శ్రీ మదగ్ని మహాపురాణము - 18 / Agni Maha Purana - 18
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 18 / Agni Maha Purana - 18 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 7
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. అయోధ్యాకాండ వర్ణనము - 1 🌻
నారద ఇట్లు పలికెను:
రాముడు వసిష్ఠుని, తల్లులను నమస్కరించి వారిని తిరిగి పంపి వేసి చిత్రకూటమునుండి బయలుదేరి దండకారణ్యము వైపు వెళ్ళుచు మార్గ మధ్యమున అత్రిమహామునిని, ఆతని భార్య యైన అనసూయను, శరభంగుని, సుతీక్‌ష్ణని, అగస్త్యభ్రాతను, అగస్త్యుని చూచి నమస్కరించెను. ఆగస్త్యుని అనుగ్రహము వలన ధనస్సును, ఖడ్గమును పొంది, దండకారణ్యము చేరెను.
జనస్థానమునందు గోదావరీతీరమున, పంచవటిలో నివసించెను. భయంకరులా లైన శూర్పణఖ వారిని భక్షించుటకై అచటికి వచ్చెను. మంచి రూపము గల రాముని చూచి ఆమె కామమోహితురాలై ఇట్లు పలికెను.
శూర్పణఖ ఇట్లు పలికెను. '' నీవు ఎవరవు ? ఎక్కడనుండి వచ్చినావు ? నేను కోరుచున్నాను. నాకు భర్త వగుము. ఈ ఇద్దరినీ భక్షించెదను. ఇట్లు పలికి ఆమె సీతాలక్ష్మణులను భక్షించుటకు ఉద్యమించెను. అపుడు రాముడు ఆజ్ఞాపింపగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసివేసెను.
రక్తము స్రవించుచుండగా ఆమె వెళ్ళి సోదరుడైన ఖరునితో ఇట్లనెనను. '' ఖరుడా ! ముక్కు లేని నేను మరణించెదను. కాని రాముని భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు ఉన్నారు. నీవు వారి గోరువెచ్చని రక్తమును త్రాగించినచో జీవించెదను.
అట్లే చేసెదను అని పలికి ఖరుడు పదునాలుగు వేలమంది రాక్షసులను, దూషణ - త్రిశిరస్కులను తనతో తీసుకొని రామునితో యుద్ధము చేయుటకు వెళ్ళెను. రాముడు కూడ యుద్ధమునందు బాణములచే రాక్షసులను కొట్టి ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు అను నాలుగు అంగములు గల సైన్యమును, త్రిశిరన్కుని, భయంకరుడైన ఖరుని, యుద్ధము చేయుచున్న దూషణుని యమలోకమునకు పంపెను.
శూర్పణఖ లంకకు వెళ్ళి రావణుని ఎదుట నేలపై బడి, క్రుద్ధురాలై రావణునితో ఇట్లు పలికెను. ''నీవు రాజువు కావు. రక్షకుడవు కావు. ఖరాదులను చంపిన రాముని భార్య యైన సీతను హరించి భార్యను చేసికొనుము. రామలక్ష్మణుల రక్తము త్రాగిన యడలనే జీవించెదను. అట్లు కానిచో జీవింపను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana -18 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 7
🌻 Ayodhya Kand - Vishnu as Rama - 1 🌻
Nārada said:
1-2. Rāma bowed to Vasiṣṭha, the mothers, (sage) Atri and his wife Anasūyā, (sages) Śarabhaṅga[1] and Sutīkṣṇa, the brother of Agastya and Agastya and reached the Daṇḍaka forest having obtained the bow and sword by the grace of (Agastya).
3. He was staying at Pañcavaṭī in the Janasthāna on the banks of the (river) Godāvarī. The awful (demoness) Śūrpaṇakhā[2] came there to devour them all.
4-5. Seeing the beautiful form of Rāma, that lustful (woman) said to him, “Who are you? Whence have you come? You become my husband being entreated by me. I shall eat these two.” So saying to him she approached them. On the words of Rāma, Lakṣmaṇa cut off her nose and ears.
6-7. She returned to her brother Khara with blood oozing out (and) said, “I shall die without a nose. I would live, O Khara! only when you would make me drink the hot blood of Sītā, the wife of Rāma and Lakṣmaṇa, his brother.
8. Khara said to her that he will do so and went there with Dūṣaṇa, Triśiras and 14000 demons in order to fight (with. Rāma).
9-10. Rāma also fought well and killed the demons with his. arrows and led the army consisting of the elephants, cavalry,. chariots and infantry together with the fighting Triśiras, Khara and Dūṣaṇa[3] to death. Śūrpaṇakhā went to Laṅkā and fell down, on the earth in front of Rāvaṇa.
11-12. (And) said to Rāvaṇa angrily, “You are neither a king, nor a protector. You abduct Sītā, the wife of Rāma, the killer of Khara and others. I will live only after drinking the blood of Rāma and Lakṣmaṇa and not by anything else.”
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
12 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment