శ్రీ శివ మహా పురాణము - 660 / Sri Siva Maha Purana - 660

🌹 . శ్రీ శివ మహా పురాణము - 660 / Sri Siva Maha Purana - 660 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 17 🌴

🌻. గణేశుడు మరల జీవించుట - 4 🌻


ఎంతవరకు గిరిజాదేవి దయను చూపదో,అంతవరకు సుఖము కలిగే ప్రశక్తియే లేదు. ఈ విషయములో చర్చించదగినది లేదు (29). ఋషులు నిన్ను ముందిడు కొని పార్వతి వద్దకు వెళ్లిరి. అపుడు వారందరు ఆమె యొక్క క్రోధమును శాంతింపజేసి ప్రసన్నురాలిని చేయుటకు యత్నించిరి(30). వారు దేవతల మరియు గణముల ఆజ్ఞచే ఆమెకు అనేక పర్యాయములు ప్రణమిల్లి అనేక స్తోత్రములతో స్తుతించి ప్రీతితో ప్రసన్నురాలిని చేసి ఇట్లు పలికిరి(31).


దేవర్షలు ఇట్లు పలికిరి-

జగన్మాతా! నీకు నమస్కరము. శివసత్నివగు నీకు వందనములు.చండికవగు నీకు నమస్కారము. మంగళమునిచ్చు నీకు నమస్కారము (32). అమ్మా! ఆది శక్తివి నీవే. సదా సర్వసృష్ఠిని చేయునది నీవే. జగత్తును పాలించు శక్తిని నీవే. ప్రలయమును చేయుదానవు నీవే (33). ఓ దేవదేవీ! ప్రసన్నురాలవు కమ్ము. శాంతినా పొందుము. నీకు నమస్కారమగు గాక! దేవి! నీవు కోపించుటచే ముల్లోకములలో సర్వము అల్లకల్లోలమాయెను (34).


బ్రహ్మ ఇట్లు పలికెను -

35. ఈ విధంగా మీరు మరియు ఇతర ఋషులచే స్తుతించబడిన మహా దేవత పార్వతి వైపు ఆవేశంగా చూసింది. ఆమె ఏమీ మాట్లాడలేదు.

36. అప్పుడు ఋషులు పాదాల వంటి ఆమె కమలానికి నమస్కరించారు మరియు భక్తితో తమ అరచేతులను భక్తితో కలుపుతూ ఆమెతో తక్కువ స్వరంతో మాట్లాడారు.


ఋషులిట్లు పలికిరి -

ఓ దేవీ! ఇపుడు సంహారము కొనసాగుచున్నది. నీ భర్త ఇచట ఉన్నాడు. అమ్మా! ఆయనను చూడుము. చూడుము(37). మేము, విష్ణువు, బ్రహ్మ మొదలగు ఈ దేవతలు ఎంతటి వారము? మేము నీ సంతానమే. నీ యెదుట చేతులు జోడించి నిలబడినాము (38). ఓ పరమేశ్వరీ! శివపత్నీ! అందరి అపరాధమును క్షమించుము. ఈ నాడందరు దుఃఖితులై ఉన్నారు. వారికి శాంతిని కలిగించుయము (39).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 660🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 17 🌴

🌻 The Resuscitation of Gaṇeśa - 4 🌻


29. As long as the goddess Pārvatī does not favour us there will be no happiness. No suspicion need be entertained in this matter.

30. You and other sages went to Pārvatī in order to appease her anger. They then propitiated her.

31. They bowed to her again and again. They eulogised her with many hymns. They tried to please her with devotion and at the behest of the gods and Gaṇas spoke thus.


The celestial sages said:—

32. O Mother of the universe, obeisance to you. Obeisance to you, O Śivā. Obeisance to you. O Caṇḍikā. Obeisance to you, Kalyāṇī.

33. O mother, you alone are the primordial Śakti. You are the eternal cause of creation. You alone are the sustaining power. You alone are the cause of dissolution.

34. O goddess, be pleased. Spread peace. Obeisance be to you. O goddess, the three worlds are agitated by your fury.


Brahmā said:—

35. The great goddess Pārvatī thus eulogised by you and other sages glanced at them furiously. She did not say anything.

36. Then the sages bowed at her lotus like feet and spoke to her in low voice with devotion joining their palms in reverence.


The sages said:—

37. O goddess, forgive, forgive. The final dissolution seems near at hand. Your lord is standing here. O mother, you see him.

38. What are we, the gods, Viṣṇu, Brahmā and others? We are only your subjects. We stand here with palms joined in reverence.

39. O great goddess, our guilts shall be forgiven. We are agitated and distressed. O Pārvatī give us peace.


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment