మైత్రేయ మహర్షి బోధనలు - 56
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 56 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 43. సలహా సూక్తము 🌻
మీకొక సలహా! ఎవ్వరికిని సలహాల నీయవద్దు- అడగనిచో అసలీయ వద్దు. అడిగిన వెంటనే కూడ సలహా నీయవద్దు. సాధారణ ముగ సలహాల నడుగువారు వినుదురేగాని పాటించరు. కొందరికి సలహాలను కోరుట పరిపాటి. తెలిసినది ఆచరించువానికి సందేహము లెక్కువ కలుగవు. వారికి సమాధానము ఎప్పటికప్పుడు దొరకుచునే యుండును. ఆచరింపని వారికే సందేహము లెక్కువ. పదిమందిని పదిరకములుగ సలహాలు నడిగి పుచ్చుకొని దేనిని ఆచరింపకుండుట వీరి స్వభావముగ నుండును.
నిజమునకు సలహా నిచ్చుటకు వలసిన చేతన కూడ ఇచ్చు వారిలో సాధారణముగ నుండదు. సలహా నిచ్చువాడు, సలహాను పుచ్చుకొనువాని పరిస్థితులతో ఏకీభావము చెంది, లోతుపాతులు గ్రహించి, కొంతవరకు సహవేదన ననుభవించి, తన బుద్ధి లోకములో మునిగి, పరిష్కారము స్పృశించగ ప్రేమానురాగములతో ఆ పరిష్కారమును కోరినవాని కీయవలెను. అట్లుకానిచో ఇచ్చు పరిష్కారము కాకతాళీయమగును. బాధ్యత లేనిదగును. కావున త్వరపడి సలహాల నీయకుము. అది అమితమైన బాధ్యతతో కూడిన పని.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
11 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment