మైత్రేయ మహర్షి బోధనలు - 87


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 87 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 73. వ్యర్ధులు 🌻

వేగవంతముగ పురుగులను తిను పక్షికిని, పెద్ద పెద్ద జంతువులను తిను రాబందులకు తేడా తెలియుట అవసరము. చిన్న చిన్న తప్పులు చేయు బలహీనులకు, భయంకరమగు తప్పులు చేయు దుష్టులకు గల వ్యత్యాసము తెలియవలెను. ప్రస్తుత కాలమున దుష్టులు వారి దౌష్ట్య నిర్వహణమున చిన్నవారి తప్పులు పెద్దవి చేసి దండించు చున్నారు. బలవంతులు బలహీనులపై ఆరోపణలు మోపి దండించు చున్నారు. ఈ బలవంతులు భూమిపై అత్యంత ధనికులుగను, భయంకరమగు శక్తివంతులుగను ఏర్పడుచు జాతిని కబళించు చున్నారు.

ఆధ్యాత్మికులు కూడ వీరి పంచన చేరి వారి మోచేతి నీరు త్రాగుచు దివ్యపురుషులమని తమని తాము గౌరవించుకొనుచున్నారు. పేదలకన్న ధనికులను, సామాన్యునికన్న అధికారులను ఎక్కువగా ఆదరించు సత్పురుషులందరును కలికి అమ్ముడు పోయిన వారే. వీరి వలన సామాన్య జనజీవనమునకు ఉపయోగమేమియు లేదు. గాడిదల వలె ధనికుల కర్మములను మోయుచు, పుణ్యము క్షీణింప చేసుకొనుచున్నారు. వీరిది వ్యర్థ ప్రయత్నము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


12 Mar 2022

No comments:

Post a Comment