శ్రీ శివ మహా పురాణము - 503

🌹 . శ్రీ శివ మహా పురాణము - 503 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 41

🌻. వివాహ మండపము -3 🌻


దేవతలిట్లు పలికిరి -

ఓ నారదా! మహాప్రాజ్ఞా! నీవు విస్మయమును పొందిన వాడువలె కన్పట్టు చున్నావు. హిమవంతుడు నిన్ను సత్కరించినాడా? లేదా? విస్తరముగా చెప్పుము (19). గొప్ప ప్రతాపము గల వారు, చక్కగా అలంకరించు కున్నవారు అగు ఈ మైనాక సహ్యమేర్వాది పర్వతోత్తములు ఇచటకు ఏల విచ్చేసిరి? (20)

ఓ నారదా! ఈ హిమవంతుడు శివునకు కన్యను ఇచ్చువాడా? కాదా? తండ్రీ! ఇపుడు హిమవంతుని గృహములో ఏమి జరుగుచున్నది? ఆ విషయమును చెప్పుము (21). దేవతల మగు మాకు మనస్సులో సందేహము కలుగుచున్నది. హే మహావ్రతా! మా ప్రశ్నలకు సమాధానముల నిచ్చి సందేహములను తీర్చుము (22).


నారదుడిట్లు పలికెను-

వికృతము, విచిత్రము, దేవతలనందరినీ మోహింపజేయునది అగు మాయను విశ్వకర్మ నిర్మించినాడు. ఆతడు ప్రేమతో గూడిన యుక్తితో దేవతలనందరినీ మోహింపజేయు గోరు చున్నాడు (25). ఓ శచీ పతీ! పూర్వము నీ వాతనిని మోమింపజేసితివి. ఆ వృత్తాంతమునంతనూ నీవు మరచితివి. అందువలననే ఆతడు మహాత్ముడగు హిమవంతుని ఇంటిలో నిన్ను జయింపగోరు చున్నాడనుటలో సందేహము లేదు (26). ప్రకాశముతో కూడి యున్న నాకృత్రిమ రూపము నన్ను మోహపెట్టినది. ఆతడు విష్ణు, బ్రహ్మ, ఇంద్రుల రూపములనే విధముగా నిర్మించినాడు (27).

ఇన్నిమాటలేల? ఓ దేవ దేవా! దేవ గణములందరి యొక్క కృత్రిమరూపములు నిర్మింపబడి యున్నవి. ఎవ్వరూ మిగులలేదు (28). దేవతలందరినీ ప్రత్యేకించి మోహింపజేయుటకై కృత్రిమ చిత్రముల రూపములో పరిహాసమును చేసే వికృతమైన మాయ నిర్మించబడినది (29).


బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆతని ఆ మాటను విని భయముచే కంపించే శరీరము గల దేవేంద్రుడు వెంటనే పాపములను పోగెట్టే విష్ణువుతో నిట్లనెను (30).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


12 Jan 2022

No comments:

Post a Comment