నిర్మల ధ్యానాలు - ఓషో - 352
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 352 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఎవరు సృజనాత్మకంగా వుంటారో, ఎవరు నిరంతరం అన్వేషణలో వుంటారో వాళ్ళే మానవులు. సహజాతం నుంచి నంతృప్తి పడని వాళ్ళు వాళ్ళు. జీవన విధానాన్ని మెలకువతో మార్చుకోవాలనుకునే వాళ్ళు. వాళ్ళే మనుషులు. 🍀
మనిషి మూడు రకాలుగా వునికి నిలుపుకుంటాడు. జంతువులా, లేదా మానవుడిగా లేదా దేవుడిగా. సాధారణ జనం జంతువుల్లా జీవిస్తారు. అక్కడ పెద్దగా తేడా వుండదు. ఒకటే తేడా. సాధారణ జనం జంతువుల కన్నా దారుణంగా వుంటారు. సాధారణ వ్యక్తి ఏ జంతువు కన్నా హీన స్థాయికి దిగజారుతాడు. అతను మరీ మోసకాడు వంచన చేస్తాడు. అతని శక్తియుక్తుల్ని దుర్వినియోగం చేస్తాడు. సృజనాత్మకంగా కన్నా విధ్వంసనాత్మకంగా వుంటాడు. వ్యక్తి జంతువుగా పుట్టాడు. కొంత మంది మాత్రమే నిజమైన మనుషులు.
మానవత్వమన్నది పేరుకు మాత్రమే. అది యింకా రాలేదు. అది కొంతమందికే వర్తిస్తుంది. ఎవరికి దృష్టికోణముంటుంది, ఎవరు సృజనాత్మకంగా వుంటారో, ఎవరు నిరంతరం అన్వేషణలో వుంటారో వాళ్ళే మానవులు. సహజాతం నుంచి నంతృప్తి పడని వాళ్ళు, జీవన విధానాన్ని మెలకువతో మార్చుకోవాలనుకునే వాళ్ళు. వాళ్ళే మనుషులు. మరీ కొంతమంది మాత్రమే అంతిమమైన అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు. దైవత్వాన్ని అందుకుంటారు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment