12 - JUNE - 2022 SUNDAY MESSAGES ఆదివారం, భాను వాసరే

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 12, ఆదివారం, జూన్ 2022 భాను వాసరే Sunday 🌹
2) 🌹 కపిల గీత - 22 / Kapila Gita - 22🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 62 / Agni Maha Purana - 62🌹 
4) 🌹. శివ మహా పురాణము - 578 / Siva Maha Purana - 578🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 197 / Osho Daily Meditations - 197🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 379 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 379-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. 12, June 2022 పంచాగము - Panchangam 🌹*
*శుభ ఆదివారం, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, వైకాశి విశాకం, Pradosh Vrat, Vaikasi Visakam🌻*

*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 10 🍀*

*10. మార్తాణ్డాయ నమః భానవే నమః*
*హంసాయ నమః సూర్యాయ నమః*
*దివాకరాయ నమః తపనాయ నమః*
*భాస్కరాయ నమః మాం రక్షతు ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మానవుని హృదయములో చేరిన దుర్గుణములను తొలగించు కొనుటకు సత్పురుషుల సాంగత్యము చాలా అవసరము. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల త్రయోదశి 24:28:54 వరకు
తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: విశాఖ 23:59:16 వరకు
తదుపరి అనూరాధ
యోగం: శివ 17:27:02 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: కౌలవ 13:55:02 వరకు
వర్జ్యం: 07:12:22 - 08:39:54
మరియు 27:33:20 - 28:59:04
దుర్ముహూర్తం: 17:05:21 - 17:57:58
రాహు కాలం: 17:11:55 - 18:50:36
గుళిక కాలం: 15:33:15 - 17:11:55
యమ గండం: 12:15:55 - 13:54:35
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41
అమృత కాలం: 15:57:34 - 17:25:06
సూర్యోదయం: 05:41:14
సూర్యాస్తమయం: 18:50:36
చంద్రోదయం: 16:40:16
చంద్రాస్తమయం: 03:25:10
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: తుల
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య 
నాశనం 23:59:16 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 22 / Kapila Gita - 22 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. సాధువు లక్షణములు - 2 🌴*

*22. మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వన్తి యే దృఢామ్
మత్కృతే త్యక్త కర్మాణస్త్యక్త స్వజనబాన్ధవాః

కొంతమంది నా కొరకు వారి పనులన్నీ మానుకుంటారు. నా కోసం తన వారినీ బంధువులనీ వదిలి పెట్టాలి (లక్ష్మణుడు ప్రహ్లాదుడూ దృవుడూ వృత్తాసురుడూ పుండరీకుడు భీష్ముడూ లాగ)

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 22 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 The Symptoms of a Sadhu - 2 🌴*

22. mayy ananyena bhavena bhaktim kurvanti ye drdham
mat-krte tyakta-karmanas tyakta-svajana-bandhavah

Such a sadhu engages in staunch devotional service to the Lord without deviation. For the sake of the Lord he renounces all other connections, such as family relationships and friendly acquaintances within the world.

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 62 / Agni Maha Purana - 62 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 23*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. ఆదిమూర్త్యాది పూజావిధి -3‌ 🌻*

వనమాలను, శ్రీ వత్సమును, కౌస్తుభమును కూడ ఉంచవలెను. దిక్పాలకులను వెలుపల ఉంచవలెను. ఈ అంగదేవతల నందరిని వారి వారి మంత్రములచే పూజించవలెను. విష్ణుపూజ పూర్తియైన పిమ్మట అంగదేవతలను వ్యస్తరూపమునను, నమస్తరూపమునను బీజాక్షరయుక్త మంత్రములతో పూజింపవలెను. జపించి, ప్రదక్షిణముచేసి, స్తుతించి, అర్ఘ్యమును సమర్పించి "నేనే బ్రహ్మను, నేనే హరిని" అని ధ్యానము చేసి హృదయమునందు ఉంచుకొనవలెను. 17-18

అవాహనము చేయు నపుడు 'అగచ్ఛ' అనియు, ఉద్వాననము చెప్పునపుడు 'క్షమస్వ' అనియు అనవలెను. ఈ విధముగా అష్టాక్షరాదులచే పూజ చేసి ముక్తిని పొందును. 19

ఇంతవరకును ఏకమార్త్యర్చనము చెప్పబడినది. ఇపుడు నవ వ్యూహార్చనమును వినుము. అంగుష్ఠద్వయము నందును తర్జన్యాదులందును వాసుదేవుని, బలాదులను న్యానము చేయవలెను. పిమ్మట శిలస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాలు, పాదము వీటియందు న్యాసము చేసి మధ్యయందు పూర్వాదిక్‌ పూజా చేయవలెను. 

ఏకపీఠముపై. క్రమముగ, నవ వ్యూహములను, నవ పీఠములను స్థాపించి వెనుకటివలెనే పూజించవలెను. నవాబ్జములందు నవమూర్తుల నావాహనము చేసి నవవ్యూహపూజ వెనుకటివలెనే చయవలెను. పద్మ మధ్యమునందు వాటి యందున్న దేవతను, వాసుదేవుని పూజించవలెను.

అగ్ని మహాపురాణమున ఆదిమూర్త్యాది పూజావిధి యను ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 62 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 23*
*🌻 Mode of performing worship - 3🌻*

17. One has to worship with respective sacred syllables, the garland of wild-flowers, (the mark) śrīvatsa, (the gem) kaustubha and the presiding deities of the quarters outside and all (the attendant gods) of Viṣṇu as well either partially or wholly.

18-19: One has to worship with the limbs with the sacred syllables partially or wholly. After having repeated (the sacred syllables), doing circumambulation and adoration and offering waters of adoration and the offerings, one has to assign in the heart and after having meditated, “I am the brahman and Hari”, (one has to repeat the words) ‘come’ used in (the ceremony of) invocation and “forgive me” in dismissal (at the conclusion).

20. Having worshipped in this manner with the mantra of eight letters (one becomes eligible) to get liberation. The (mode of) worship of one form (of a deity) has been described. Listen to the (mode of) worship in the structure of nine (apartments).

21-23. Having assigned Vāsudeva, Balarāma) and others to the two thumbs and then at first to the fingers, then to the body, head, forehead, face, heart, navel, organ of generation, knees, (and) between the feet, one has to worship in order, single seat of the deity consisting of nine parts and then the nine seats and of the nine forms consisting of nine parts in nine lotuses as before. Then in the midst of the lotus one has to worship Vāsudeva.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 578 / Sri Siva Maha Purana - 578 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴*

*🌻. శివ విహారము - 5 🌻*

ఆయన తేజస్సును భూమి ధరించునట్లు చేయుడు. ఆ తేజస్సు నుండి ఆ ప్రభువు యొక్క కుమారుడగు స్కందుడు జన్మించగలడు (39). ఓ బ్రహ్మా! ఇపుడు నీవు దేవతాగణములతో కూడి నీ గృహమునకు వెళ్లుము. శంభుడు పార్వతితో గూడి ఏకాంతమునందు విహరించును గాక ! (40).

బ్రహ్మ ఇట్లు పలికెను--

లక్ష్మీపతి ఇట్లు పలికి వెంటనే తన అంతఃపురమునకు వెళ్లెను. ఓ మహర్షీ! దేవతలు నాతో గూడి తమ గృహములకు వెళ్లిరి (41). శక్తిశివుల విహారమును భరించజాలని భూమి శేషునితో, మరియు కూర్మముతో సహా ఆ భారమునకు కంపించెను (42). కూర్మము యొక్క భారముచే సర్వమునకు ఆధారమగు వాయువు స్తంభించగా ముల్లోకములు భయముతో కల్లోలితములాయెను (43). అపుడు దేవతలందరు దీనమగు మనస్సు గలవారై నాతో గలిసి వెళ్లి విష్ణువును శరణు జొచ్చి ఆ వృత్తాంతము నంతనూ నివేదించిరి (44).

దేవతలిట్లు పలికిరి --

దేవ దేవా! లక్ష్మీపతీ! అందరినీ రక్షించువాడా! ప్రభూ! భయ కల్లోలితమైన మనస్సు గల మేము శరణు జొచ్చితిమి. మమ్ములను రక్షించుము (45). ముల్లోకములలో ప్రాణవాయువు స్తంభించినది. కారణము తెలియకున్నది. దేవతలు, మునులు, ముల్లోకములలోని చరాచరప్రాణులు భయముతోకంగారు పడుచున్నారు (46).

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ మహర్షీ! దేవతలందరు నాతో గూడి ఇట్లు పలికి దీనులై మిక్కిలి దుఃఖితులై విష్ణువు యెదుట మౌనముగా నిలబడిరి (47). విష్ణువు ఆ మాటలను విని నన్ను, సమస్త దేవతలను దోడ్కొని, వెంటనే శివునకు ప్రియమగు కైలాస పర్వతమునకు వెళ్లెను (48).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 578 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 01 🌴*

*🌻 The dalliance of Śiva - 5 🌻*

39. Everything can be achieved through the discharge of the semen. O Brahmā, the process of discharge is very effective. The discharge that is fruitful none can withhold.

40-41. O gods, Śiva’s act of enjoyment will extend to a thousand years of celestial calculation. After that period is over, you can go there and do such things as will necessitate the fall of the semen on the ground. The son of the lord named Skanda will be born of that.

42. O Brahmā, return to your abode along with the gods. Let Śiva carry on enjoyment in the isolated place m the company of Pārvatī.

Brahmā said:—
43. After saying this, the lord of Lakṣmī immediately returned to his harem. O great sage, the gods too returned to their abodes along with me.

44. On account of the dalliance of Śiva and Pārvatī, the earth quaked with the weight along with Śeṣa (the serpent) and Kacchapa[10] (the tortoise).

45. By the weight of Kacchapa, the cosmic air, the support of everything, was stunned and the three worlds became terrified and agitated.

46. Then the gods along with me sought refuge in Viṣṇu and in our depression intimated to him the news.

The gods said:—
47. O Viṣṇu, the lord of the gods, O lord and protector of all, save us who have sought refuge in you and whose minds are acutely terrified.

48. The vital air of the three worlds is stunned. We do not know wherefore. The three worlds including the mobile and immobile as well as the gods and the sages are excited.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 197 / Osho Daily Meditations - 197 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 197. దుర్బలత్వం 🍀*

*🕉. శరీరంలో ఉన్న ఉనికి చాలా ప్రమాదకరమైనది. ఏ క్షణంలోనైనా, కొంచెం ఎక్కువ ఆక్సిజన్‌తో లేదా కొంచెం తక్కువగా ఉంటే, అలాగే రక్తంలో షుగర్‌ తగ్గిపోయినా, మెదడులో కొద్ది భాగం పనిచేయడం మానేసినా... మీరు వెళ్లిపోయారు! 🕉*
 
*జీవితం దుర్బలత్వంలో ఉంది, అది ప్రమాదంలో, అభద్రతలో ఉంది. భద్రత లేదు, ఉండదు. చనిపోయిన వారికి మాత్రమే భద్రత. వారు చాలా బలంగా ఉన్నారు. చనిపోయిన వ్యక్తిని చంపగలరా? నీవల్ల కాదు. మీరు చనిపోయిన వ్యక్తిని నాశనం చేయగలరా - మీరు చేయలేరు. చనిపోయినవారు చాలా బలవంతులు! అధిక జీవన నాణ్యత, మరింత పెళుసుగా ఉంటుంది. గులాబీని చూడు, పద్యాన్ని చూడు, పాటను చూడు, సంగీతాన్ని చూడు-అది ఒక సెకను కంపిస్తుంది మరియు ఆ తర్వాత వెళ్లి పోతుంది! ప్రేమను చూడండి: ఒక క్షణం అది ఉంటుంది, తదుపరి క్షణం అది ఉండదు.*

*ధ్యానం చూడండి. మీరు పైకి వెళ్లే కొద్దీ విషయాలు మరింత హాని కలిగిస్తాయని మీరు కనుగొంటారు. కాబట్టి దుర్బలత్వంతో తప్పు లేదు; జీవితం ఎలా ఉందో అర్థం అవుతుంది. బలంగా నటించడం అవివేకం. ఎవరూ బలవంతులు కాదు, ఎవరూ బలంగా ఉండలేరు; ఇది కేవలం అహం యొక్క ఆట. అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా బలంగా లేడు - ఒక రోజు వస్తుంది మరియు అతని శక్తి అంతా పోయింది. కాబట్టి మీ దుర్బలత్వాన్ని అంగీకరించడం నేర్చుకోండి, ఆపై చాలా లోతైన అవగాహన మరియు లోతైన శక్తి ప్రవాహం ఉంటుంది. మీరు దానిని సమస్యగా భావించరు. ఇది సమస్య కాదు; అది చాలా ముఖ్యమైన విషయం.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 197 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 197. VULNERABILITY 🍀*

*🕉 Existence in the body is very precarious. Any moment, with just a little more oxygen or a little less, and you are gone! A little less sugar in the blood and you are gone ... a little dysfunction in the brain and you are gone! 🕉*
 
*Life exists in vulnerability, it exists in danger, insecurity. There is no security, and there cannot be. Security is only for dead people. They are very strong. Can you kill a dead person? you cannot. Can you destroy a dead person-you cannot. Dead people are very strong! The higher the quality of life, the more fragile. Look at a rose, look at a poem, look at a song, look at music-it vibrates for a second and then is gone! Look at love: One moment it is there, next moment it is not.*

*Look at meditation. As you go higher you will find that things become more and more vulnerable. So there is nothing wrong with vulnerability; it is understanding how life is. To pretend to be strong is foolish. Nobody is strong, nobody can be strong; it is just an ego game. Even Alexander the Great is not strong--one day comes and all his strength is gone. So just learn to accept your vulnerability, and then there will be a very deep understanding and a deep flow of energy. You will not feel it as a problem. It is not a problem; it is something very significant.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 379-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 379-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*

*🌻 379. ‘ఓడ్యాణ పీఠనిలయా' - 1🌻* 

*ఓడ్యాణ పీఠము నివాస స్థానముగా గలది శ్రీమాత అని అర్థము. హృదయ పీఠము, జాలంధర పీఠము తర్వాతి పీఠముగా ఓడ్యాణ పీఠము తెలుపబడినది. ఈ ఓడ్యాణమే తెనుగున వడ్డాణము అని పిలువబడుచున్నది. స్త్రీలు వడ్డాణమును, పురుషులు కటి బంధమును ధరించుట సనాతనమగు ఆచారము. కటిబంధము యొక్క బలమే శరీర బలముగ తెలియవలెను. కటిబంధము సడలినపుడు శరీరము అదుపు తప్పును. రోగగ్రస్త మగును.*

*శరీరము యొక్క అధోభాగము బలముగ నుండవలె నన్నచో నడుము సన్నదిగను, బలముగను ఉండ వలయును. యోగమున ఆసనములన్నియూ కటిభాగము స్థిమితముగను, బలముగను స్థిరపరచుటకే. ఈ భాగము విస్తరించినచో యోగమునకు అర్హత కోల్పోవుట జరుగును. ఓడ్యాణ బంధము నడ్డి పదునుగను, నిటారుగను వుండుటకు, పొత్తికడుపు పెరుగకుండటకు వినియోగ పడును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 379 - 1🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 83. Odyana pita nilaya nindu mandala vasini
Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻*

*🌻 379. Oḍyāṇa-pīṭha-nilayā ओड्याण-पीठ-निलया - 1 🌻*

*She abides in the oḍyāṇa-pīṭha, the fourth pīṭha of the gross body. The fully developed sound at this stage is delivered in the form of vaikari. The oḍyāṇa-pīṭha, corresponds to the throat cakra or viśuddhi.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment