శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 337 / Sri Lalitha Chaitanya Vijnanam - 337
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 337 / Sri Lalitha Chaitanya Vijnanam - 337 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀
🌻 337. 'విధాత్రీ 🌻
విశిష్టముగ ధరించునది శ్రీమాత అని అర్థము. సృష్టిని నిర్మించి ధరించునది శ్రీమాత. తాను ఆధారముగనే సృష్టి అంతయూ వెలుగుచున్నది. త్రిగుణములు, పంచభూతములు కూడ తాను ఆధారముగనే ఏర్పడినవి. ఆదిత్యులు, రుద్రులు, వసువులు, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, అంతరిక్ష దేవతలు, సూర్య మండలములు, గ్రహములు, శ్రీదేవి చైతన్య మాధారముగనే వివిధ రూపములను, స్వభావములను దాల్చియున్నవి. ఇవన్నియూ ఆమెయే భరించు చున్నది. కావున ఆమె విధాత్రి. చీమ కదలుటకును, దోమ ఎగురుట కును కూడ ఆమెయే ఆధారము. వాని యందలి చైతన్యము శ్రీమాతయే కదా! అసురుల యందు, సురల యందు, మానవుల యందు కూడ వారి వారి స్వభావముల వెనుక నున్నది శ్రీమాతయే.
చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి అతనికి వేదము లందించి, సృష్టి నిర్మాణమునకు సంకల్పమిచ్చి, అతనిని సృష్టిని కూడ శ్రీమాతయే ధరించు చున్నది. చతుర్ముఖ బ్రహ్మకు భార్యగ కూడ నున్నది. అతడు ధాత. అతని భార్య ధాత్రి. ఆమె ధాత్రియే గాక విధాత్రి కూడ. అనగా అంతర్గతముగ, అంతర్హితముగ ధాత నుండి సమస్తమును నిర్వహించు చున్నది. అట్లే విష్ణువు నుండి స్థితిని అనుగ్రహించు చున్నది. రుద్రుని ద్వారా సంహారము చేయుచున్నది. నిర్వహించుచున్నట్లు గోచరించువారి అందరి యందు క్రియా శక్తిగను, జ్ఞానశక్తిగను, ఇచ్చాశక్తిగను పనిచేయునది శ్రీమాత శక్తియే. సృష్టి యందలి సమస్త జీవులు ఆమెకు వాహికలే. కావున ఆమె 'విధాత్రి'.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 337 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini
Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻
🌻 337. Vindhyācala-nivāsinī विन्ध्याचल-निवासिनी (336) 🌻
Dhātrī means the motherhood. She being (Śrī Mātā) the Supreme Mother, She nourishes this universe. Dhātrī also means gooseberry (Emblica Officinalis or amla) and in this context it is said that She likes gooseberries. This tree is said to be a sacred tree attributed to Goddess Lakṣmī. The lord of creation, Brahma, is known as Vidhātra and his wife is Vidhātrī.
The Supreme Śiva in the form of Brahman creates this universe, as Viṣṇu maintains it and as Rudra destroys it. His consorts in these three stages are known as Sarasvatī, Lakṣmī and Rudrāṇī. There are other nāma-s (457, 823, 826, 985) with the same meaning, that come up later in this Sahasranāma. In Lalitā Sahasranāma no nāma is repeated for the second time. But there are certain nāma-s that could convey the same meaning. If one goes deep into each nāma, one can realize that such nāma-s also convey different meanings altogether.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
11 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment