నిర్మల ధ్యానాలు - ఓషో - 22
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 22 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. జీవితం మనకు యివ్వబడింది. మనమేమీ కాము, అంతా దైవమే. 🍀
మనం మొదట గుర్తించాల్సిన విషయం జీవితం మనకు యివ్వబడింది. అది మనం సాధించింది కాదు. నిజం చెప్పాలంటే మనకు ఆ అర్హత లేదనుకోండి. ఉనికిని సంబంధించిన బలమైన నియమమున్నది దానికి అర్హత వున్న వాళ్ళ పట్ల వుంటుంది. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక బుద్ధుడు, అక్కడ జీవితం నించీ అదృశ్యం కావడమన్నది వుంటుంది. అర్హత లేని వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ వుంటారు.
ఒకసారి నీకు అర్హత కలిగితే నువ్వు అనంతం కేసి అదృశ్యమవుతావు. నీకు అర్హత లేకుంటే తిరిగి వెనక్కి వస్తావు. గుర్తుంచుకోవాల్సిన రెండో విషయం చైతన్యానికి సంబంధించిన శక్తి. అది నీకు సంబంధించింది కాదు. దేవుడి నించీ నిరంతరం నీలోకి ప్రవహించేది. నువ్వు అతన్ని అనుక్షణం శ్వాసిస్తున్నావు. ఆ స్పృహ లేకుండా అంటే ఆ విషయం నీకు తెలీకుండానే అనుకో.
నువ్వు చైతన్యంతో వున్న క్షణం ఆశ్చర్యపోతావు. మనం దేవుణ్ణి తింటాం, దేవుణ్ణి శ్వాసిస్తాం. అక్కడ దైవం తప్ప ఎవరూ వుండరు. ఆయన మన సంపద. ఆయన మన పునాది. ఆయన మన పునాది. ఆయన మనలో చివురించే కొమ్మ, ఆయనే చివుళ్ళు, ఆయనే పూలు, పళ్ళు అన్నీ ఆయనే, మనమేమీ కాం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
27 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment