శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 372-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 372-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 372-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 372-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀
🌻 372 -1. 'భక్తమానస హంసికా'🌻
భక్తుల చిత్తమందు హంసవలె నుండునది శ్రీదేవి అని అర్ధము. భక్తు లనగా నిర్మల చిత్తము కలవారు. నిర్మల చిత్త మనగా ఎట్టి మలములు లేనిది. దీనిని మానస సరోవరమని కూడ అందురు. అచట ప్రశాంతత ప్రధానముగ నుండును. చల్లదనము, నిశ్శబ్దము సతత ముండును. ఇట్టి చిత్తము లందు హంసవలె శ్రీదేవి వసించి యుండును. హృదయ మందలి స్పందనాత్మక చైతన్యముగ తేలియాడు చుండును. 'సో హం' అను శబ్దము నిరంతరము నిర్మల చిత్తమున దర్శించవచ్చును. ఇట్లు దర్శించువారు హంసదర్శను లగుదురు. క్రమముగ హంస లగుదురు.
ఇట్టి హంసలైన భక్తులు ప్రపంచ ప్రభావమునకు లొంగరు. వారు చరమగు ప్రపంచము నుండి విడివడి ఆ ప్రపంచమున తేలియాడు చుందురు. వారు ముముక్షువులు. చిత్తమున హంసలై నిలచిన వారి ప్రజ్ఞలు సూక్ష్మస్పందనమును గూర్చిన ధ్యానములో నిమగ్నమై యుండును. వీరు సహజముగ అంతర్ముఖులు. కర్తవ్యములను బట్టి బహిర్ముఖు లగుచుందురు. కర్తవ్యము లేనిచో వారి ఇంద్రియములు గాని, కర్మేంద్రియములుగాని కదలవు. ఊరకే తిరుగుట, కదలుట, మాటాడుట యుండవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 372 -1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻
🌻 372-1. Bhakta-mānasa-haṁsikā भक्त-मानस-हंसिका 🌻
There is a small story about associated with this nāma. Brahma, the God of creation created a lake called Mānasarovar at the top of mount Kailāsa. The water in this lake is known for its highest purity. The lake exists even today. Swans always prefer purity and hence flock around this lake.
The lake is compared to the mind (which has to be pure) and the swans (normally a pair of swan) are compared to jīvātma-s (souls) and Paramātma (the Brahman)} are compared to Lalitāmbikā. This story says that Brahman has a great liking for a pure mind and chooses to stay there forever, guiding the aspirant from within.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
17 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment