07 - MARCH - 2022 సోమవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 07, సోమవారం, మార్చి 2022 ఇందు వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 27-2 - 332 - ఈశ్వరార్పణము 🌹 
3) 🌹. శివ మహా పురాణము - 530 / Siva Maha Purana - 530 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -160🌹  
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 149 / Osho Daily Meditations - 149 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 354-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 354-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 07, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 13 🍀*

*25. క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనే!*
*అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః!!*
*26. రోహితాయ స్థపతయే మంత్రిణే వానిజాయచ!*
*కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువంతయే!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : నువ్వు ప్రశాంతతను అనుభూతి చెందినప్పుడు ఆత్మకు దగ్గరగా ఉంటావు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం 
తిథి: శుక్ల పంచమి 22:34:43 వరకు
తదుపరి శుక్ల షష్టి 
నక్షత్రం: భరణి 29:55:26 వరకు
తదుపరి కృత్తిక
యోగం: ఇంద్ర 23:59:17 వరకు
తదుపరి వైధృతి
కరణం: బవ 09:49:31 వరకు
సూర్యోదయం: 06:30:19
సూర్యాస్తమయం: 18:24:05
చంద్రోదయం: 09:33:11
చంద్రాస్తమయం: 22:34:27
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మేషం
వర్జ్యం: 14:16:36 - 16:00:52
దుర్ముహూర్తం: 12:51:00 - 13:38:35
మరియు 15:13:45 - 16:01:20
రాహు కాలం: 07:59:33 - 09:28:46
గుళిక కాలం: 13:56:26 - 15:25:39
యమ గండం: 10:57:59 - 12:27:12
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:50
అమృత కాలం: 24:42:12 - 26:26:28
మరియు 29:52:18 - 31:38:46
చర యోగం - దుర్వార్త శ్రవణం 29:55:26
వరకు తదుపరి స్థిర యోగం - 
శుభాశుభ మిశ్రమ ఫలం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -332 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 27-2 📚*
 
*🍀 27-2. ఈశ్వరార్పణము - ఈశ్వరుడే కర్తయని, జరుగునది, జరగనిది కూడ అతడి సంకల్పమే యని తన కార్యములను, తనను కూడ ఈశ్వరునికి సమర్పించుకొనుట నిజమగు పరిష్కారము. ఇట్టి భావన యందు జీవించువానికి కర్మఫల మంటదు. ఫలమెట్టి దైనను అది కూడ ఈశ్వరార్పితముగనే భావింపవలెను. “నాహంకర్త, శ్రీహరికర్త" అను సూక్తి జీవితమున సత్యమై నిలువవలెను. నిజమునకు జీవుని ఉనికి దేవుని ఉనికియే. జీవుని ఎరుక దేవుని ఎరుకయే. 🍀*

*27. యత్కరోషి యదశ్నాసి యజ్జు హోషి దదాసి యత్ |*
*యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ||*

*తాత్పర్యము : ఏ పని చేసినను, ఏమి భుజించినను, ఎట్టి హోమములు గావించినను, ఎట్టి దానము లొనర్చినను, ఎట్టి తపస్సులు చేసినను నా కర్పణము చేయుము.*

*వివరణము : ఒకనాడు పోషకమగు ఆహారము మరియొకనాడు విషము కావచ్చును. ఇది ఇట్లు జరుగవలెను అని ఎవ్వరును శాసించలేరు. జరుగుచున్నది చూచుచు “ఓహో ఇట్లు జరుగుచున్నది గదా!" అని గమనించుటయే గాని చేయునదేమియు ఉండదు. సర్వము ఈశ్వరాధీనమని తెలిసి తన బుద్ధికి తోచినది, ఈశ్వరార్పితముగ దినమంతయు గడుపుటయే అర్పణ మార్గము లేక శరణాగతి మార్గము. ఉదయము లేచినది మొదలు రాత్రి పరుండు వరకు జీవు డనేక కార్యములు తల పెట్టి నిర్వర్తించుచు నుండును. అందు కొన్ని ఫలించును, కొన్ని ఫలించవు. కనుక జీవునకు తాను కర్త కాదని తెలియవలెను.*

*ఈశ్వరుడే కర్తయని, జరుగునది, జరగనిది కూడ అతడి సంకల్పమే యని తన కార్యములను, తనను కూడ ఈశ్వరునికి సమర్పించు కొనుట నిజమగు పరిష్కారము. ఇట్టి భావన యందు జీవించువానికి కర్మఫల మంటదు. ఫలమెట్టి దైనను అది కూడ ఈశ్వరార్పితముగనే భావింపవలెను. “నాహంకర్త, శ్రీహరికర్త" అను సూక్తి జీవితమున సత్యమై నిలువవలెను. నిజమునకు జీవుని ఉనికి దేవుని ఉనికియే. జీవుని ఎరుక దేవుని ఎరుకయే. అతనియందలి ప్రాణములు, పంచ భూతములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, సప్త ధాతువులతో కూడిన శరీరము అన్నియు దైవమిచ్చినవే. తాను కూడ దైవము యొక్క అంశయే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 530 / Sri Siva Maha Purana - 530 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 46

*🌻. శివుడు పెళ్లికొడుకు - 3 🌻*

ఆ సమయములో నల్లని కాటుక రంగు కలిగినది, తన అవయవములే అలంకారముగా గలది, ముక్కంటిని ప్రేమతో చూచు నేత్రములు గలది, కన్నులతో ఇతరులను చూడనిది, చిరునవ్వుతో ప్రసన్నమగు ముఖముగలది, మనోహరములగు నేత్రములు గలది అగు ఆ దేవిని దేవతలు ఆనందముతో రెప్ప వాల్చకుండగా చూచిరి (24,25).

అందమగు కేశపాశము గలది, చెక్కిళ్లపై సుందరమగు పత్రరచన గలది, కస్తూరి బిందువులతో గూడిన కుంకుమబొట్టుతో ప్రకాశించుచున్నది (26). సర్వ శ్రేష్ఠరత్నములు పొదిగిన హారముతో శోభిల్లు వక్షస్థ్సలము గలది, రత్నములు పొదిగిన అంగదములను, కంకణములను ధరించి శోభిల్లునది (27), చక్కని రత్న కుండలములు కాంతులతో ప్రకాశించు అందమగు చెక్కిళ్లు గలది, మణుల కాంతులను, రత్నముల ప్రభలను అపహరించే దంత పంక్తితో ప్రకాశించుచున్నది (28), దొండపండు వంటి అధరోష్ఠము గలది, పాదముల యందు రత్ననూపురములను మరియు లత్తుక రంగును కలిగియున్నది, చేతి యందు రత్నపుటద్దమును, లీలా పద్మమును ధరించి ప్రకాశించునది అగు పార్వతిని వారు చూచిరి (29).

ఆమె చందనము, అగరు, కస్తూరి, కుంకుమలను లేపనము చేసుకున్నది. ఆమె పాదములు ఎర్రగా ప్రకాశించుచుండెను. మంజీరములు మధురముగా ధ్వినించుచుండెను (30). జగత్కారణము, జగత్తునకు తల్లి అగు పార్వతీ దేవిని మేనకతో సహా చూచి దేవతలు మొదలగు వారందరు భక్తితో కూడినవారై శిరస్సులను వంచి నమస్కరించిరి (31). ముక్కంటి ఆనందముతో ఆమెను ఓరకంట చూచెను. ఆ సతీదేవి యొక్క ఆకృతిని చూచి శివుడు విరహజ్వరమును విడనాడెను (32). పార్వతివైపు చూచుచున్న శివుని అంగములన్నియూ పులకించి పోయెను. ఆయన కన్నులు ఆనందముతో నిండెను. ఆయన కన్నులలో ఆమెయే నిండి యుండుటచే ఆయన సర్వమును మరచెను (33).

తరువాత ఆ కాళి బ్రాహ్మణ స్త్రీలతో కలిసి నగరమునకు బయట కులదైవమగు అంబికను అర్చించి తిరిగి తన తండ్రి యొక్క సుందరమగు భవనములో ప్రవేశించెను (34). శంకరుడు కూడా దేవతలతో, విష్ణువుతో మరియు బ్రహ్మతో గూడి హిమవంతునిచే నిర్దేశించబడిన తమ మకామునకు ఆనందముతో వెళ్లెను (35). హిమవంతునిచే సమస్త సంపదలతో సన్మానింపబడిన ఆ దేవతలందరు అచట శంకరుని సేవిస్తూ సుఖముగా నుండిరి (36).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీఖండలో వరుని రాకను వర్ణించుట అనే నలుబదియారవ అధ్యాయము ముగిసినది (46).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 530 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 46 🌴*

*🌻 The arrival of the bridegroom - 3 🌻*

24-30. There the gods saw joyously with winkless eyes the bride of dark complexion like the collyrium, and fully bedecked in ornaments in every limb. With a side glance she was respectfully looking at the three-eyed lord avoiding the eyes of others. 

With a gentle smile playing in her face she appeared very beautiful. Her plaited hair was thickly grown and looked beautiful. Decorative lines over her body were exquisite. She had the Tilaka with musk and saffron. Gemset necklace shone over her chest. Bracelets and bangles of gems and jewels shone brilliantly. 

With diamond earrings her cheeks appeared brilliant. Her rows of teeth sparkled like diamonds. Red lac applied over her lips which were naturally red like Bimba fruits was exquisite. She had a gemset mirror in her hand. A toy lotus also embellished her. Sandal paste, aguru musk and saffron were smeared over the body by her. Her feet and soles were naturally red. Tinkling anklets added to their beauty.

31. On seeing the primordial deity, the mother of the universe along with Menakā, the gods and others bowed down their heads with great devotion.

32. The three-eyed deity saw her with the corner of an eye and was glad. On seeing the shapely body of Satī he forgot the pangs of separation.

33. With his eyes riveted to her, he forgot everything else. Hair stood on ends all over his body, as he continued seeing her with delight.

34. Then Pārvatī went out of the city, worshipped the family goddess and returned to her parental abode along with the brahmin women.

35. Śiva went to the apartments indicated by Himācala, joyously along with the gods, Viṣṇu and Brahmā.

36. All of them stayed there with joy, attending on Śiva. They were duly honoured by Himavat, the mountainous lord.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 160 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. సంస్కృతి-సమానత -2 🌻*

*ఈ దేశ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని మతమనే మసిపూసిన అద్దంలో నుంచి చూసి తిరస్కరించడం ప్రధాన కారణం. అన్ని రంగాల్లోను పాశ్చాత్య సంస్కృతిని ఆదర్శంగా తీసికొని వారి నుంచి అవి, ఇవి యాచించడం, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవడం మొదలైన ఎన్నో కారణాలున్నాయి.*

*అంతేకాక బ్రిటీషు పాలనకు ముందు ప్రతి గ్రామంలో ఉన్న అన్ని వర్ణాలవారు ఐకమత్యంతో ఒకే కుటుంబ సభ్యులు వలె పరస్పరత్వంతో మెలిగేవారు. అందరి మధ్య సామరస్య భావన, సమానత అప్రయత్నంగా నెలకొని ఉండేవి. 'విభజించి పాలించడము' (Divide and Rule) అనే పద్ధతి వలన వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా గజిబిజి చేయబడింది. అప్పటి నుండి గ్రామ వాసుల మధ్య సామరస్యం దెబ్బ తిన్నది.*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 149 / Osho Daily Meditations - 149 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 149. హృదయ పద్ధతి 🍀*

*🕉. తలపై నుంచి కిందకు దిగాలంటే గుండె గుండా వెళ్లాలి--అది కూడలి. మీరు నేరుగా జీవి వద్దకు వెళ్లలేరు; మీరు గుండె గుండా వెళ్ళవలసి ఉంటుంది. హృదయాన్ని ఒక పద్ధతిగా ఉపయోగించాలి. 🕉*
 
*ఆలోచించడం, అనుభూతి చెందడం, ఉండటం-ఈ మూడు కేంద్రాలు. కానీ ఖచ్చితంగా భావన ఆలోచన కంటే దగ్గరగా ఉంటుంది, మరియు అనుభూతి ఒక పద్ధతిగా పనిచేస్తుంది. మరింత అనుభూతి చెందండి, ఆపై మీరు తక్కువగా ఆలోచిస్తారు. ఆలోచనతో పోరాడకండి, ఎందుకంటే ఆలోచనతో పోరాడడం మళ్లీ పోరాట ఆలోచనలను సృష్టిస్తుంది. ఆలోచనలతో ఎప్పుడూ పోరాడకండి; అది వ్యర్థం. ఆలోచనలతో పోరాడే బదులు, మీ శక్తిని అనుభూతిలోకి మార్చండి. ఆలోచించడం కంటే పాడండి, తత్వశాస్త్రం కంటే ప్రేమించండి, గద్యం కంటే కవిత్వం చదవండి. నృత్యం చేయండి, ప్రకృతిని చూడండి మరియు మీరు ఏమి చేసినా హృదయపూర్వకంగా చేయండి. హృదయం నిర్లక్ష్యం చేయబడిన కేంద్రం: మీరు దానిపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించిన తర్వాత, అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అది పని చేయడం ప్రారంభించినప్పుడు, మనస్సులో కదిలే శక్తి స్వయంచాలకంగా గుండె ద్వారా కదలడం ప్రారంభమవుతుంది. మరియు గుండె శక్తి కేంద్రానికి దగ్గరగా ఉంటుంది.*

*శక్తి కేంద్రం నాభిలో ఉంది-కాబట్టి తలకు శక్తిని పంపించడం అనేది చాలా కష్టమైన పని. అందుకే అన్ని విద్యా వ్యవస్థలు ఉన్నాయి: కేంద్రం నుండి శక్తిని నేరుగా తలపైకి ఎలా పంపాలో మరియు హృదయాన్ని ఎలా దాటవేయాలో నేర్పడానికి. కాబట్టి ఏ పాఠశాల, ఏ కళాశాల, ఏ విశ్వవిద్యాలయం, ఎలా అనుభూతి చెందాలో నేర్పించదు. వారు అనుభూతిని నాశనం చేస్తారు, ఎందుకంటే మీకు అనిపిస్తే మీరు ఆలోచించలేరని వారికి తెలుసు. కానీ తల నుండి గుండెకు తరలించడం సులభం, మరియు గుండె నుండి నాభికి వెళ్లడం కూడా సులభం. నాభిలో మీరు కేవలం జీవి. స్వచ్ఛమైన జీవి-అనుభూతి, ఆలోచన లేకుండా; మీలో ఏ కదలిక లేదు. కానీ కొద్దిపాటి కదలికతో తుఫాను సృష్టించగల కేంద్రం ఇది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 149 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 149. HEART AS METHOD 🍀*

*🕉 If you want to come down from the head, you will have to pass through the heart--that is the crossroads. You cannot go to the being directly; you will have to pass through the heart. The heart has to be used as a method. 🕉*
 
*Thinking, feeling, being-these are the three centers. But certainly feeling is closer to being than thinking, and feeling functions as a method. Feel more, and then you will think less. Don't fight with thinking, because fighting with thinking is again creating other thoughts of fighting. Never fight with thoughts; it is futile. Rather than fighting with the thoughts, move your energy into feeling. Sing rather than think, love rather than philosophize, read poetry rather than prose. Dance, look at nature, and whatever you do, do it through the heart. The heart is the neglected center: Once you start paying attention to it, it starts functioning. When it starts functioning, the energy that was moving in the mind automatically starts moving through the heart. And the heart is closer to the energy center.*

*The energy center is in the navel-so to pump energy to the head is hard work, in fact. That's why all the education systems exist: to teach you how to pump the energy from the center straight to the head and how to bypass the heart. So no school, no college, no university, teaches how to feel. They destroy feeling, because they know that if you feel you cannot think. But it is easy to move from the head to the heart, and it is even easier to move from the heart to the navel. In the navel you are simply a being, a pure being-with no feeling, no thinking; you are not moving at all. That is the center of the cyclone.*
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 354-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 354-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।*
*సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀*

*🌻 354-1. “పశుపాశ విమోచనీ' 🌻* 

*పశుపాశముల నుండి విమోచనము కలిగించునది శ్రీమాత అని అర్థము. తన మూలము తాను తెలియనివాడు పశువు. తాను అను ప్రత్యగాత్మకు మూలము పరమాత్మయే. పరమాత్మయే తానుగ నున్నాడు, ప్రత్యగాత్మగ నున్నాడు. ఈ అభేదస్థితి మరచుట మాయ. దీనినే అవిద్య అందురు. ఈ తెలియక పోవుటయే జీవులను పశువులుగ కోరికల వెంటపడి జీవించునట్లుగ చేయును. తాను వేరు, దైవము వేరు అనుకొనుచు ఉపాసించువారు పశువులని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పుచున్నది.*

*దైవము లేక తాను లేడు. తాను లేకున్నను దైవ మున్నాడు. దైవము నుండి స్థితి భేదము చెందినవాడే జీవుడు. పిండి నుండి యేర్పడిన రొట్టెవంటి వాడు. పిండిలేని రొట్టె లేదు. కాని రొట్టె వేరు, పిండి వేరుగ గోచరించును. పిండిలో లేని గుణములు రొట్టెకు వచ్చును. అట్లే జీవుడు కూడ గుణములతో కూడినవాడై వేరుగ గోచరించును. ఇది స్థితి భేదమే గాని మూల మొక్కటియే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 354-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani*
*Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻*

*🌻 354-1. Paśu-pāśa-vimocanī पशु-पाश-विमोचनी 🌻*

*The concept of self-realization is best explained in Bṛhadāraṇyaka Upaniṣad (I.iv.10). It says “This self was indeed Brahman in the beginning. It knew only Itself as, ‘I am Brahman.’ Therefore, It became all. And whoever among the gods knew It also became That; and the same with sages and men.” When one realizes the Brahman, he becomes everything.*

*Those who do not have the requisite knowledge to know the Brahman are called paśu-s. Paśu generally means cattle; but in the present context it can be explained as the individual soul as distinct from the divine Soul of the universe. In other words, paśu here means those who do not possess knowledge about the Brahman. Pāśa means bondage arising out of ignorance.*

*The cattle need just food and beyond food they do not think about anything, because they are incapable of thinking. That is why those who do not possess wisdom for knowing the Brahman are called paśu-s.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment