శ్రీ మదగ్ని మహాపురాణము - 49 / Agni Maha Purana - 49


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 49 / Agni Maha Purana - 49 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 18

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 3 🌻


యజ్ఞము చేయుచున్నప్పుడు కుశలు, వాటి అగ్రములు తూర్పు వైపున కుండు నట్లు భూమిపై పరవబడెను. అందుచే పూజ్యు డైన ఆ ప్రజాపతికి ''ప్రాచీన బర్హిస్సు'' అను పేరు వచ్చెను.

సముద్రుని కుమార్తె యైన సవర్ణ ప్రాచీనబర్హిస్సువలన పదిమంది కుమారులను కనెను వారందరికిని ప్రచేతను లనియే పేరు. వారందరును ధనుర్వేదమునందు పరిపూర్ణప్రజ్ఞ కలవారు.

ఒకే విధముగా ధర్మము నాచరించుచున్న వారందరును సముద్ర జలమున నివసించి పది వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసిరి.

వారు విష్ణువునుండి ప్రజాపతిత్వమును పొంది, సంతసించినవారై సముద్రజలమునుండి లేచిరి అపుడు భూమ్యాకాశములు వృక్షములచే వ్యాప్తములై యుండెను వారు తమ ముఖమునుండి పుట్టిన అగ్ని వాయువులచే ఆ వృక్షములను దహింపచేయ మొదలిడిరి. అపుడు రాజైన సోముడు ప్రజాపతుల దగ్గరికి వెళ్లి-- ''కోపమును ఉపసంహరింపుడు భవిష్యత్తును గూర్చి తెలిసిన నేను తపశ్శాలి యగ కండుముని కుమార్తె యైన ప్రవ్లూెచయందు ఉత్తమురాలగు మారిషయను కన్యను జనింపచేసితిని ఆమెను మీకు ఇచ్చెదరు. ఆమె మీ వంశమును వృద్ది పొందించు బార్య యగుగాక. ఆమెయందు పట్టిన దక్షుడు ప్రజలను వృద్దిపొందించును.

ప్రచేతసులు ఆమెను స్వీకరించిరి. ఆమెకు దక్షుడును కుమారుడు జనించెను. ఆతడు మనస్సుచే స్థావరజంగమములకు, ద్విపాత్తులను (మనుష్యులు మొదలగువారిన) చతుష్పాత్తులను (నాలుగు కాళ్ళుగల పశ్వాదులను.) సృజించి పిమ్మట స్త్రీలను సృజించెను. వారిలో పదిమందిని యమధర్మరాజునకును, పదముగ్గురిని కశ్యపునకును, సోమునకు ఇరువది యేడుగురిని, అరిష్టనేమికి నలుగురిని, బహుపుత్రునకు ఇద్దరిని, ఆంగిరసునకు ఇద్దరిని ఇచ్చెను. పూర్వము వారియందు మానస మైథునముచే దేవతలును నాగాదులను జనించిరి.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 49 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 18

🌻 Genealogy of Svāyambhuva Manu - 3 🌻


21. (He was known as Prācīnabarhis) because the kuśa grass were facing the east as he was praying on the earth.[13] The lord Prācīnabarhis was a great progenitor.

22. Savarṇā, the daughter of Samudra (the lord of the ocean) bore ten Prācīnabarhis. All of them were known as Pracetas and were proficient in archery.

23. Practising the same religious austerities, they all did severe penance, remaining in the waters of the ocean for ten thousand years.

24. Having got the status of a progenitor and pleased Viṣṇu, they came out (of waters) (and found) that the earth and the sky were overspread with trees. They burnt them down.

25. Beholding the destruction of trees _by the fire and wind produced from their mouths, Soma, the king (of plants) approached these progenitors and said:

26-27. “Renounce (your) anger, I will get you this most excellent maiden Māriṣā, (born to) (the nymph) Pramlocā and the ascetic sage Kaṇḍu (who was nourished) by me. Having known the future (I have) created (her). Let (she) be your wife, capable of multiplying the family. Dakṣa will be born to her who will multiply progeny.”

28-30. The Pracetas married her and Dakṣa was born through her. That Dakṣa, having mentally created the immovables, movables, hi-footed beings and the quadrupeds, then created the (sixty) daughters (of whom) he gave[14] ten to Dharma, thirteen to Kaśyapa, twenty-seven to Soma, four to Ariṣṭanemin, two to Bahuputra, two to Aṅgiras.



Continues....

🌹 🌹 🌹 🌹 🌹


17 May 2022

No comments:

Post a Comment