శ్రీ శివ మహా పురాణము - 565 / Sri Siva Maha Purana - 565



🌹 . శ్రీ శివ మహా పురాణము - 565 / Sri Siva Maha Purana - 565 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴

🌻. పతివ్రతా ధర్మములు - 3 🌻

'నాథా! ఏల పిలిచితిరి? పని చెప్పి అను గ్రహించుడు' అని పలికి ఆయన ఆదేశించిన పనిని ప్రసన్నమగు మనస్సుతో చేయవలెను (21). ద్వారము వద్ద చిరకాలము నిలబడరాదు. ఇతరుల గృహమునకు పోరాదు. భర్త హృదయములోని భావము నెరింగి ప్రవర్తించవలెను. దేనిని పడితే దానిని ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ఈయరాదు (22). పూజాసామగ్రిని భర్త చెప్పకుండగనే స్వయముగా సర్వమును సంపాదించవలెను. హితమును చేయు అవకాశము కొరకు ఎదురు చూస్తూ సందర్భమునకు తగినట్లుగా హితమును ఆచరించవలెను (23). భర్త అనుమతి లేనిదే తీర్థయాత్రకు ఎచ్చటికైననూ వెళ్లరాదు. పతివ్రత సమాజోత్సవములకు దూరముగా నుండవలెను (24)

తీర్థములను సేవించ గోరు స్త్రీభర్తపాదోదకము త్రాగవలెను. సర్వక్షేత్రములు, తీర్థములు దానియందే గలవనుటలో సందేహము లేదు (25). భర్త భుజించిన తరువాత మిగిలిన మృష్టాన్నమును, ఇతర భోజ్యములను భర్త ఇచ్చిన మహా ప్రసాదము అను భావనతో స్వీకరించి భుజించవలెను (26).

పతివ్రత దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, పరిచారకులకు, గోవులకు మరియు భిక్షుకులకు, పెట్టకుండగా తాను తినరాదు (27). పతివ్రతా ధర్మమునందు నిష్ఠగల దేవి గృహవస్తవులను పొందికగా భద్రముగా నుంచుకొనవలెను. ఆమె సామర్థ్యముతో ఇంటిని పొదుపుగా నిర్వహించవలెను. ఆమె సర్వదా ఆనందముగా నుండి దుర్వ్యయమును విసర్జించవలెను (28).

భర్త అనుజ్ఞ లేనిచో ఉపవాసములు, వ్రతములు మొదలగు వాటిని చేయరాదు. అట్లు చేసినచో ఆ ఫలము లభించక పోవుటయే గాక, మరు జన్మలో నరకము లభించును (29). సుఖముగా భర్త కూర్చుని యుండగా, లేక స్వేచ్ఛచే క్రీడించుచుండగా ఆటంకమును కలిగించరాదు. భర్త నిద్రించుచున్న సమయములో ఆవశ్యకమగు కార్యము ఉన్ననూ నిద్ర లేపరాదు (30).

భర్త అసమర్థుడైననూ, దురవస్థలో నున్ననూ, వ్యాధిగ్రస్తుడైననూ, వృద్ధుడే అయిననూ, సుఖము గలవాడైననూ, లేక దుఃఖియైననూ, పతివ్రత భర్తను ఉల్లంఘించరాదు (31). రజస్వలా సమయములో భర్తకు దూరముగా నుండవలెను. స్నానము అగువరకు కబుర్లాడరాదు (32).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 565 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴

🌻 Description of the duties of the chaste wife - 3 🌻

21. “O lord, be pleased to say what I have been called for.” Whenever ordered by him to do any job she shall do it gladly.

22. She shall not stand near the entrance for a long time. She shall not go to other people’s house. She shall not take his money, even though it be a little, and give it to others.

23. Without being told she shall arrange the necessary requisities for his daily worship. She shall wait for the opportunity to do him a timely service.

24. Without the permission of her husband she shall not go even on pilgrimage. She shall eschew the desire to attend social festivities.

25. If a women wants holy water she shall drink the same with which her husband’s feet have been washed. All holy rivers are present in that water.

26. She shall partake of the leavings of her husband’s food or whatever is given by him saying “This is thy great grace.”

27. She shall never take food without first offering due share to the gods, the Pitṛs, the guests, the servants, cows and saintly mendicants.

28. A gentle lady of chaste rites shall always be clever to manage the household with limited requisites. She shall be averse to spend unnecessarily.

29. Without being permitted by her husband she shall not observe fast and other rites. Should it be so, she will derive no benefit. She may fall into hell in other worlds.

30. While the husband is sportively engaged or seated comfortably she shall not worry him to get up under the pretext of attending to some household work.

31. Whether he is impotent, distressed, sick or senile, happy or unhappy, the husband shall never be transgressed.

32. During the three days of her monthly course she shall neither show her face nor speak to him. She shall not speak within his hearing till she becomes pure after her bath.



Continues....

🌹🌹🌹🌹🌹



17 May 2022

No comments:

Post a Comment