిపై ఒట్టుపెట్టుచున్నాను. ఓ సుందరీ ! నీ కోరికను నెరవేర్చెదను.''

ఆమె పలికెను. ''ఓ రాజా ! సత్యము పలుకుము. నీవు ఇచ్చుటకు అంగీకరించెద వేని పూర్వము నా కిచ్చిన రెండు కరములను, సత్యమును పాలించుచు నాకిమ్ము. రాముడు పదునాలుగు సంవత్సరములు నియమవంతుడై వనమునందు నివసించుగాక. ఇప్పుడే ఈ సంబారములతో భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెను. ఈ వరముల నీయకున్నచో విషమ త్రాగి మరణించెదను. ఆ మాట విని, మూర్ఛితుడై, వజ్రముచే కొట్టబడినవాడు వలె భూమిపై పడెను. ముహూర్త కాలమున స్మృతి చెంది కై కేయితో ఇట్లనెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -15 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

Chapter 6
*🌻 Ayodhya Kand -2 🌻*

12. “O! stupid girl you protect Bharata, yourself and me from Rāghava. Rāghava will be the king in future and then his son.”

13-15. O Kaikeyī, “The royal lineage will be taken away from Bharata. Once when the people were persecuted by Śambara[2] at the time of the battle between the gods and demons, when the king went there for (rendering help), you protected him by your art and skill. Then the king gave you two boons. (You) ask for them now from the king. (The boons are) the stay of Rāma in the forest for fourteen years and the conferment of the heir-apparentship on Bharata. These (the king) will give.”

16. She (Kaikeyī) being encouraged by the deformed lady (Mantharā), who saw meaning in the worthless thing, said (to her), “(Tell) me a good plan which would make it work.”

17-18. (Kaikeyī) having entered the anger apartment (remained) in a swoon fallen to the ground. Then the king Daśa-Tatha having honoured the twice-borns (came there and) saw the angry Kaikeyī (and) said, “How (is) she such? Is she sick or agitated by fear,” (and said) “I shall do as you wish”.

19. “Without which Rāma, I cannot live (even) a moment, I swear by him that I will do as you wish O beautiful woman!"

20-22. “Speak the truth", said she to the king (and added), “The two boons (you) granted me formerly, you give me (now) (as you swear) by truth, O King! Let Rāma live in the forest for fourteen years being self-controlled (and) with these preparations let Bharata be installed here this day itself (and) if you do not grant (these boons) O King! I shall die (after) drinking poison.” Having heard these (words) the (king) fell into a swoon on the earth as if struck by a mace.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 245 / DAILY WISDOM - 245 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 1. మతం అనేది తత్వశాస్త్రం యొక్క అభ్యాసం 🌻*

*తత్వశాస్త్రం అనేది మతం యొక్క హేతుబద్ధమైన పునాది, మరియు మతం అనేది తత్వశాస్త్రం యొక్క అభ్యాసం. వ్యక్తిలో మతపరమైన స్పృహ అభివృద్ధి చెందడం అనేది మనిషి విశ్వంతో తనను తాను సర్దుబాటు చేసుకునే డిగ్రీల శ్రేణి ద్వారా సాధించిన అనుభవంలో పరిమాణాన్ని మెరుగుపరచడం. విశ్వం యొక్క, ఆత్మ యొక్క స్థానాన్ని ఆక్రమించే ఈ స్పృహ యొక్క కేంద్రత సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సహేతుకమైన భావనగా చెప్పబడవచ్చు. ఒక వ్యక్తి యొక్క అత్యంత తీవ్రమైన కోరిక, అది గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, సృష్టిలో తన కార్యకలాపాలలో ఒకదాని ద్వారా దేవుడు పిలిచే లక్షణంగా కూడా పరిగణించ బడుతుంది. విశ్వం మొత్తం చర్య, మరియు పూర్తిగా వ్యక్తిగత చర్యలు దాని నిర్మాణంలో సరిపోక పోవచ్చు.*

*భగవద్గీత యొక్క ప్రధాన సందేశం ఇక్కడ స్పష్టంగా ఉంది. మానవ స్వభావం యొక్క ప్రధాన కార్యనిర్వాహక సామర్థ్యాలైన పని, భక్తి, ఏకాగ్రత మరియు జ్ఞానం, - జ్ఞానం, భావోద్వేగం, సంకల్పం మరియు హేతువు ద్వారా మోక్షానికి మార్గం నాలుగు రెట్లు ప్రయత్నంగా ప్రకటించబడింది, ఇది మతపరమైన వ్యాయామం మరియు ఆధ్యాత్మిక సాధన యొక్క విధానానికి అనుగుణంగా ఉంటుంది. భగవంతుని వైపు తన కంటే పైకి ఎదగడానికి మనిషి ప్రయత్నాల భావం జరుగుతుంది. తప్పుగా ఊహించినట్లుగా, ఆధ్యాత్మిక జీవితం లౌకిక జీవితానికి భిన్నమైనది కాదు లేదా లౌకిక అవసరాలు అని పిలవబడేవి వాటి ఆధ్యాత్మిక అర్థం నుండి వేరు చేయబడదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 245 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 1. Religion is the Practice of Philosophy 🌻*

*Philosophy is the rational foundation of religion, and religion is the practice of philosophy. The development of the religious consciousness in the human individual is the enhancement of dimension in experience achieved through the series of the degrees in which man adjusts himself with the universe. The centrality of this consciousness which occupies the position of the Soul of the Universe may be said to be a reasonable concept of the Almighty God. One's most intense longing, when it reaches its maximum, may well also be regarded as a symptom of God calling through one of His operations in creation. The universe is a total action, and entirely individual actions may not fit into its structure.*

*Here is evidently the central message of the Bhagavadgita. The way to salvation is proclaimed as a fourfold endeavour through work, devotion, concentration and knowledge, cognition, emotion, volition and reason, which are the principal operating faculties of human nature, corresponding to the manner in which religious exercise and spiritual practice in a sense of man's endeavouring to rise above himself towards Godhead takes place. Spiritual life is not, as wrongly supposed, different from secular life, nor are the so-called secular needs divested of their spiritual meaning.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 146 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. దేవుడు మనతో వుండని పక్షంలో క్షణకాలం కూడా మనం వునికిలో వుండం. కానీ ఏ క్షణం మనమాయనతో వుంటామో అపుడు మనం జీవనం పట్ల స్పృహతో వుంటాం. అప్పుడు మనలో కృతజ్ఞత పెల్లుబుకుతుంది. 🍀*

*దేవుడు ఎప్పుడూ మనతోనే వుంటాడు. సమస్య ఎప్పుడూ మన వేపే వుంటుంది. దేవుడు మనతో వుండని పక్షంలో క్షణకాలం కూడా మనం వునికిలో వుండం. ఆయన మన జీవితం, ఆయన మనలో శ్వాసిస్తాడు. మన హృదయంలో స్పందిస్తాడు. ఆయన మన మనస్సాక్షి. ఎప్పుడూ మనతోనే వుంటాడు. కానీ మనమే ఆయనతో వుండం.*

*ఏ క్షణం మనమాయనతో వుంటామో అప్పుడు విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. అపుడు మనం జీవన సంగీతం పట్ల స్పృహతో వుంటాం. అపుడు మనపైన ఎంత అనురాగ వర్షం కురిసిందో గుర్తిస్తాం. అప్పుడు మనలో కృతజ్ఞత పెల్లుబుకుతుంది. కృతజ్ఞత అన్నది మత జీవనానికి మౌలిక లక్షణం. తక్కిందంతా ఆచార కర్మకాండే. కృతజ్ఞతా లక్షణమే మతజీవన సారాంశం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 84 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 70. ఈనాటి విజ్ఞత 🌻*

*పంచ భూతములకు అంతరాయము కలిగించినచో అందుండి విషము పుట్టునని శాస్త్రజ్ఞులకు తెలియదు. ఆధునిక యుగమున మానవుడు భూమిని, నీటిని, వాయువును, ఆకాశమును చీకాకు పరచుచున్నాడు. అది కారణముగ పుట్టిన విషవాయువులు సూర్య కిరణముల ద్వారా భూమిని చేరి మానవులను చీకాకు పెట్టుచున్నవి.*

*మానవుని ప్రవర్తనయే భూమిపై అనర్థము లేర్పరచుచుండగ, అట్టి ప్రవర్తనను సరిదిద్దుకొనక భూమిని పవిత్రీకరించ వలెనని ప్రయత్నము చేయుచున్నారు. అపరిశుద్ధము చేయుచు, పరిశుద్ధత కొరకు ప్రాకులాడు చున్నాడు. ప్రకృతితో కలసిమెలసి జీవించుట అను స్నేహభావము లేకుండుట వలననే అలజడి చెందుచున్నాడు. జీవితము అపాయకరము చేసుకొను చున్నాడు. అతని విజ్ఞతను ఏమని వివరించగలము ?*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment