మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 146


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 146 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. జీవుని - నారాయణుని - నిద్ర - 3 🌻

జనన మరణములతో కూడిన సంసార జీవితమొక భయంకరమైన మహాసముద్రము. వివేకము లేక తమ పనుల యందు జనులు తాము నిమగ్నులై యుందురు. తమ పనులే తమ జ్ఞానమునకు సరిహద్దు.

అట్టి స్వార్థమే యీ సముద్రమునకు తీరము‌. తమ పనులు నెరవేరుట, నెరవేరకుండుట అనునదే వెనుకకును , ముందుకును పరుగెత్తుచుండు అలలు. మిత్రులు, భార్య, పుత్రులు మొదలగు రూపమున సముద్ర జంతువులైన చేపలు, తిమింగిలములు మొదలగునవి సంచరించు చుండును.

అట్టి సంసార మహాదముద్రము దాటగోరువారు అడ్డముగా దూకి ఈదినచో లాభములేదు. అథమ స్థితి చెంది సముద్ర గర్భమున పడిపోవుదురు . తెలివితో చక్కని నావ నిర్మించుకొని దిగవలయును. ఆ నావయే భగవంతునితో మనస్సును బంధించుకొనుట.


...... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


07 Feb 2022

No comments:

Post a Comment