1) 🌹 22 - DECEMBER - 2022 TUESDAY, గురువారం బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 107 / Kapila Gita - 107 🌹 సృష్టి తత్వము - 63
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 699 / Vishnu Sahasranama Contemplation - 699 🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 146 / Agni Maha Purana - 146 🌹 🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 5🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 281 / Osho Daily Meditations - 281 🌹 281. శరీరం - The Body
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 420 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 2 🌹. 420. 'గాయత్రీ' - 2 'Gayatri' - 2
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹22, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : సంవత్సరంలో అతి చిన్న రోజు, Shortest Day of Year 🌺*
*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 20 🍀*
*20. విలుప్తమూర్ధన్య లిపిక్రమాణా*
*సురేంద్రచూడా పదలాలితానాం*
*త్వదంఘ్రి రాజీవరజఃకణానాం*
*భూయాన్ప్రసాదో మయి నాథ భూయాత్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఈశ్వర నిర్దిష్టమైన త్రైపథమందు కర్మ మార్గమనేది ఒక విధంగా అత్యంత కష్టంతో కూడినడే అయినా వేరొక విధంగా అది అత్యంత సుగమం, సువిశాలం, మహోల్లాసకరం అని కూడా చెప్పవచ్చు. ఏల నంటే, అడుగడుగునా అందు మనం కర్మక్షేత్రమున ఈశ్వరునితో సంఘర్షిస్తూ, సహస్రాధిక దివ్యస్పర్శలతో ఈశ్వర తత్వావిష్కారాన్ని మనలో పొందగలుగుతూ వుంటాము.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మృగశిర మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 19:14:41
వరకు తదుపరి అమావాశ్య
నక్షత్రం: జ్యేష్ఠ 28:03:15 వరకు
తదుపరి మూల
యోగం: శూల 17:44:32 వరకు
తదుపరి దండ
కరణం: విష్టి 08:47:25 వరకు
వర్జ్యం: 11:34:00 - 13:00:00
దుర్ముహూర్తం: 10:23:32 - 11:07:54
మరియు 14:49:46 - 15:34:08
రాహు కాలం: 13:37:40 - 15:00:52
గుళిక కాలం: 09:28:04 - 10:51:16
యమ గండం: 06:41:40 - 08:04:52
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:36
అమృత కాలం: 20:10:00 - 21:36:00
సూర్యోదయం: 06:41:40
సూర్యాస్తమయం: 17:47:16
చంద్రోదయం: 05:19:30
చంద్రాస్తమయం: 16:39:14
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు : కాలదండ యోగం -
మృత్యు భయం 28:03:15 వరకు
తదుపరి ధూమ్ర యోగం - కార్య
భంగం, సొమ్ము నష్టం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 107 / Kapila Gita - 107🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 63 🌴*
*63. వహ్నిర్వాచా ముఖం భేజే నోదతిష్థత్తదా విరాట్|*
*ఘ్రాణేన నాసికే వాయుర్నోదతిష్థత్తదా విరాట్॥*
*ఆ విరాట్ పురుషుని మేల్కొలుపుటకై అగ్ని వాక్కుతో గూడి ముఖమునందు ప్రవేశించెను. కాని, విరాట్పురుషుడు మేల్కొనలేదు. వాయువు ఘ్రాణేంద్రియముతో గూడి నాసికారంధ్రముల యందును ప్రవేశించెను. కాని విరాట్పురుషుడు లేవలేదు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 107 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 63 🌴*
*63. vahnir vācā mukhaṁ bheje nodatiṣṭhat tadā virāṭ*
*ghrāṇena nāsike vāyur nodatiṣṭhat tadā virāṭ*
*The god of fire entered His mouth with the organ of speech, but the virāṭ-puruṣa could not be aroused. Then the god of wind entered His nostrils with the sense of smell, but still the virāṭ-puruṣa refused to be awakened.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 699 / Vishnu Sahasranama Contemplation - 699🌹*
*🌻699. సద్గతిః, सद्गतिः, Sadgatiḥ🌻*
*ఓం సద్గతయే నమః | ॐ सद्गतये नमः | OM Sadgataye namaḥ*
*అస్తి బ్రహ్మేతి చేద్వేద సన్తమేనం తతో విదుః ।*
*ఇతి శ్రుతేర్బ్రహ్మాస్తితి యే విదుస్తైస్స ఆప్యతే ॥*
*ఇత్యథవా సముత్కృష్టాహ్యస్య బుద్ధిస్సతీ గతిః ।*
*ఇతివా సద్గతిరితి విష్ణుర్విద్వద్భిరుచ్యతే ॥*
*'బ్రహ్మ తత్త్వము ఉన్నది అను ఎరుక గలవాడు అగుచో అట్టివానిని ఉన్నవానినిగా - అనగా సత్ అను శబ్దముచే చెప్పబడదగిన వానినిగా తత్త్వవేత్తలు తలచుచున్నారు' అను తైత్తిరీయోపనిషత్ (2.6) శ్రుతి వచన ప్రమాణముచేత 'బ్రహ్మము ఉన్నది' అని నిశ్చితముగా ఎవరు ఎరుగుదురో వారు 'సత్' అనబడువారు. వారు ఆ పరమాత్మ తత్త్వము తాముగనే అగుట అను స్థితిని పొందెదరు. కావున పరమాత్మునకు 'సద్గతిః' అని వ్యవహారము.*
*లేదా గతి అనగా బుద్ధి. సత్ బుద్ధి కలవాడుగనుక ఆతండు సద్గతిః.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 699🌹*
*🌻699. Sadgatiḥ🌻*
*OM Sadgataye namaḥ*
अस्ति ब्रह्मेति चेद्वेद सन्तमेनं ततो विदुः ।
इति श्रुतेर्ब्रह्मास्तिति ये विदुस्तैस्स आप्यते ॥
इत्यथवा समुत्कृष्टाह्यस्य बुद्धिस्सती गतिः ।
इतिवा सद्गतिरिति विष्णुर्विद्वद्भिरुच्यते ॥
Asti brahmeti cedveda santamenaṃ tato viduḥ,
Iti śruterbrahmāstiti ye vidustaissa āpyate.
Ityathavā samutkrṣṭāhyasya buddhissatī gatiḥ,
Itivā sadgatiriti viṣṇurvidvadbhirucyate.
*By the śruti 'If one knows that Brahman exists, he is known as sat - the existent' (Taittirīyopaniṣat 2.6). Those that realize that Brahman exists, they are those that are sat. The Lord is attained by them; So He is their goal - Sa.dgatiḥ*
*Or Gati also means buddhi or intellect. Since He has superior buddhi, He is called Sadgatiḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥
సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥
Sadgatissatkrtissattā sadbhūtissatparāyaṇaḥ,Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 146 / Agni Maha Purana - 146 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 44*
*🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 5🌻*
అరచేయి వెడల్పు ఏడంగుళములు, మధ్యవ్రేలు పొడవు ఐదు అంగుళములు, తర్జనీ-అనామికల పొడవు దానికంటె అర అంగుళము. తక్కువగా ఉండవలెను. కనిష్ఠకా-అంగుష్ఠముల పొడవు నాలుగు అంగుళములు. బొటనవ్రేలికి రెండుకణుపులు, మిగిలిన వాటికి మూడేసి కణుపులు ఏర్పరింపవలెను. గోళ్ళ పొడవు ఒక కణుపు పొడవులో సగముండవలెను. వక్షస్థలమెంత ఉన్నదో పొట్ట అంతే ఉండవలెను. నాభిరంధ్రము ఒక అంగుళముండవలెను. నాభినుండి లింగము వరకు జానెడు దూరముండవలెను.
ఉదరము తిరుగుడు నలుబది రెండు అంగుళములు. స్తనముల మధ్య భాగము జానెడు. స్తనాగ్రములు యవ ప్రమాణముతో ఉండవలను. స్తనముల తిరుగుడు రెండు పదములుండవలెను. వక్షస్థలము తిరుగుడు అరువది నాలుగు అంగుళములు, దాని క్రింద నాల్గువైపుల తిరుగుడు "కువేష్టనము" అనిపేరు. నడుము తిరుగుడు ఏబది నాలుగు అంగుళము. ఊరు మూలముల విస్తారము పండ్రెండేసి అంగుళములు దానిపైన మధ్యభాగ విస్తారము అధికముగా ఉండవలెను, మధ్య భాగము నుండి క్రిందికి విస్తారము క్రమముగ తగ్గవలెను. మోకాళ్ళ విస్తారము ఎనిమిది అంగుళములు. వాటికి క్రింది పిక్క విస్తారము మూడు రెట్లుండవలెను. పిక్క మధ్యభాగము విస్తారము ఏడు అంగుళము లుండవలంను. దాని తిరుగుడు మూడు రెట్లుండవలెను. పిక్క అగ్రభాగమున విస్తారము ఐదు అంగుళములు, దాని తిరుగుడు మూడు రెట్లు, పాదములు జానెడేసి పొడుగు ఉండవలెను. పాదముల ఎత్తు నాలుగు అంగుళములు మడమల ముందు భాగము కూడ నాలుగు అంగుళము లుండవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 146 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 44*
*🌻Characteristics of the image of Vāsudeva - 5 🌻*
31. The index finger and the ring finger (should be) half an aṅgula less than that. The little finger and the thumb should be made to measure four aṅgulas each.
32. The thumb should be made to have two parvans (joints). The other fingers (should have) three joints. The measure of the nail is laid down as half (the size of the joints) on the respective fingers.
33. The extent of the belly is same as that of the chest. The:navel should be an aṅgula (in breadth) and proportionally deep.
34. Then the inter-space between the generative organ and the intestines should be made to measure a tāla. The girth around the navel (should be) forty-two aṅgulas.
35. The inter-space between the breasts should be made to measure a tāla in breadth. The nipples should be of the measure of a yava[2] (barley grain). The circular space around them should be two pādas (two feet).
36. The circumference of the chest should be made sixty-four aṅgulas clearly. The girth of the lower portion (of the chest) is said to be four mukhas[3] (one tāla).
37. The circumference of the waist should be fifty-four aṅgulas. The breadth of the base of the thigh is said to be twelve aṅgulas.
38. It is somewhat greater at the middle (of the thigh) and gradually less (broad) below. The knee-joint (should be) eight aṅgulas in breadth and thrice that in its girth.
39. The middle of the leg from the ankle to the knee is said to be seven aṅgulas broad. The girth of it (should be) three times that. The top of the leg (should be) five aṅgulas broad.
40. The girth of that (the leg) (should be) thrice its breadth. The feet (should) measure a tāla. The extent of elevation of the feet (should be) four aṅgulas.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 281 / Osho Daily Meditations - 281 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 281. శరీరం 🍀*
*🕉. ఎల్లప్పుడూ మీ శరీరం చెప్పేది వినండి. అది గుసగుసలాడుతుంది, ఎప్పుడూ అరవదు. 🕉*
*గుసగుసగా మాత్రమే శరీరం మీకు సందేశాలను ఇస్తుంది. మీరు అప్రమత్తంగా ఉంటే, మీరు దానిని అర్థం చేసుకోగలరు. శరీరానికి దాని స్వంత జ్ఞానం ఉంది, ఇది మనస్సు కంటే చాలా లోతైనది. మనస్సు కేవలం అపరిపక్వమైనది. సహస్రాబ్దాలుగా శరీరం మనస్సు లేకుండానే ఉంది. మనసు ఆలస్యంగా రావడం కారణంగా దానికి ఇంకా పెద్దగా తెలియదు. అన్ని ప్రాథమిక విషయాలు శరీరం ఇప్పటికీ తన నియంత్రణలో ఉంచుకుంటుంది.*
*మనస్సుకు పనికిరాని విషయాలు మాత్రమే ఇవ్వబడ్డాయి - తత్వశాస్త్రం మరియు దేవుడు మరియు నరకం మరియు రాజకీయాల గురించి ఆలోచించడం. కాబట్టి శరీరాన్ని వినండి మరియు మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి. ఇంతకు ముందెన్నడూ నీలాంటి వ్యక్తి లేడు. ఉండడు. మీరు గతం, వర్తమానం మరియు భవిష్యత్తులో పూర్తిగా ప్రత్యేకమైన వారు. కాబట్టి మీరు మీ గమనికలను ఎవరితోనూ పోల్చలేరు మరియు మీరు ఎవరినీ అనుకరించలేరు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 281 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 281. THE BODY 🍀*
*🕉. Always listen to your body. It whispers, it never shouts. 🕉*
*Only in whispering does the body give you messages. If you are alert, you will be able to understand it. And the body has a wisdom of its own, which is very much deeper than the mind. The mind is just immature. The body has remained without the mind for millennia. The mind is a late arrival. It does not know much yet. All the basic things the body still keeps in its control.*
*Only useless things have been given to the mind-to think about philosophy and God and hell and politics. So listen to the body, and never compare yourself to anyone else. Never before has there been a person like you, and never will there be. You are absolutely unique-in the past, present, and future. So you cannot compare notes with anybody, and you cannot imitate anybody.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 420 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*
*🌻 420. 'గాయత్రీ' - 2🌻*
*ఈ వెలుగును భక్తిశ్రద్ధలతో ఆరాధించువారు ఛందో రూప మైనటువంటి సృష్టిని తెలియగలరు. నేడు వాడుకలో నున్న గాయత్రి మంత్రమును దర్శించి జాతికి అందించిన విశ్వామిత్ర మహర్షిని ఆరాధించి, గాయత్రి మాతను గానము చేయుట వలన మంత్రసిద్ధి కలుగ గలదు. ఎంతగానము చేసిన అంత రక్షణ నిచ్చునది గాయత్రి.*
*వేదమాత యగుటచే గానము, ధ్యానము చేసిన వారికి జ్ఞాన వికాసము కలిగించునది గాయత్రి. అట్లే జీవితమును గమ్యము వైపునకు నడిపించు టకు వలసిన బుద్ధి ప్రచోదనము కలిగించునది గాయత్రి. గాయత్రి వేదమాత. ఆమెయే సృష్టి సంకల్పము. ఆమె చతుర్ముఖు డగు బ్రహ్మ యందు భాసించినపుడు, చతుర్ముఖునికి సృష్టి జ్ఞానము కలుగును. ఈ సంకల్పమే లేనపుడు సృష్టియే లేదు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*
*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*
*🌻 420. 'Gayatri' - 2🌻*
*Those who worship this light with devotion can know creation in its harmony. Offering salutations to sage Vishvamitra who gave the Gayatri Mantra which is in use today and chanting it shall prove fruitful. Gayatri is the one who gives as much protection as to your chanting.*
Gayatri, being the mother of all Vedas, gives wisdom to all those who chant and meditate. It is Gayatri that inspires the mind to lead one's life towards one's goal. Gayatri is the mother of all Vedas. She is the will of creation. When she manifests in the four-faced Brahma, He gets the knowledge of creation. Without this will, there is no creation.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
No comments:
Post a Comment