భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 176
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 176 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మార్కండేయ మహర్షి - 2 🌻
10. చిన్నవాడే అయినా, మార్కండేయుడు, మృత్యుదేవతతో పోరాడి రుద్రుడి రక్షణతో చిరంజీవి అయ్యాడు. అంటే తరువాత మృత్యువులేదు. కాకపోతే శరీరాన్ని వదిలిపెట్టి ఉండవచ్చు. దానిని మృత్యువు అని అనకూడదు. ఆ అర్థంలో అతడు చిరంజీవి.
11. యోగబలంతో శరీరాన్ని వదిలి పెట్టటమే ఆర్యులయొక్క అత్యుత్తమమైంటువంటి achievement. చాలా గొప్ప సాధనచేసారు వాళ్ళు. మృత్యువాత పడటం వారెవరికి ఇష్టం లేదు.
12. ఆత్మబలం, ఆత్మగౌరవం, మనోబలం, యోగబలం ఉన్నవాడు ‘నేను చావను’ అని తీర్మానించుకుంటాడు. తన ఇష్టం వచ్చినప్పుడు, తను కావాలనుకున్నప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి తానే వెళ్ళిపోయాడు. అదీ ఆర్యధర్మం.
13. మహాభారతకాలంలో పాండవులు అర్ణ్యవాసం చేస్తున్నప్పుడు, మార్కండేయుడికి ఉపచారంచేసి, ఆయనకు పాదపూజచేసి తనకు తత్త్వబోధ చెయ్యమని అడిగాడు యుధిష్టరుడు, అప్పుడు మార్కండేయుడు ఆయనతో, “యుధిష్ఠరా! ప్రథమకల్పంలో బ్రహ్మ పరమపవిత్ర్ములైనవి, ధర్మపరతంత్రములైనవి, ధర్మబద్ధములైనటువంటి మనోబుద్ధిచిత్తములు కలిగినటువంటి మానవశరీరాలను మాత్రమే సృష్టించాడు.
14. తరువాత ధర్మ స్వరూపులయిన జీవులను సృష్టించాడు ఆ కల్పంలో వాళ్ళందరూ మహాసత్వ సంపన్నులు, సత్యవాదులు, సత్యసంకల్పులు, బ్రహ్మభూతాత్ములు, స్వఛ్ఛంద జీవులు, మృత్యుంజయులు, ధర్మాజ్ఞులు, సర్వము తెలిసినవాళ్ళు. మాత్సర్యం మొదలయిన అవలక్షణాలు ఏవీ వారికి లేవు. అనేకశాస్త్రములు తెలిసిన వాళ్ళు.
15. ఒక్కొక్కళ్ళు సంతానము కలిగి బహుసంవత్సరముల ఆయుర్దాయము కలిగినవాళ్ళు. రానురాను కల్పంతరువాత కల్పం వచ్చినప్పుడు, అల్పాయుష్కులైన మనుష్యులు పుట్టారు.
16. మన సైన్సు చెప్పే సృష్టిక్రమం-ఎందుకూ పనికిరాని అజ్ఞానం లోంచీ, పశుప్రాయులైన కోతులనుంచీ మొదట మానవులు జన్మించి క్రమంగా వృద్ధికి వచ్చారని చెపుతూ తరువాత జీవులు ఇంత గొప్పవాళ్ళయారనీ, ఇదంతా Progressive గా చెపుతున్నది. ఇది మనవారి బోధకు, మన ఆర్యుల మూలానికి opposite గా ఉంది.
17. ఈ బేధాన్ని అర్థంచేసుకోవడానికి ఋషులచరిత్ర చదువుతున్నాము. దీనివలన మన పూర్వులు గొప్ప జ్ఞాన సంపన్నులని, మన పురాణాలు చెప్పిందే సత్యమని, అదే మన మూలమని మనకు తెలుస్తుంది.
18. ప్రస్తుతం మానవులు అల్పాయుష్కులు, మాయాప్రవర్తనులుగా మారి క్షుద్రమయినవి, ఎందుకూ ఉవంటి ధనాదులను ఆశించి అధర్మం జోలికి వెళతారు. అధర్మాన్ని ఆశ్రయించి వీళ్ళు పొందబోయే వస్తువులేమిటంటే ఎందుకూ పనికి రానివి, క్షుద్రమయినవి. అల్పమయినవి.
19. పోనీ సంపాదించినవాటిని అనుభవించే ఆయుర్ధాయం వీళ్ళకు ఉన్నదా అంటే అదీ లేదు. వీళ్ళు ఎప్పుడూ ఆశలో ఉండటంచేత దరిద్రులు వీళ్ళు. అల్ప బలశరీరులు. నిష్ఫలారంభులు. ఏఫలమూ ఇవ్వనటువంటి కార్యములను ఆరంభంచేస్తారు. బహురోగపీడితులు. నాస్తికులు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
05 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment