2) 🌹. శ్రీమద్భగవద్గీత - 171 / Bhagavad-Gita - 171 - 4-09 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 569 / Vishnu Sahasranama Contemplation - 569🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 18 / Agni Maha Purana 18 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 248 / DAILY WISDOM - 248 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 149 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 87 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 12, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻*
*🍀. శ్రీ వేంకటేశ అష్టకం-5 🍀*
*9. ఇతీదం కీర్తితం యస్య విష్ణోరమితతేజసః |*
*త్రికాలే యః పఠేన్నిత్యం పాపం తస్య న విద్యతే*
*10. రాజద్వారే పఠేద్ఘోరే సంగ్రామే రిపుసంకటే |*
*భూతసర్పపిశాచాదిభయం నాస్తి కదాచన*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ప్రేమ తత్వమే కృష్ణ తత్వము. ఇది భౌతిక స్థాయిలో పరసువేదిగా, కోరికల స్థాయిలో కల్ప వృక్షముగా, మానసిక స్థాయిలో కామధేనువుగా మారుతుంది. మాస్టర్ ఆర్.కె. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల-నవమి 08:09:23 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: ఆర్ద్ర 17:32:25 వరకు
తదుపరి పునర్వసు
యోగం: సౌభాగ్య 27:54:02 వరకు
తదుపరి శోభన
కరణం: కౌలవ 08:07:23 వరకు
వర్జ్యం: 00:02:15 - 01:49:55
మరియు 30:49:00 - 32:35:16
దుర్ముహూర్తం: 08:02:27 - 08:50:21
రాహు కాలం: 09:26:17 - 10:56:07
గుళిక కాలం: 06:26:38 - 07:56:27
యమ గండం: 13:55:47 - 15:25:37
అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:48
అమృత కాలం: 06:19:05 - 08:06:45
సూర్యోదయం: 06:26:38
సూర్యాస్తమయం: 18:25:17
చంద్రోదయం: 13:14:22
చంద్రాస్తమయం: 02:02:54
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: జెమిని
ముద్గర యోగం - కలహం 17:32:25 వరకు
తదుపరి ఛత్ర యోగం - స్త్రీ లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 171 / Bhagavad-Gita - 171 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 09 🌴
*09. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వత: |*
*త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున ||*
🌷. తాత్పర్యం :
*ఓ అర్జునా! నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీరత్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతికజగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు.*
🌻. భాష్యము :
భగవానుని అవతరణము అతని దివ్యధామము నుండియే జరుగుననెడి విషయము ఆరవశ్లోకములలో ఇదివరకే తెలుపబడినది. అట్టి అవతారసత్యము నెరిగినవాడు భవబంధముల నుండి ముక్తిని పొందినట్టివాడే కనుక దేహత్యాగానంతరము అతడు శ్రీఘ్రమే భగవద్దామమును తప్పక చేరగలడు. జీవునికి అటువంటి భవబంధ విముక్తి ఏమాత్రము సులభమైన కార్యము కాదు. నిరాకారవాదులు మరియు యోగులు బహుకష్టములు మరియు జన్మల పిమ్మటయే ముక్తిని పొందగలరు. అయినను వారు పొందెడి ముక్తి (భగవానుని నిరాకార బ్రహ్మజ్యోతి యందు లీనమగుట) కేవలము పాక్షికము మాత్రమే.
దానిని సాధించిన పిమ్మటయు భౌతికజగమునకు తిరిగి వచ్చు ప్రమాదము కలదు. కాని శ్రీకృష్ణభగవానుని రూపము మరియు కర్మల దివ్యస్వభావమును అవగతము చేసికొనుట ద్వారా భక్తులు దేహత్యాగము పిమ్మట శ్రీకృష్ణదామము పొంది ఈ భౌతికజగమునకు తిరిగి రావలసిన ప్రమాదము నుండి బయటపడుదురు. శ్రీకృష్ణభగవానునకు అనేక రూపములు మరియు అవతారములు కలవని (అద్వైతమచ్యుత మనాది మనంతరూపమ్) బ్రహ్మసంహిత (5.33) యందు తెలుపబడినది.
ఈ విధముగా భగవానునకు పలురూపములున్నను ఆ రూపములన్నియును ఏవమే అయియున్నవి మరియు ఆ దేవదేవుడు అద్వితీయుడై యున్నాడు. వేదములందు (పురుషబోధినీ ఉపనిషత్తు) ఈ విధముగా తెలుపబడినది.
ఏకో దేవో నిత్యలీలానురక్తో భక్తవ్యాపీ హృద్యంతరాత్మా |
“తన విశుద్ధభక్తుల సంబంధమున అద్వితీయుడైన భగవానుడు అనేకానేక దివ్యరూపములలో నిత్యముగా వర్తించుచుండును.” ఈ వేదవాక్యము భగవద్గీత యందలి ఈ శ్లోకములో శ్రీకృష్ణభగవానునిచే నిర్ధారింపబడుచున్నది. అనగా ఈ సత్యమును నిస్సందేహముగా మరియు విశ్వాసముతో అంగీకరించువాడు ముక్తిని పొందుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 171 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 4 - Jnana Yoga - 09 🌴*
*09. janma karma ca me divyam evaṁ yo vetti tattvataḥ*
*tyaktvā dehaṁ punar janma naiti mām eti so ’rjuna*
🌷 Translation :
*One who knows the transcendental nature of My appearance and activities does not, upon leaving the body, take his birth again in this material world, but attains My eternal abode, O Arjuna.*
🌹 Purport :
The Lord’s descent from His transcendental abode is already explained in the sixth verse. One who can understand the truth of the appearance of the Personality of Godhead is already liberated from material bondage, and therefore he returns to the kingdom of God immediately after quitting this present material body.
Such liberation of the living entity from material bondage is not at all easy. The impersonalists and the yogīs attain liberation only after much trouble and many, many births. Even then, the liberation they achieve – merging into the impersonal brahma-jyotir of the Lord – is only partial, and there is the risk of returning to this material world. But the devotee, simply by understanding the transcendental nature of the body and activities of the Lord, attains the abode of the Lord after ending this body and does not run the risk of returning to this material world. In the Brahma-saṁhitā (5.33) it is stated that the Lord has many, many forms and incarnations: advaitam acyutam anādim ananta-rūpam.
Although there are many transcendental forms of the Lord, they are still one and the same Supreme Personality of Godhead. As stated in the Vedas (Puruṣa-bodhinī Upaniṣad):
eko devo nitya-līlānurakto
bhakta-vyāpī hṛdy antar-ātmā
“The one Supreme Personality of Godhead is eternally engaged in many, many transcendental forms in relationships with His unalloyed devotees.” Simply by accepting this truth on faith, one can, without a doubt, attain liberation.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 569 / Vishnu Sahasranama Contemplation - 569 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 569. దారుణః, दारुणः, Dāruṇaḥ 🌻*
*ఓం దారుణాయ నమః | ॐ दारुणाय नमः | OM Dāruṇāya namaḥ*
*దారుణో దారుణత్వాత్స సన్మార్గస్య విరోధినామ్*
*సన్మార్గమునకు విరోధులగు వారికి దారుణుడు లేదా భయంకరుడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 569 🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻 569. Dāruṇaḥ 🌻*
*OM Dāruṇāya namaḥ*
दारुणो दारुणत्वात्स सन्मार्गस्य विरोधिनाम् /
*Dāruṇo dāruṇatvātsa sanmārgasya virodhinām*
*As being hard on the enemies of the righteous path.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥
సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥
Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,Divisprk sarvadrg vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 18 / Agni Maha Purana - 18 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 7*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. అయోధ్యాకాండ వర్ణనము - 1 🌻*
నారద ఇట్లు పలికెను:
రాముడు వసిష్ఠుని, తల్లులను నమస్కరించి వారిని తిరిగి పంపి వేసి చిత్రకూటమునుండి బయలుదేరి దండకారణ్యము వైపు వెళ్ళుచు మార్గ మధ్యమున అత్రిమహామునిని, ఆతని భార్య యైన అనసూయను, శరభంగుని, సుతీక్‌ష్ణని, అగస్త్యభ్రాతను, అగస్త్యుని చూచి నమస్కరించెను. ఆగస్త్యుని అనుగ్రహము వలన ధనస్సును, ఖడ్గమును పొంది, దండకారణ్యము చేరెను.
జనస్థానమునందు గోదావరీతీరమున, పంచవటిలో నివసించెను. భయంకరులా లైన శూర్పణఖ వారిని భక్షించుటకై అచటికి వచ్చెను. మంచి రూపము గల రాముని చూచి ఆమె కామమోహితురాలై ఇట్లు పలికెను.
శూర్పణఖ ఇట్లు పలికెను. '' నీవు ఎవరవు ? ఎక్కడనుండి వచ్చినావు ? నేను కోరుచున్నాను. నాకు భర్త వగుము. ఈ ఇద్దరినీ భక్షించెదను. ఇట్లు పలికి ఆమె సీతాలక్ష్మణులను భక్షించుటకు ఉద్యమించెను. అపుడు రాముడు ఆజ్ఞాపింపగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసివేసెను.
రక్తము స్రవించుచుండగా ఆమె వెళ్ళి సోదరుడైన ఖరునితో ఇట్లనెనను. '' ఖరుడా ! ముక్కు లేని నేను మరణించెదను. కాని రాముని భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు ఉన్నారు. నీవు వారి గోరువెచ్చని రక్తమును త్రాగించినచో జీవించెదను.
అట్లే చేసెదను అని పలికి ఖరుడు పదునాలుగు వేలమంది రాక్షసులను, దూషణ - త్రిశిరస్కులను తనతో తీసుకొని రామునితో యుద్ధము చేయుటకు వెళ్ళెను. రాముడు కూడ యుద్ధమునందు బాణములచే రాక్షసులను కొట్టి ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు అను నాలుగు అంగములు గల సైన్యమును, త్రిశిరన్కుని, భయంకరుడైన ఖరుని, యుద్ధము చేయుచున్న దూషణుని యమలోకమునకు పంపెను.
శూర్పణఖ లంకకు వెళ్ళి రావణుని ఎదుట నేలపై బడి, క్రుద్ధురాలై రావణునితో ఇట్లు పలికెను. ''నీవు రాజువు కావు. రక్షకుడవు కావు. ఖరాదులను చంపిన రాముని భార్య యైన సీతను హరించి భార్యను చేసికొనుము. రామలక్ష్మణుల రక్తము త్రాగిన యడలనే జీవించెదను. అట్లు కానిచో జీవింపను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana -18 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
Chapter 7
*🌻 Ayodhya Kand - Vishnu as Rama - 1 🌻*
Nārada said:
1-2. Rāma bowed to Vasiṣṭha, the mothers, (sage) Atri and his wife Anasūyā, (sages) Śarabhaṅga[1] and Sutīkṣṇa, the brother of Agastya and Agastya and reached the Daṇḍaka forest having obtained the bow and sword by the grace of (Agastya).
3. He was staying at Pañcavaṭī in the Janasthāna on the banks of the (river) Godāvarī. The awful (demoness) Śūrpaṇakhā[2] came there to devour them all.
4-5. Seeing the beautiful form of Rāma, that lustful (woman) said to him, “Who are you? Whence have you come? You become my husband being entreated by me. I shall eat these two.” So saying to him she approached them. On the words of Rāma, Lakṣmaṇa cut off her nose and ears.
6-7. She returned to her brother Khara with blood oozing out (and) said, “I shall die without a nose. I would live, O Khara! only when you would make me drink the hot blood of Sītā, the wife of Rāma and Lakṣmaṇa, his brother.
8. Khara said to her that he will do so and went there with Dūṣaṇa, Triśiras and 14000 demons in order to fight (with. Rāma).
9-10. Rāma also fought well and killed the demons with his. arrows and led the army consisting of the elephants, cavalry,. chariots and infantry together with the fighting Triśiras, Khara and Dūṣaṇa[3] to death. Śūrpaṇakhā went to Laṅkā and fell down, on the earth in front of Rāvaṇa.
11-12. (And) said to Rāvaṇa angrily, “You are neither a king, nor a protector. You abduct Sītā, the wife of Rāma, the killer of Khara and others. I will live only after drinking the blood of Rāma and Lakṣmaṇa and not by anything else.”
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 248 / DAILY WISDOM - 248 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻4. విశ్వచైతన్యపు ఉనికి వివరాల కంటే భిన్నమైనది 🌻*
*చాలా కాలంగా, సాధారణ బాహ్య వివరాల నుండి స్వతంత్రంగా ఉన్న విశ్వ చైతన్య ఉనికిని ఊహించటం తత్వవేత్తలకి కష్టమైంది. ఎందుకంటే ఇది సార్వత్రికమని ఒక సంగ్రహణ తప్పుగా ఊహించబడింది కనుక. బాహ్య వివరాలలో కనిపించే కొన్ని సాధారణ లక్షణాల నుండి ఉత్పన్నమయ్యే సంభావిత సాధారణీకరణ వలన. ఉదాహరణకి గుర్రపుస్వారీ లాంటి సార్వత్రిక సూత్రం ప్రతి గుర్రం విషయంలోనూ కనిపిస్తుంది. కానీ వ్యక్తిని పదార్ధంగా చూసినప్పుడు విశ్వ చైతన్యం అంతే నాణ్యతగా ప్రతివ్యక్తిలో ఉండవలసిన అవసరం కానీ ఉన్నట్టుగా గానీ కనబడదు. ఈ విశ్వచైతన్య ఉనికి అనేది అన్ని ఆకులలో కనిపించే పచ్చదనం లేదా గులాబీలలో కనిపించే ఎరుపు వంటిదిగా, వేరే పదార్ధం యొక్క నాణ్యతగా గానీ ఉండదు.*
*సార్వత్రిక నిర్వచనంలో అంతకంటే లోతైన విషయాలు ఉన్నాయనే అవగాహన పూర్తిగా విస్మరించబడినప్పుడు మాత్రమే నామమాత్రపు దృక్పథం అనేది ఉత్పన్నమవుతుంది. స్పృహ-గ్రహణం అనే ముందస్తు మూలకం విశ్వచైతన్య ఉనికిలో ఉంటే తప్ప ఒకే చర్యలో గల అన్నింటినీ తెలిసికో గలగడం సాధ్యం కాదు. అటువంటి స్పృహతో కూడిన గ్రహింపు సామర్థ్యమే రుజువు చేస్తుంది, విశ్వచైతన్యం బాహ్య వివరాల కంటే పరిమాణంలో పెద్దదని, ప్రతిదానిలో అంతర్లీనంగా ఉంటూనే, వాటికి అతీతంగా కూడా ఉంటుదని, దాని ద్వారా అది అన్నింటినీ తెలుసు కుంటుందని, అన్నింటికంటే భిన్నమైనదని.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 248 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 4. A Universal Independent of Particulars 🌻*
*Philosophers, many a time, have found it difficult to imagine the existence of a universal independent of particulars. This difficulty arises because it is wrongly assumed that the universal is an abstraction, a conceptual generalisation arising from some common features seen in particulars, such as the universal principle of horseness seen to be present in each individual case of a horse. But the Universal need not be a quality depending upon an isolated individual as a substance.*
*The Universal is not like the greenness seen in all leaves or the redness seen in roses. That is to say, the Universal is not a quality of a substance other than itself. Such a nominalism of outlook in the definition of the Universal can arise only if one is completely oblivious of the fact that even the awareness of there being such things as particulars would not be possible unless there is a prior element of consciousness-grasp which knows all the particulars in a single act of attention, proving thereby that such a consciousness is larger in dimension than the particulars, is immanent in them, by which immanence it knows them, and is also transcendent to them due to which it is none of the particulars.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
#PrasadBhardwaj
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 149 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. నీకు ప్రయాణానికి అవసరమైన వన్నీ పరమాత్ముడు లోపలే సమకూర్చిపెట్టాడు. అది నీలో నువ్వు వెతకాలి. మనిషి తనకు తనే దీపం. పవిత్ర గ్రంథాలు నీకు మార్గదర్శక మవుతాయన్న అభిప్రాయాన్ని వదిలిపెట్టు. వాటి నించి జ్ఞానం వస్తుంది. ఆధ్యాత్మిక అన్వేషణకు అది పెద్ద అడ్డంకి. 🍀*
*మనిషి తనకు తనే దీపం. పవిత్ర గ్రంథాలు నీకు మార్గదర్శక మవుతాయన్న అభిప్రాయాన్ని వదిలిపెట్టు. వాటి నించి జ్ఞానం వస్తుంది. ఆధ్యాత్మిక అన్వేషణకు అది పెద్ద అడ్డంకి. దానికి బయటి నించీ ఏమీ అక్కర్లేదు. నీకు ప్రయాణానికి అవసరమైన వన్నీ పరమాత్ముడు లోపలే సమకూర్చిపెట్టాడు. అది నీలో నువ్వు వెతకాలి.*
*పొరపాటును వదిలి సరియినది కనిపెట్టడానికి నీ లోపలి కాంతి నీకు ఉపకరిస్తుంది. ఉనికి కేసి సాగడానికి నీకు దారి చూపిస్తుంది. యితరుల మీద ఆధారపడిన వాళ్ళు అవకాశాన్ని చేజార్చు కుంటారు. నేను మీకు దారి ఎలాంటిదో చెబుతాను. దారి చూపను. ఏ విధంగా ఏ పద్దతిలో వుంటే మీరు సత్యాన్ని అందుకుంటారో చెప్పను. మీరు మీరుగా ఉండడానికి మాత్రమే సహకరిస్తాను.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 87 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 73. వ్యర్ధులు 🌻*
*వేగవంతముగ పురుగులను తిను పక్షికిని, పెద్ద పెద్ద జంతువులను తిను రాబందులకు తేడా తెలియుట అవసరము. చిన్న చిన్న తప్పులు చేయు బలహీనులకు, భయంకరమగు తప్పులు చేయు దుష్టులకు గల వ్యత్యాసము తెలియవలెను. ప్రస్తుత కాలమున దుష్టులు వారి దౌష్ట్య నిర్వహణమున చిన్నవారి తప్పులు పెద్దవి చేసి దండించు చున్నారు. బలవంతులు బలహీనులపై ఆరోపణలు మోపి దండించు చున్నారు. ఈ బలవంతులు భూమిపై అత్యంత ధనికులుగను, భయంకరమగు శక్తివంతులుగను ఏర్పడుచు జాతిని కబళించు చున్నారు.*
*ఆధ్యాత్మికులు కూడ వీరి పంచన చేరి వారి మోచేతి నీరు త్రాగుచు దివ్యపురుషులమని తమని తాము గౌరవించుకొనుచున్నారు. పేదలకన్న ధనికులను, సామాన్యునికన్న అధికారులను ఎక్కువగా ఆదరించు సత్పురుషులందరును కలికి అమ్ముడు పోయిన వారే. వీరి వలన సామాన్య జనజీవనమునకు ఉపయోగమేమియు లేదు. గాడిదల వలె ధనికుల కర్మములను మోయుచు, పుణ్యము క్షీణింప చేసుకొనుచున్నారు. వీరిది వ్యర్థ ప్రయత్నము.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment