✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 19 🌴
19. బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే |
వాసుదేవ: సర్వమితి స మహాత్మా సుదుర్లభ: ||
🌷. తాత్పర్యం :
జ్ఞానవంతుడైన వాడు బహు జన్మమృత్యువుల పిదప నన్నే సర్వకారణములకు కారణునిగను మరియు సమస్తముగను తెలిసికొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు.
🌷. భాష్యము :
భక్తియుతసేవ నొనరించుచు జీవుడు పలుజన్మల పిదప శ్రీకృష్ణభగవానుడే ఆధ్యాత్మికానుభవపు చరమలక్ష్యమును దివ్యమగు శుద్ధజ్ఞానమునందు వాస్తవముగా స్థితుడు కాగలడు. ఆధ్యాత్మికానుకానుభవపు ఆది యందు మనుజుడు భౌతికత్వసంపర్కమును తొలగించుకొను యత్నము చేయునపుడు కొంత నిరాకారభావము వైపునకు మ్రొగ్గుచూపుట జరుగును. కాని అతడు తన యత్నములో పురోభివృద్ధి నొందినప్పుడు ఆధ్యాత్మిక జీవనమున పెక్కు కర్మలు గలవనియు, అవియే భక్తియుత సేవాకార్యములనియు అవగతము చేసికొనును. ఆ విధముగా అతడు తెలిసికొని శ్రీకృష్ణభగవానుని యెడ ఆకర్షితుడై అతనిని శరణుజొచ్చును.
అట్టి సమయముననే మనుజుడు శ్రీకృష్ణభగవానుని కరుణయే సర్వస్వమనియు, అతడే సర్వకారణములకు కారణమనియు, విశ్వము అతని నుండి స్వతంత్రమై యుండదనియు అవగాహనము చేసికొనును. ఈ జగత్తు ఆధ్యాత్మికవైవిధ్యము యొక్క వికృత ప్రతిబింబమనియు మరియు ప్రతిదియు దేవదేవుడైన శ్రీకృష్ణునితో ఒక సంబంధము కలిగియున్నదనియు అంతట అతడు తెలియగలుగును. ఆ విధముగా అతడు ప్రతిదానిని వాసుదేవపరముగా లేదా కృష్ణపరముగా గాంచును. అట్టి విశ్వాతమకమగు వాసుదేవా దృష్టి శ్రీకృష్ణభగవానుని శరణుపొందుటయే ఉత్తమోత్తమ గమ్యమనెడి భావనకు చేర్చగలదు. కాని అట్టి శరణాగతులైన మహాత్ములు అతి అరుదుగా నుందురు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 299 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 7 - Jnana Yoga - 19 🌴
19. bahūnāṁ janmanām ante jñānavān māṁ prapadyate
vāsudevaḥ sarvam iti sa mahātmā su-durlabhaḥ
🌷 Translation :
After many births and deaths, he who is actually in knowledge surrenders unto Me, knowing Me to be the cause of all causes and all that is. Such a great soul is very rare.
🌹 Purport :
The living entity, while executing devotional service or transcendental rituals after many, many births, may actually become situated in transcendental pure knowledge that the Supreme Personality of Godhead is the ultimate goal of spiritual realization. In the beginning of spiritual realization, while one is trying to give up one’s attachment to materialism, there is some leaning towards impersonalism, but when one is further advanced he can understand that there are activities in the spiritual life and that these activities constitute devotional service. Realizing this, he becomes attached to the Supreme Personality of Godhead and surrenders to Him.
At such a time one can understand that Lord Śrī Kṛṣṇa’s mercy is everything, that He is the cause of all causes, and that this material manifestation is not independent from Him. He realizes the material world to be a perverted reflection of spiritual variegatedness and realizes that in everything there is a relationship with the Supreme Lord Kṛṣṇa. Thus he thinks of everything in relation to Vāsudeva, or Śrī Kṛṣṇa. Such a universal vision of Vāsudeva precipitates one’s full surrender to the Supreme Lord Śrī Kṛṣṇa as the highest goal. Such surrendered great souls are very rare.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment