శ్రీమద్భగవద్గీత - 375: 10వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 375: Chap. 10, Ver. 03

 

🌹. శ్రీమద్భగవద్గీత - 375 / Bhagavad-Gita - 375 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 03 🌴

03. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |
అసమ్మూఢ: స మర్త్యేషు సర్వపాపై: ప్రముచ్యతే ||


🌷. తాత్పర్యం :

నన్ను పుట్టుకలేనివానిగను, అనాదిగను, సర్వలోకములకు దివ్యప్రభువుగను తెలిసికొనినవాడు మాత్రమే మనుజులందరిలోను భ్రాంతిరహితుడై, సర్వపాపముల నుండి ముక్తుడగును.

🌷. భాష్యము :

“మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతిసిద్ధయే” యని సప్తమాధ్యాయమున (7.3) తెలుపబడినట్లు ఆధ్యాత్మికానుభవ స్థాయిని పొందుటకై యత్నించువారు సామాన్యజనులు కానేరరు. ఆధ్యాత్మికానుభవమునకు సంబంధించిన జ్ఞానము ఏ మాత్రములేని కోట్లాది సామాన్యమానవుల కన్నను వారు నిక్కము ఉత్తములు. కాని ఆ విధముగా తమ ఆధ్యాత్మికస్థితిని అవగాహన చేసికొన యత్నించువారిలో శ్రీకృష్ణుడు దేవదేవుడు, సర్వమునకు ప్రభువు, పుట్టుకలేనివాడనెడి అవగాహనకు వచ్చినవాడు ఆత్మానుభవప్రాప్తిలో కృతకృత్యుడైనట్టివాడు. శ్రీకృష్ణుని దివ్యస్థితిని సంపూర్ణముగా నెరుగగలిగిన స్థితి యందే మనుజుడు సర్వవిధములైన పాపఫలముల నుండి ముక్తుడు కాగలడు.

ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు అజునిగా (పుట్టుకలేనివానిగా) వర్ణింపబడినాడు. ద్వితీయాధ్యాయమున జీవులు సైతము అజులుగా తెలుపబడినను భగవానుడు వారికి భిన్నమైనవాడు. భౌతికబంధకారణముగా జన్మించుచు మరణించు జీవులకు అతడు భిన్నుడు. ఆ బద్ధజీవులు తమ దేహములను మార్చుచుండ, భగవానుని దేహము మార్పురహితమై యున్నది. అతడు భౌతికప్రపంచమునకు అరుదెంచినను అజునిగనే అరుదెంచును. కనుకనే శ్రీకృష్ణభగవానుడు తన అంతరంగశక్తి ద్వారా న్యునమైన భౌతికశక్తికి అధీనుడుగాక సదా దివ్యశక్తియందే స్థితుడై యుండునని చతుర్థాధ్యాయమున తెలుపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 375 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 03 🌴

03. yo mām ajam anādiṁ ca vetti loka-maheśvaram
asammūḍhaḥ sa martyeṣu sarva-pāpaiḥ pramucyate


🌷 Translation :

He who knows Me as the unborn, as the beginningless, as the Supreme Lord of all the worlds – he only, undeluded among men, is freed from all sins.

🌹 Purport :

As stated in the Seventh Chapter (7.3), manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye: those who are trying to elevate themselves to the platform of spiritual realization are not ordinary men; they are superior to millions and millions of ordinary men who have no knowledge of spiritual realization. But out of those actually trying to understand their spiritual situation, one who can come to the understanding that Kṛṣṇa is the Supreme Personality of Godhead, the proprietor of everything, the unborn, is the most successful spiritually realized person. In that stage only, when one has fully understood Kṛṣṇa’s supreme position, can one be free completely from all sinful reactions.

Here the Lord is described by the word aja, meaning “unborn,” but He is distinct from the living entities who are described in the Second Chapter as aja. The Lord is different from the living entities who are taking birth and dying due to material attachment. The conditioned souls are changing their bodies, but His body is not changeable. Even when He comes to this material world, He comes as the same unborn; therefore in the Fourth Chapter it is said that the Lord, by His internal potency, is not under the inferior, material energy, but is always in the superior energy.

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment