కపిల గీత - 9 / Kapila Gita - 9


🌹. కపిల గీత - 9 / Kapila Gita - 9🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి-3 🌴


9. య ఆద్యో భగవాన్పుంసామీశ్వరో వై భవాన్కిల
లోకస్య తమసాన్ధస్య చక్షుః సూర్య ఇవోదితః

లోకములో ఉన్న అన్ని బ్రహ్మాండములలో ఈశ్వరుడూ (ఐశ్వర్య కలవాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం అంటే లోపల ఉండి శాసించే వాడు. ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకోగలగాలి, తెలుసుకుని వాటిని తొలగించగలగాలి. ఈ రెండూ చేయగలవాడు ఈశ్వరుడు.) భగవంతుడూ ఆది పురుషుడూ నీవే కదా. అజ్ఞ్యానమనే చీకటిలో ఉన్న ఈ లోకానికి కన్ను వంటి వాడివి. సూర్యుడు ఎలా ఐతే లోకానికి వెలుగో అలాగే నీవు కూడా ఈ లోకానికి వెలుగు. (సూర్య చంద్రాగ్ని నేత్రవాన్ అని పరమాత్మకి పేరు. ఈ మూడు కళ్ళతో పరమాత్మ చూస్తాడు )


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 9 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 Devahuti Desires Transcendental Knowledge -3 🌴

9. ya adyo bhagavan pumsam isvaro vai bhavan kila
lokasya tamasandhasya caksuh surya ivoditah


You are the Supreme Personality of Godhead, the origin and Supreme Lord of all living entities. You have arisen to disseminate the rays of the sun in order to dissipate the darkness of the ignorance of the universe.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


17 May 2022

No comments:

Post a Comment