శివగీత - 66 / The Siva-Gita - 66



🌹.  శివగీత - 66 / The Siva-Gita - 66  🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

ఎనిమిదో అధ్యాయము

🌻. గర్భో త్పత్త్యాది కథనము - 12 🌻

ష్కా సయంతి నిలయాత్ - క్షణం న స్థాపయంత్యపి,
ద హ్యతే చ తతః కాష్టై: - స్త ద్భ స్మ క్రియతే క్షణాత్ 67

భాక్ష్యతే వా సృగాలేన - గృధ్ర కుక్కుర వాయసై:,
పునర్న దృశ్యతే సోథ - జన్మకోటి శ తైర పి 68

మాతా పితా గురుజన స్స్వజనో మమేతి
మాయోపమే జగతి కస్య భవే త్ప్రతిజ్ఞా
ఏకో యతో వ్రజతి కర్మ పుర స్సరోయం
విశ్రామవృక్షః సదృశం ఖలుజీవలోకః 69

సాయం సాయం వాసవృక్షం సమేతాః
ప్రాతః ప్రాత స్తేన తేన ప్రయాంతి,
త్వక్త్యా న్యోన్యం తం చ వృక్షం విహంగా
యద్వత్త ద్వజ్ఞాత యోజ్ఞాత యశ్చ 70

పిదప ప్రాణముల బాసిన దేహమును కర్ర (కట్టెలు) తో గాల్చిగాని, లేదా ఖననము చేసిగాని, అథవా నక్క - గ్రద్ద - కుక్క - కాకి – మొదలగు వాటితో నా దేహము దినబడును. ఇక వందకోట్ల జన్మలకైనను మళ్ళి కనపడకుండా పోవును.

మాయాకల్పితంబైన ఈ ప్రపంచమున తల్లి - తండ్రి - గురువు – స్వజనము మొదలగు ప్రతిజ్ఞ వట్టి దగును. ఎందుచేత ననగా స్వకర్మచేత నోక్కడేబుట్టి యోక్కడే పోవును. ఈ జీవలోకము విశ్రాంతి వృక్షముతో సమానమైనది.

ఎట్లైతే విహంగములు (పక్షులు) ప్రతిసాయంకాలము తమతమ నివాస వృక్షము పైన కలిసియుండి, ప్రతి ప్రాతః కాలమునందు వృక్షమును వీడి వెళ్లిపోవునో, అట్లే వాటివలనే బంధువులు - బంధువులు గానివారు స్వకర్మచేత దమను విడిపోవుదురు.

మృతిబీజం భవేజ్జన్మ - జన్మబీ జంభ వే న్మృతి:
ఘట యంత్ర న దశ్రాంతో - బంభ్ర మీత్య నిశం నరః 71

గర్భే పుంస శ్శుక్ర పాతా - ద్యదుక్తం మరణావధి,
తదేవాస్య మహావ్యాధే - ర్మత్తో నాన్యోస్తి భేషజమ్ 72

ఇతి శ్రీ పద్మ పురాణే శివగీతాయాం అష్టమోధ్యాయః

మరణమునకు జననమునకు మరణము కారణములై మానవుడు కుమ్మరి వాడి చక్రము మాదిరిగా దిరుగుచుండును. యువతి గర్భములో పురుషుడి రేతః పతనము మొదలుకొని మానవుని మరణము పర్యంతము పైన చెప్పబడిన దుఃఖ భూయిష్టమైన ఈ సంసామను రోగమునకు ధ్యానమున కంటెను మరో ఔషదము లేదు.

ఇది వ్యాపోక్త సంస్కృత పద్మ పురాణాంతర్గతమగు శివగీతలో ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.


🌹  The Siva-Gita - 66  🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj


Chapter 08 :
🌻 Pindotpatti Kathanam - 12
🌻

After that the lifeless body is cremated, or buried, or if thrown away it becomes a prey to scavengers. And for next millions of births that becomes vanished.

In this world created through illusion, the relationships of mother, father, teacher, relatives becomes falsified because due to one's own Karma one takes birth alone and leaves the world alone. This material world is equivalent to a resting place like a tree.

The way birds assemble on a common tree at night and again disperse in their own paths in the morning, the same way everyone meets and departs from each other based on their own karma.

Death becomes the cause for rebirth, and birth becomes the cause for death and this cycle moves perpetually as like as the wheel of a potter.

From the point male seed gets discharged in the womb of a female, till the death and beyond, aforementioned vicious circle is inevitable for any Jiva.

There is no other way that my remembrance to get liberated out of this samsaara.

Here ends the eighth chapter of Shiva Gita present in Padma Purana Uttara Khanda

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

18.Sep.2020

No comments:

Post a Comment