✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 యోగము, గృహస్థాశ్రమము 🍃
91. సాధారణముగా ఆశ్రమములలో నాలుగు రకములు ఉన్నవి.
1. గృహస్థాశ్రమము
2. బ్రహ్మచర్యము
3. వానప్రస్థము
4. సన్యాసాశ్రమము. యోగసాధన ద్వారా మోక్షము పొందాలంటే ఏ ఆశ్రమము పాటించవలెనన్నది ప్రశ్నార్థకము.
92. ఏ ఆశ్రమము వారైనను యోగ ధ్యేయమును సాధనా సిద్థాంతములను శాస్త్ర ప్రమాణముగా అభ్యాసం చేయుచు ఏ ఆశ్రమమైనను పాటించవచ్చును. కానీ అన్నింటిలో గృహస్ధాశ్రమము శ్రేష్ఠమైనదని పెద్దలు చెప్పుదురు. అందుకు కారణము మిగిలిన మూడు ఆశ్రమముల వారు వారి కనీస అవసరములకై గృహస్థులమీదే ఆధారపడవలసి యుందును.
93. గృహస్థుని ధర్మములు: దొంగతనము చేయకుండుట, ధైర్యము, సుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, వేదాంత విచారణ, సత్యము, క్రోధము లేకుండుట, బుద్ధిమంతుడై ఉండుట అతిధిని గౌరవించుట, లోకజ్ఞానము ముఖ్యమైనవి. అప్పుడే అతడు యోగాభ్యాసానికి యోగ్యుడు.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment