మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 133
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 133 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : పద్మావతి దేవి
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సమర్పణ - 2🌻
మహనీయుల మూర్తులను నారాయణుని మూర్తిగా ముచ్చటపడి ధ్యానింప వలెను. వారి సద్గుణముల యందు అభిలాష కలిగి వర్ణింపవలెను. అపుడు అప్రయత్నముగా సమర్పణ జరుగును.
సమర్పించునట్టి మనస్సు తన యందు మేల్కొని యున్నంతవరకు సమర్పింపదు. మనస్సును మోసగించి అది లేనపుడు సమర్పణ జరుగునట్లు మార్గము తీర్చిదిద్దుకొనవలెనే గాని సమర్పణ సంకల్పము వలన కాదు.
ఈ సమర్పణ జరుగుటకు అంతకు ముందు సమర్పణ జరిగిన వారి సాంగత్యము ఆవశ్యకము. వారి సాంగత్యమున సమకూర్చిన వారిని కూడ నారాయణుని మూర్తులుగా తెలియవలెను.
..... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
12 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment