ప్రసాద్ భరద్వాజ
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 129, 130 / Sri Lalitha Chaitanya Vijnanam - 129, 130 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖
🌻 129. 'శరచ్చంద్రనిభాననా' 🌻
శరచ్చంద్రునితో సాటియైన ముఖము కలది శ్రీలలిత అని అర్థము.
ఋతువులలో శరదృతువు అత్యంత ఆహ్లాదము కలిగించును. ఈ ఋతువునందు ఎండ, చలి, వాన యుండవు. శీతోష్ణములు సమతుల్యమై ఆనందమును కలిగించును. ప్రకృతి కూడ పుష్టి కలిగి తన సౌందర్యమును ప్రదర్శించుచుండును. కవులు శరదృతువును వేనోళ్ళ కొనియాడుచూ గ్రంథస్థము చేసిరి.
శరత్ నందు ప్రకృతి, పురుషుల సమాగమము పరిపూర్ణమై యుండును. శరత్ పూర్ణిమా చంద్రుడు తుష్టిగను, పుష్టిగను, కాంతివంతముగను గోచరించును.
అందమునకు, ఆనందమునకు శరత్కాలమందలి పూర్ణచంద్రుని కవులుదహరించు చుందురు. వర్ణింపనలవికాని అందము కలిగి ఆనందము నిచ్చు శరత్ పూర్ణిమా చంద్రునివంటి ముఖము కలిగినది శ్రీదేవి.
ఆమె అందము ఈశ్వరుని సహితము మోహింప చేయగలదు. అట్టి ముఖమునారాధించు భక్తుడు ఆమె అందమునకు ఆకర్షింపబడి ఆమెయందు తన్మయత్వము పొంది మోక్షమును పొందును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 129 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Śaraccandranibhānanā शरच्चन्द्रनिभानना (129) 🌻
Her face appears like the moon in spring season. Śarad means second half of October, November and first half of December. In a natural horoscope, each rāśi represents a solar month.
Two solar months make a ṛtu and six ṛtu-s make a year. During śarad ṛtu (autumn or fall season) the moon appears brighter and without blemishes. Please refer nāma 133 also.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 130 / Sri Lalitha Chaitanya Vijnanam - 130 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖
🌻 130. 'శాతోదరీ 🌻
సన్నని నడుము కలది శ్రీదేవి అని అర్థము.
హిమవంతుని పుత్రిక అని మరియొక అర్థము. శ్రీలలితాదేవి నడుమును గూర్చి, ఉదరమును గూర్చి అనేకములగు వర్ణనలున్నవి. ఆమె నడుము పురుషునకు కూడ అందమే. అట్టి పురుషుని సింహమధ్యముడు అందురు.
అంతకన్న సన్నమైన నడుము స్త్రీకి అందము. సృష్టియందే స్త్రీకిని లేనంత, ఈర్ష్య పడునంత సన్నని అందమైన నడుము కలదని వర్ణనము. శ్రీలలిత యొక్క అందమును వర్ణించు నామములలో ఇది యొకటి.
శతోదరుడు అనగా హిమవంతుడు. హిమాలయములందు వందలకొలది గుహలు కలవు. అందువలన అతడు శతోదరుడు. అతని పుత్రికగా శ్రీలలిత జనించుటచే 'శాతోదరి' అను నామము కలిగినదని మరియొక అర్థము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 130 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Śātodarī शातोदरी (130) 🌻
She has thin waist. These two nāma-s (129 and 130) are connected to Her kāmakalā form, the details of which will be discussed in kāmakalā rūpā (nāma 322) .
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
05 Dec 2020
No comments:
Post a Comment