12-JANUARY-2022 బుధవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 12, బుధవారం, జనవరి 2022 సౌమ్య వాసరే 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 305 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 503🌹
🌹 Why Spiritual Path seems Difficult 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -133🌹  
5) 🌹 Osho Daily Meditations - 122🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 181 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 181 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 12, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ క్షిప్ర గణపతి ధ్యానం 🍀*

*దంతకల్పలతా పాశరత్న కుంభాంకుశోజ్జ్వలమ్ |*
*బంధూకకమనీయాభం ధ్యాయేత్ క్షిప్రగణాధిపమ్ || 10*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం,  
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: శుక్ల-దశమి 16:50:03
వరకు తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: భరణి 14:01:04 వరకు
తదుపరి కృత్తిక
యోగం: సద్య 11:37:02 వరకు
తదుపరి శుభ
కరణం: గార 16:51:04 వరకు
సూర్యోదయం: 06:48:54
సూర్యాస్తమయం: 17:59:42
వైదిక సూర్యోదయం: 06:52:46
వైదిక సూర్యాస్తమయం: 17:55:51
చంద్రోదయం: 13:41:02
చంద్రాస్తమయం: 02:01:02
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మేషం
వర్జ్యం: 27:33:30 - 29:21:58
దుర్ముహూర్తం: 12:01:56 - 12:46:40
రాహు కాలం: 12:24:18 - 13:48:09
గుళిక కాలం: 11:00:27 - 12:24:18
యమ గండం: 08:12:45 - 09:36:36
అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:46
అమృత కాలం: 08:38:00 - 10:25:20
కాల యోగం - అవమానం 14:01:04
వరకు తదుపరి సిద్ది యోగం - 
కార్య సిధ్ధి, ధన ప్రాప్తి 
పండుగలు : మాస కృతికా దీపం
Masik Karthigai Deepam
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -305 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 20 - 2 📚*
 
*🍀 20-2. కోరికలు - ఆరాధకులు వారి స్వభావమును బట్టి అనేకానేకమగు కోరికలతో దైవమును ప్రార్ధించుచు నుందురు. అసురు లొక రకముగ కోరుచుందురు. దేవతలు మరొక రకముగ కోరుచుందురు. భోగభాగ్యములు, కీర్తిని, ఆరోగ్యమును, ఆయుషును, బలమును, వీర్యమును, విద్యను, వంశాభివృద్ధిని, రక్షణమును- ఇట్లెన్నియో విషయములను అన్ని సంప్రదాయముల వారును ఏదో ఒక విధముగ కోరుచునే యుందురు. 🍀*

*త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా యథైరిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతే |*
*పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యానివి దేవభోగాన్ || 20*

*తాత్పర్యము : స్వర్గప్రాప్తిని వేడుకొనుచు, మూడు వేదము లధ్యయనము చేయువారు, సోమపానము కొరకై సోమయజ్ఞము చేసినవారు, పుణ్యకర్మలు చేసినవారు, పై విధముగ నన్ను పూజించినవారు సురేంద్ర లోకమును చేరి, దివ్యమగు భోగములను అనుభవించు చున్నారు.*

*వివరణము : ఎప్పుడు, ఏ సమయమున, ఎవరికి ఏది తీరని లోటని పించునో, దానిని కోరుట సృష్టి సహజము. కోరినవారి కోరిక యందలి బలము, ఆ కోరికను తీర్చుకొను ప్రయత్నము నందలి బలమును బట్టి, కాలానుసారము కోర్కెలు తీరుచు నుండును. సంకల్పబలము, ప్రయత్నబలము లేని వారికి కోరికలు తీరు అవకాశము తక్కువ. పురుష ప్రయత్నమున్న చోటనే దైవానుగ్రహము కూడ కాలానుసారము తీరుచునుండును. తీరుట, తీరక పోవుట కాలమును బట్టి యుండును. ఇందు జీవుల కోరిక ఇచ్ఛా శక్తి సంబంధితము. ఇచ్ఛ యందలి బలమే ఇంధనముగ ప్రయత్నము సాగును.*

*ప్రయత్న బలము క్రియాశక్తి స్వరూపము. కేవలము ఇచ్ఛ యున్న చాలదు. అది క్రియా రూపమును ధరింప వలెను. అట్లే ప్రయత్నము జ్ఞానపూర్వకముగ నుండవలెను. ఇచ్ఛను పరిపూర్ణము గావించు కొనుటకు తగిన జ్ఞానము, అటుపై ప్రయత్నమున సమర్థత ముఖ్యము. ఇట్లు ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తుల వలన కోరికలు ఫలింపవచ్చును. ఫలించునని నిశ్చయముగ చెప్పలేము. ఫలించుట, ఫలింప కుండుట కాలము చేతిలో యున్నది. సృష్టి యందు దైవమే కాలరూపమున వర్తించు చుండును. కాలానుసారముగ త్రిశక్తుల బలమాధారముగ కోరికలు ఫలించు చుండును. కనుక కోరికలు తీరుట అనునది దైవానుగ్రహమని తెలియవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 503 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 41

*🌻. వివాహ మండపము -3 🌻*

దేవతలిట్లు పలికిరి -

ఓ నారదా! మహాప్రాజ్ఞా! నీవు విస్మయమును పొందిన వాడువలె కన్పట్టు చున్నావు. హిమవంతుడు నిన్ను సత్కరించినాడా? లేదా? విస్తరముగా చెప్పుము (19). గొప్ప ప్రతాపము గల వారు, చక్కగా అలంకరించు కున్నవారు అగు ఈ మైనాక సహ్యమేర్వాది పర్వతోత్తములు ఇచటకు ఏల విచ్చేసిరి? (20) 

ఓ నారదా! ఈ హిమవంతుడు శివునకు కన్యను ఇచ్చువాడా? కాదా? తండ్రీ! ఇపుడు హిమవంతుని గృహములో ఏమి జరుగుచున్నది? ఆ విషయమును చెప్పుము (21). దేవతల మగు మాకు మనస్సులో సందేహము కలుగుచున్నది. హే మహావ్రతా! మా ప్రశ్నలకు సమాధానముల నిచ్చి సందేహములను తీర్చుము (22).

నారదుడిట్లు పలికెను-

వికృతము, విచిత్రము, దేవతలనందరినీ మోహింపజేయునది అగు మాయను విశ్వకర్మ నిర్మించినాడు. ఆతడు ప్రేమతో గూడిన యుక్తితో దేవతలనందరినీ మోహింపజేయు గోరు చున్నాడు (25). ఓ శచీ పతీ! పూర్వము నీ వాతనిని మోమింపజేసితివి. ఆ వృత్తాంతమునంతనూ నీవు మరచితివి. అందువలననే ఆతడు మహాత్ముడగు హిమవంతుని ఇంటిలో నిన్ను జయింపగోరు చున్నాడనుటలో సందేహము లేదు (26). ప్రకాశముతో కూడి యున్న నాకృత్రిమ రూపము నన్ను మోహపెట్టినది. ఆతడు విష్ణు, బ్రహ్మ, ఇంద్రుల రూపములనే విధముగా నిర్మించినాడు (27).

ఇన్నిమాటలేల? ఓ దేవ దేవా! దేవ గణములందరి యొక్క కృత్రిమరూపములు నిర్మింపబడి యున్నవి. ఎవ్వరూ మిగులలేదు (28). దేవతలందరినీ ప్రత్యేకించి మోహింపజేయుటకై కృత్రిమ చిత్రముల రూపములో పరిహాసమును చేసే వికృతమైన మాయ నిర్మించబడినది (29).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆతని ఆ మాటను విని భయముచే కంపించే శరీరము గల దేవేంద్రుడు వెంటనే పాపములను పోగెట్టే విష్ణువుతో నిట్లనెను (30).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹 Why Spiritual Path Deems Difficult ? 🌹*
*Prasad Bharadwaj*

*The main reason why spiritual path seems difficult and spiritual growth seems like a struggle, is that deep-down, you're still not really convinced that divinity and happiness lies within you.*

*If you analyse yourself deeply enough, you will see that a significant portion of your mind still likes to indulge into the tendencies and habits that bind it and cripple it down. Or rather, a part of you is still helplessly in love with the chains of your own bondage.*

*See to it that if you really had a firm and complete conviction and understanding that the source of creation, which is of the nature of infinite bliss, is within you, your mind wouldn't wander anywhere else even for a second. Enlightenment thus would have been a matter of moment(s) and not lifetime(s).*
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 133 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : పద్మావతి దేవి 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. సమర్పణ - 2🌻*

*మహనీయుల మూర్తులను నారాయణుని మూర్తిగా ముచ్చటపడి ధ్యానింప వలెను. వారి సద్గుణముల యందు అభిలాష కలిగి వర్ణింపవలెను. అపుడు అప్రయత్నముగా సమర్పణ జరుగును.* 

సమర్పించునట్టి మనస్సు తన యందు మేల్కొని యున్నంతవరకు సమర్పింపదు. మనస్సును మోసగించి అది లేనపుడు సమర్పణ జరుగునట్లు మార్గము తీర్చిదిద్దుకొన‌వలెనే గాని సమర్పణ సంకల్పము వలన కాదు.

*ఈ సమర్పణ జరుగుటకు అంతకు ముందు సమర్పణ జరిగిన వారి సాంగత్యము ఆవశ్యకము. వారి సాంగత్యమున సమకూర్చిన వారిని కూడ నారాయణుని మూర్తులుగా తెలియవలెను.*

..... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻 
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 122 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 122. BETWEEN PLEASURE AND PAIN 🍀*

*🕉 The only state in which one can become a permanent dweller is the space that is neither this nor that. 🕉*
 
*In this space is a quality of silence and tranquility. Of course, in the beginning it feels very tasteless, because there is no pain and no pleasure. But all pain and all pleasure is just excitement. The excitement that you like, you call pleasure. The excitement that you don't like, you call pain. Sometimes it happens that you can start liking a certain excitement and it may become pleasure, and you can start liking another excitement and it may turn into pain. So the same experience can become pain or pleasure; it depends on your likes and dislikes.*

*Relax in the space between pleasure and pain. That's the most natural state of relaxation. Once you start being in it, feeling it, you will learn the taste of it. That is what I call the taste of Tao. It is just like wine. In the beginning it will be very bitter. One has to learn. And it is the deepest wine there is, the greatest alcoholic beverage of silence, of tranquility. One becomes drunk with it. By and by you will understand the taste of it. In the beginning it is tasteless, because your tongue is too full of pain and pleasure.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 181 / Sri Lalita Sahasranamavali - Meaning - 181 🌹*
*🌻. మంత్రము - అర్ధం 🌻*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 181. అభ్యాసాతి శయజ్ఞాతా, షడధ్వాతీత రూపిణీ ।*
*అవ్యాజ కరుణామూర్తి, రజ్ఞానధ్వాంత దీపికా ॥ 181 ॥ 🍀*

🍀 990. అభ్యాసాతియఙ్ఞాతా : 
అభ్యాసము చేసిన కొలది బొధపడును

🍀 991. షడధ్వాతీతరూపిణీ :
 6 మార్గములకు అతీతమైన రూపము కలిగినది

🍀 992. అవ్యాజకరుణామూర్తి :
 ప్రతిఫలాపేక్షలేని కరుణ కలిగినది

🍀 993. రఙ్ఞానధ్వాంతదీపికా : 
అఙ్ఞానమును అంధకారమునకు దీపము వంటిది

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 181 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 181. Abhyasatishayagynata shadadhvatita rupini*
*Avyajakarunamurti ragynanadhvanta dipika ॥ 181 ॥🌻*

🌻 990 ) Abhyasathisaya gnatha -   
She who can be realized by constant practice

🌻 991 ) Shaddwatheetha roopini -   
She who supersedes the six methods of prayers

🌻 992 ) Avyaja karuna moorhy -   
She who shows mercy without reason

🌻 993 ) Agnana dwantha deepika -   
She who is the lamp that drives away ignorance

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranamam
 #PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/  
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment