🌹. రధసప్తమి, నర్మదా జయంతి శుభాకాంక్షలు 🌹
🌹. శ్రీ సూర్య స్తుతి, నర్మదా అష్టకం 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 23-1 - 318 🌹
3) 🌹. శివ మహా పురాణము - 516🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -146🌹
5) 🌹 Osho Daily Meditations - 135🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 345-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 345-2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. రధసప్తమి, సూర్య జయంతి, నర్మదా జయంతి శుభాకాంక్షలు మరియు శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 07, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. రథ సప్తమి శ్లోకాః 🍀*
*🌼. అర్కపత్ర స్నాన శ్లోకాః |*
*1. సప్తసప్తిప్రియే దేవి సప్తలోకైకదీపికే |*
*సప్తజన్మార్జితం పాపం హర సప్తమి సత్వరమ్*
*2. యన్మయాత్ర కృతం పాపం పూర్వం సప్తసు జన్మసు |*
*తత్సర్వం శోకమోహౌ చ మాకరీ హంతు సప్తమీ*
*3. నమామి సప్తమీం దేవీం సర్వపాపప్రణాశినీమ్ |*
*సప్తార్కపత్రస్నానేన మమ పాపం వ్యాపోహతు*
*🌼. అర్ఘ్య శ్లోకం |*
*సప్త సప్తి వహప్రీత సప్తలోక ప్రదీపన |*
*సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర*
*💧. నర్మదా దేవి స్తోత్రం*
శ్రీ నర్మదే సకల-దుఃఖహరే పవిత్రే
ఈశాన-నన్దిని కృపాకరి దేవి ధన్యే ।
రేవే గిరీన్ద్ర-తనయాతనయే వదాన్యే
ధర్మానురాగ-రసికే సతతం నమస్తే ॥
🌻 🌻 🌻 🌻 🌻
*పండుగలు మరియు పర్వదినాలు :*
*రథ సప్తమి లేదా అచల సప్తమి, సూర్య జయంతి, నర్మదా జయంతి*
*Ratha Saptami or Achala Saptami, Surya Jayanthi Narmada Jayanti*
*🌞. రథ సప్తమి - సూర్య ఆరాధన విధానం.. 🌞*
*రథ సప్తమి రోజున ఉదయం అర్కపత్ర స్నాన శ్లోకం పఠిస్తూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి అర్ఘ్య శ్లోకంతో సూర్య భగవానునికి నీటిని సమర్పించండి. తరువాత ఓం సూర్య దేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ధూపం లేదా ధూపద్రవ్యాలను కాల్చండి. సూర్య కిరణాలలో ఆవుపాలతో చేసిన పరమాన్నాన్ని నివేదన చేయండి.*
*దీని తర్వాత శ్రీ సూర్య స్తుతిని పఠించడం లేదా సూర్య చాలీసాను పఠించండి. ఆ తర్వాత ఆవు నెయ్యి దీపంతో సూర్య భగవానుని హారతినివ్వండి. సూర్య పూజ సమయంలో ప్రత్యేక కార్యాల సాధన కోసం మీరు ఇతర సూర్య మంత్రాలను కూడా జపించవచ్చు. పూజానంతరం గోధుమలు, బెల్లం, పప్పు మొదలైన వాటిని దానం చేయడం మంచిది.*
🌷🌷🌷🌷🌷
*🍀. నేటి సూక్తి : నీ అసలు స్వరూపం మీద నిరంతరం దృష్టి సారించు. అది నిన్ను మాయ నుండి విముక్తుడిని చేస్తుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
శశిర ఋతువు, మాఘ మాసం
తిథి: శుక్ల-సప్తమి 30:17:50 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: అశ్విని 19:00:44 వరకు
తదుపరి భరణి
యోగం: శుభ 16:43:38 వరకు
తదుపరి శుక్ల
కరణం: గార 17:26:42 వరకు
సూర్యోదయం: 06:46:10
సూర్యాస్తమయం: 18:14:17
వైదిక సూర్యోదయం: 06:49:51
వైదిక సూర్యాస్తమయం: 18:10:35
చంద్రోదయం: 11:01:19
చంద్రాస్తమయం: 23:53:37
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మేషం
వర్జ్యం: 14:40:50 - 16:24:06
మరియు 29:34:36 - 31:20:32
దుర్ముహూర్తం: 12:53:10 - 13:39:02
మరియు 15:10:47 - 15:56:39
రాహు కాలం: 08:12:11 - 09:38:12
గుళిక కాలం: 13:56:14 - 15:22:15
యమ గండం: 11:04:13 - 12:30:14
అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52
అమృత కాలం: 11:14:18 - 12:57:34
రాక్షస యోగం - మిత్ర కలహం 19:00:44
వరకు తదుపరి చర యోగం -
దుర్వార్త శ్రవణం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PANCHANGUM
#DAILYCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ సూర్య స్తుతి - శ్రీ నర్మదాష్టకము 🌹*
*🍀. రథ సప్తమి లేదా అచల సప్తమి, సూర్య జయంతి, నర్మదా జయంతి శుభాకాంక్షలు 🍀*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌞. శ్రీ సూర్య స్తుతి 🌞*
1. నమః సూర్యస్వరూపాయ ప్రకాశాత్మస్వరూపిణే |
భాస్కరాయ నమస్తుభ్యం తథా దినకృతే నమః
2. శర్వరీహేతవే చైవ సంధ్యాజ్యోత్స్నాకృతే నమః |
త్వం సర్వమేతద్భగవన్ జగదుద్భ్రమతా త్వయా
3. భ్రమత్యావిద్ధమఖిలం బ్రహ్మాండం సచరాచరమ్ |
త్వదంశుభిరిదం స్పృష్టం సర్వం సంజాయతే శుచి
4. క్రియతే త్వత్కరైః స్పర్శాజ్జలాదీనాం పవిత్రతా |
హోమదానాదికో ధర్మో నోపకారాయ జాయతే
5. జ్ఞానైకధామభూతాయ నిర్ధూతతమసే నమః |
శుద్ధజ్యోతిస్స్వరూపాయ విశుద్ధాయామలాత్మనే
6. వరిష్ఠాయ వరేణ్యాయ పరస్మై పరమాత్మనే |
నమోఽఖిలజగద్వ్యాపిస్వరూపాయాత్మమూర్తయే
7. తావద్యావన్న సంయోగి జగదేతత్ త్వదంశుభిః |
ఋచస్తే సకలా హ్యేతా యజూంష్యేతాని చాన్యతః
8. సకలాని చ సామాని నిపతంతి త్వదడ్గతః |
ఋఙ్మయస్త్వం జగన్నాథ త్వమేవ చ యజుర్మయః
9. యతః సామమయశ్చైవ తతో నాథ త్రయీమయః |
త్వమేవ బ్రహ్మణో రూపం పరంచాపరమేవ చ
10. మూర్తామూర్తస్తథా సూక్ష్మః స్థూలరూపస్తథా స్థితః |
నిమేషకాష్ఠాదిమయః కాలరూపః క్షయాత్మకః |
ప్రసీద స్వేచ్ఛయా రూపం స్వతేజః శమనం కురు
11. ఇదం స్తోత్రవరం రమ్యం శ్రోతవ్యం శ్రద్ధయా నరైః |
శిష్యో భూత్వా సమాధిస్థో దత్త్వా దేయం గురోరపి
12. న శూన్యభూతైః శ్రోతవ్యమేతత్తు సఫలం భవేత్ |
సర్వకారణభూతాయ నిష్ఠాయై జ్ఞానచేతసామ్
ఇతి శ్రీమార్కండేయపురాణే సూర్యస్తుతిః ||
🌹 🌹 🌹 🌹 🌹
*💧. శ్రీ నర్మదాష్టకము 💧*
1. శ్రీ నర్మదే సకల-దుఃఖహరే పవిత్రే
ఈశాన-నన్దిని కృపాకరి దేవి ధన్యే ।
రేవే గిరీన్ద్ర-తనయాతనయే వదాన్యే
ధర్మానురాగ-రసికే సతతం నమస్తే ॥ ౧॥
2. విన్ధ్యాద్రిమేకలసుతే విదితప్రభావే
శాన్తే ప్రశాన్తజన-సేవితపాదపద్మే ।
భక్తార్తిహారిణి మనోహర-దివ్యధారే
సోమోద్భవే మయి నిధేహి కృపాకటాక్షమ్ ॥ ౨॥
3. ఆమేకలాదపర-సిన్ధు-తరఙ్గమాలా
యావద్ బృహద్ -విమల -వారి-విశాలధారా ।
సర్వత్ర ధార్మికజనాఽఽప్లుతతీర్థదేశా
శ్రీనర్మదా దిశతు మే నిజభక్తిమీశా ॥ ౩॥
4. సర్వాః శిలా యదనుషఙ్గమవాప్య లోలా
విశ్వేశరూపమధిగమ్య చమత్కృతాఙ్గాః ।
పూజ్యా భవన్తి జగతాం స-సురాఽసురాణాం
తస్యై నమోఽస్తు సతతం గిరిశాఙ్గజాయై ॥ ౪॥
5. యస్యాస్తటీముభయతః కృతసన్నివేశా
దేశాః సమీర-జలబిన్దు-కృతాభిషేకాః ।
సోత్కణ్ఠ-దేవగణ-వర్ణితపుణ్యమాలాః
శ్రీభారతస్య గుణగౌరవముద్గృణన్తి ॥ ౫॥
6. స్వాస్థ్యాయ సర్వవిధయే ధన-ధాన్య-సిధ్యై
వృద్ధిప్రభావనిధయే జనజాగరాయై ।
దివ్యావబోధవిభవాయ మహేశ్వరాయై
భూయో నమోఽస్తు వరమఞ్జులమఙ్గలాయై ॥ ౬॥
7. కల్యాణ-మఙ్గల-సముజ్జ్వల-మఞ్జులాయై
పీయూషసార-సరసీరుహ-రాజహంస్యై ।
మన్దాకినీ-కనక-నీరజ-పూజితాయై
స్తోత్రార్చనాన్యమర-కణ్టక-కన్యకాయై ॥ ౭॥
8. శ్యామాం ముగ్ధసుధా-మయూరవదనాం రత్నోజ్జవలాలఙ్కృతిం
రామాం ఫుల్ల-సహస్రపత్రనయనాం హాసోల్లసన్తీం శివామ్ ।
వామాం బాహువిశాల-వల్లివలయా-లోలాఙ్గులీపల్లవాం
లాలిత్యోల్లసితాలకావలికలాం శ్రీనర్మదాం భావయే ॥ ౮॥
9. శ్రీనర్మదాఙ్ఘ్రి-సరసీరుహ-రాజహంసీ
స్తోత్రాష్టకావలిరియం కలగీతవంశీ ।
సంవాద్యతేఽనుదినమేకసమాం భజద్భి-
ర్యైస్తే భవన్తి జగదమ్బికయాఽనుకమ్ప్యాః ॥ ౯॥
10. కాశీపీఠాధినాథేన శఙ్కరాచార్యభిక్షుణా ।
కృతా మహేశ్వరానన్ద-స్వామినాఽఽస్తాం సతాం ముదే ॥ ౧౦॥
ఇతి కాశీపీఠాధీశ్వర-జగద్గురు-శఙ్కరాచార్య-స్వామి-
శ్రీమహేశ్వరానన్ద-సరస్వతీ-విరచితం నర్మదాష్టకం సమ్పూర్ణమ్ ।
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -318 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 23 -1 📚*
*🍀 23-1. త్రికరణశుద్ధి - నామరూపములతో కూడిన దేవతల నారాధించినపుడు వారు నన్నే ఆరాధించుచున్నను అట్టి వారి ప్రజ్ఞ పరిమిత మగుచుండును. కారణమేమనగా వారు సర్వవ్యాప్తి యగు నన్ను ఒక నామమునకు, రూపమునకు పరిమితము చేసుకొను చున్నారు. అంతట వ్యాప్తి చెందిన నన్ను కేవలము ఒక రూపమునకు, ఒక నామమునకు పరిమితముచేసి ఆరాధించు నపుడు వారి ప్రజ్ఞ, బుద్ధి పరిమితమగును. విశ్వరూపుడనై యున్న నన్ను వారు తెలియలేరు. కేవలమొక రూపమునకే, ఒక నామమునకే పరిమితమై ఇతరమంతను నిరాకరింతురు. అట్టి నిరాకరణము వలన వారు నన్ను పొందలేకున్నారు. 🍀*
*23. యో వ్యన్య దేవతాభక్తా యజంతే శ్రద్ధయాన్వితా: |*
*తే2 పి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకమ్ ||*
*తాత్పర్యము : విధి పూర్వకము కాకున్నను, భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఇతర దేవతలను ఆరాధించుచున్నారో, వారు కూడ నన్నే ఆరాధించు చున్నారు.*
*వివరణము : సమస్త దేవతల రూపమునను నేనే అధిష్ఠించి యున్నాను. దేవతలే అన నేల సమస్త జీవరూపములును నేనే అధిష్ఠించి యున్నాను గదా! కనుక ఏ దేవతా రూపము నారాధించి నను నన్నారాధించినట్లే. నామరూపములతో కూడిన దేవతల నారాధించినపుడు వారు నన్నే ఆరాధించుచున్నను అట్టి వారి ప్రజ్ఞ పరిమిత మగుచుండును. కారణమేమనగా వారు సర్వవ్యాప్తి యగు నన్ను ఒక నామమునకు, రూపమునకు పరిమితము చేసుకొను చున్నారు.*
*అంతట వ్యాప్తి చెందిన నన్ను కేవలము ఒక రూపమునకు, ఒక నామమునకు పరిమితముచేసి ఆరాధించు నపుడు వారి ప్రజ్ఞ, బుద్ధి పరిమితమగును. వారు ఇతర రూపములు, నామములతో నున్న జీవుల నధిష్ఠించియున్న నన్ను తిరస్కరింతురు. అనేకానేక రూపములతో విశ్వరూపుడనై యున్న నన్ను వారు తెలియలేరు. కేవలమొక రూపమునకే, ఒక నామమునకే పరిమితమై ఇతరమంతను నిరాకరింతురు. అట్టి నిరాకరణము వలన వారు నన్ను పొందలేకున్నారు. అట్లు పొందలేక, తమకు నచ్చిన నామమే దైవమని, తమకు నచ్చిన రూపమే దైవమని నిర్ధారించుచు, సిద్ధాంతము లేర్పరచి, రాద్ధాంతము చేయు చుందురు. ఇట్టివారే దేవుని పేరిట యుద్ధములు, మారణకాండ సృష్టింతురు. మా దైవము గొప్పది, మా దైవమే అందరికి శరణ్యము, మేము నమ్మిన నామ రూపమే సర్వమునకు రక్ష, ఇత్యాది ఉన్మాద పూర్వకమగు భాషణములు చేయుచు కల్లోలములు, కలహములు పెంచుకొనుచు నుందురు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 516 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 44
*🌻. మేన యొక్క మంకు పట్టు - 2 🌻*
గంగాజలమును పారబోసి నీవు నూతి త్రాగితివి. నీవు సూర్యుని విడిచి ప్రయత్న పూర్వకముగా మిణుగురు పురుగును పట్టుకున్నావు (11). నీవు బియ్యమును విడిచి ఊకను భక్షించితిని. నేతిని పారబోసి ఆముదమును భుజించితివి (12). సింహసేవను వీడి నీవు నక్కను సేవించితివి.నీవు బ్రహ్మవిద్యను విడిచి పెట్టి చెడుగాథను వింటివి (13). ఇంటిలోని పరమమంగళకరమగు యజ్ఞ విభూతిని దూరము చేసి, ఓ అమ్మాయి! నీవు అమంగళకరమగు చితాభస్మను స్వీకరించితివి (14).
పరమ ప్రభువులగు విష్ణువు మొదలగు దేవోత్తములను విడిచి పెట్టి దుర్బుద్ధివగు నీవు ఇట్టి తపస్సును శివుని కొరకు చేసితిని (15), నీ బుద్ధికి, రూపమునకు, నీ ప్రవృత్తికి, నీకు ఉపదేశము చేసిన వానికి, నీ ఇద్దరు సఖరాండ్రకు నింద యగు గాక! (16).
ఓ అమ్మాయీ! నీవు జన్మ నిచ్చిన మేమిద్దరము నిందార్హలము. ఓ నారదా! నీ బుద్ధికి, మంచి బుద్ధిని కలిగించు సప్తర్షులకు (17) కులమునకు, కర్మలను చేసే సామర్ధ్యమునకు నిందయగు గక! నీవు సర్వమును నిందార్హము చేసితివి. ఈ ఇంటిని నీవు నాశనము చేసితివి. నాకు మరణమే గతి (18).
ఈ పర్వతరాజు నా దరిదాపులకు రాకుండుగా! సప్తర్షులు వారి ముఖము నాకు చూపకుందురు గాక! (19) అందరు కలిసి ఏమి సాధించిరి? నా కులము నాశనమైనది. నేను గొడ్రాలుగా ఏల పుట్టలేదో? నా గర్భము ఏల భగ్నము కాలేదో? (20) నేను ఏల మరణించలేదో? లేక, నా పుత్రిక ఏల మరణించలేదో? రాక్షసుడు ఈనాడు నా కుమార్తెను గగన వీధికి తీసుకువెళ్లి ఏల భక్షించడో? (21) నీ శిరస్సును నేనీనాడు నరికివేసెదను. ఈ దేహములతో పని ఏమి గలదు? నిన్ను విడిచి నేనెచటకు పోగలను? అయ్యో! నా జీవితము నాశనమైనది (22).
బ్రహ్మ ఇట్లు పలికెను -
మిక్కిలి దుఃఖితురాలగు ఆ మేన ఇట్లు పలికి మూర్ఛిల్లి భూమిపై పడెను. శోకము, రోషము మొదలగు కారణములచే ఆమె తన భర్త వద్దకు వెళ్లలేదు (23). ఓ మహర్షీ! ఆ సమయములో పెద్ద హాహాకారమును చేసిరి. క్రమముగా దేవతలందరు ఆమె ఉన్నచోటికి విచ్చేసిరి (24). ఓ దేవర్షీ! నేను కూడా అపుడు అచటకు స్వయముగా విచ్చేసితిని. నన్ను చూసి నీవు ఈ మాటలను ఆమెతో పలికితివి (25).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 146 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. జీవుని - నారాయణుని - నిద్ర - 3 🌻*
*జనన మరణములతో కూడిన సంసార జీవితమొక భయంకరమైన మహాసముద్రము. వివేకము లేక తమ పనుల యందు జనులు తాము నిమగ్నులై యుందురు. తమ పనులే తమ జ్ఞానమునకు సరిహద్దు.*
*అట్టి స్వార్థమే యీ సముద్రమునకు తీరము. తమ పనులు నెరవేరుట, నెరవేరకుండుట అనునదే వెనుకకును , ముందుకును పరుగెత్తుచుండు అలలు. మిత్రులు, భార్య, పుత్రులు మొదలగు రూపమున సముద్ర జంతువులైన చేపలు, తిమింగిలములు మొదలగునవి సంచరించు చుండును.*
*అట్టి సంసార మహాదముద్రము దాటగోరువారు అడ్డముగా దూకి ఈదినచో లాభములేదు. అథమ స్థితి చెంది సముద్ర గర్భమున పడిపోవుదురు . తెలివితో చక్కని నావ నిర్మించుకొని దిగవలయును. ఆ నావయే భగవంతునితో మనస్సును బంధించుకొనుట.*
...... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 135 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 135. AUSTERITY 🍀*
*🕉 They have a word in Latin for listening, obedire. The English word obedience comes from that. if you rightly listen, it creates obedience. 🕉*
*If you rightly see, it brings its own discipline. The basic question is that inside, one should be perfectly empty while listening, perfectly empty while seeing, perfectly empty while touching no prejudice for or against, staying uninvolved, and having no subtle leanings, because that leaning destroys the truth. Having no leanings at all, allowing truth to he, not forcing it to be something else but allowing it, whatever it is. This is the austere life of the religious person. This is real austerity: to allow truth to have its own say-not disturbing, not coloring, not manipulating, not managing it in some way according to one's own beliefs. *
*When truth is allowed to be itself, naked and new, a great discipline arises in you-obedience. A great order arises in you. Then you are no longer in chaos; for the first time you start gathering a center, a nucleus, because truth known immediately becomes your truth. Truth known as it is immediately transforms you. You are no -longer the same person. The very vision, the very clarity, and the very experience of what truth is, is a sudden mutation. It is the revolution that real religion is all about.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 345-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 345 -2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।*
*క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀*
*🌻 345-2. 'క్షేత్రపాల సమర్చితా'🌻*
*మొత్తము సృష్టి పాలనము చేయు ప్రజ్ఞ విష్ణు ప్రజ్ఞ. త్రిమూర్తులలో విష్ణువుతో కూడి లోకపాలకులు, దిక్పాలకులు, చక్రవర్తులు, ప్రభువులు, ఇతర చిల్లర అధికారులు శ్రీమాత నర్చించుచు వారి వారి కర్తవ్యములను చక్కబెట్టుట ఈ నామ రహస్యము. కొద్దియో గొప్పగనో విష్ణు ప్రజ్ఞ మేల్కాంచనిచో రక్షణ పోషణ లుండవు. క్షేత్రపాలు డనగా శివుడని కూడ అర్థ మున్నది. శివుడు దారుకుడను అసురుని చంపుటకు శ్రీమాత కాళీ ప్రజ్ఞను వినియోగించెను. అపుడు శ్రీమాత కాళిగ శివునికి సహకరించి దారుకాసురుని సంహరించెను. ఆ సంహార మతి భీకరము.*
*ఆ సవయమున కాళి కోపాగ్ని అతితీవ్రమై సంహారానంతరము కూడ ఉపసంహరింప బడలేదు. ఆ కోపాగ్నికి లోకములు కల్లోలమగు చుండెను. అపుడు శివుడు ఒక అందమైన బాలుని రూపము దాల్చి ఏడ్చుచు కాళికి ఎదురేగెను. ఏడ్చుచున్న అపురూపమగు బాలుని చూచిన వెంటనే కాళి యందలి శ్రీమాత వాత్సల్య భావమును ధరించెను. అపుడు బాలుని చేరదీసి ఓదార్చుటకై తన స్తన్యమిచ్చెను. బాల శివుడు స్తన్యముల నుండి క్షీరములనే గాక కాళి కోపాగ్నిని కూడ పానము చేసెను. ఈ బాలునే క్షేత్రపాల శివుడందురు. ప్రసన్న అయిన శ్రీమాతను బాలశివుడు అర్చించెను. కావున శ్రీమాత 'క్షేత్రపాల సమర్చిత' అయినది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 345-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini*
*Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻*
*🌻 345-2. Kṣetra-pāla-samarcitā क्षेत्र-पाल-समर्चिता (345) 🌻*
*She is worshipped by Kṣetra-pāla-s. Kṣetra, as discussed in nāma 341 is the body. Pāla means the Protector. This body is protected by pañcabhūta (the five elements viz. akash, air, fire, water and earth). Each of these elements is represented by a demigod. She is worshipped by them. This appears to be the appropriate interpretation.*
*There is an interesting story associated with this nāma. Goddess Kālī was created by Śiva to slain a demon called Dāruka. Even after killing him, the ferocity of Her anger could not be controlled. The entire universe was rattled by Her anger. To appease Her anger Śiva Himself assumed the form of an infant. After all She is the Supreme Mother. She started feeding the child (Śiva). While suckling, Śiva also sucked Her anger. This child is called Kṣetrapāla, because He protected this universe from a catastrophe. She was worshipped by this Kṣetrapāla.*
*The place where major yajña rituals take place is also called kṣetra and the god who protects it is called Kṣetrapāla and She is worshipped by him.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment