శ్రీ మదగ్ని మహాపురాణము - 222 / Agni Maha Purana - 222


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 222 / Agni Maha Purana - 222 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 65

🌻. సభాగృహ స్థాపనము. - 1 🌻


హయగ్రీవుడు చెప్పెను; ఇపుడు సభాదులను స్థాపించు విధానము చెప్పెదను. భూమి పరీక్ష చేసి అచట వాస్తుపరీక్ష చేయవలెను. ఇచ్ఛానుసారముగ దేవసభా నిర్మాణము చేసి, ఇచ్ఛానుసారముగ దేవతా స్థాపన చేయవలెను. సభా నిర్మాణము నగర చతుష్పథమునందు గాని, గ్రామాదులలో గాని చేయవలెను. జనశూన్యప్రదేశములందు చేయరాదు. దేవసభా నిర్మాణము చేసినవాడు పాపరహితుడై తన వంశము నంతను ఉద్ధరించు స్వర్గమునందు ఆనందమనుభవించును. రాజసౌధము నిర్మించిన విధముగ శ్రీహరికి ఏడు అంతస్తుల దేవాలయమును నిర్మింపవలెను. ఇతర దేవతలకు కూడ అట్లే పూర్వాది దిక్కులందు ఏర్పడు ధ్వజాధ్యాయములలో వాటిలో విదిక్కుల ఆయమును విడువలెను. నాలుగు, మూడు, రెండు లేదా ఒకటి శాల లుండు గృహము నిర్మింపవలెను. వ్యయము అధికముగ నుండు పదముపై గృహము నిర్మింపరాదు. అచట నిర్మించిన గృహమునందు వ్యయ మధికముగ నుండును. ఆయ మధికముగ నున్న పీడ కలుగదు.

అందుచే ఆయవ్యయములు సమభావములో నుండు నట్లు చూచు కొనవలెను. ఇంటి పొడవు వెడల్పులు ఎన్ని హస్తములుండునో వాటిని ఒకదానితో ఒకటి గుణింపగా వచ్చిన సంఖ్యకు 'కరరాశి' అని పేరు. గర్గాచార్యుని జ్యోతిశ్శాస్త్రము నందు నిపుణు డగు ఆచార్యుడు దానిని ఎనిమిది రెట్లు చేయవలెను. దానిని ఏడు చేతభాగించగా వచ్చిన శేషము 'వ్యయము' లేదా కరరాశిని ఏడుచేత గుణించి దానిని మరల ఎనిమిదిచేత భాగించగా వచ్చిన శేషమను బట్టి ధ్వజాద్యాయములను కల్పించవలెను. ధ్వజము, ధూమ్రము, సింహము, శ్వానము, వృషభము, ఖరము, గజము, ధ్వాంక్షము అను ఎనిమిది ఆయములు పూర్వాది దిక్కలందు ఏర్పుడును.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 222 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 65

🌻The building of pavilions in front of the temples (sabhā-sthāpana) - 1 🌻


The Lord said:

1. I shall describe the mode of building pavilions (in front of temples) [i.e., sabhā] and their maintenance. The vāstuyāga (rite performed to please the spirits dwelling in a site) should be performed after having tested the ground (intended for building pavilion).

2. Having constructed pavilion [i.e., sabhā] as per one’s liking, one should install (the images of) gods according to his wish. (Such buildings) should not be constructed at the junction of four roads or at a deserted place in the village.

3. Such a builder being free from sins and raising his ancestors (to heaven), enjoys in heaven. One should build a sevenstoreyed building for Lord Hari (Viṣṇu) in the following way.

4. The same rule holds good in the building of other (temples of gods), as in the case of erecting the mansions of kings. The banner should be placed in the east. The edifice should be built as a quadrilateral without (having any walls on) the diagonal lines.

5-7. The building should have three or two chambers or one chamber. The vyaya[1] should not be much. Excessive vyaya is deemed to be harmful. Excessive āya[1] is also harmful. Hence the two should be made equal. (The priest) well-versed in the science of Garga (vāstuśāstra), should sum up the hand measures of building and multiply it by eight. It should be multiplied by three and the resultant product should be divided by eight and the remainder is known as vyaya.

8. Alternatively, having divided the sum of the hand measures of the building by three and multiplying it by eight the resultant is known as the dhvaja (banner) etc.

9. Banner, camel, lion, dog, bull, donkey, elephant and crow are said to be eight āyas.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment