నిర్మల ధ్యానాలు - ఓషో - 191


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 191 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. వ్యక్తి హృదయం గుండా దేవుణ్ణి సమీపించాలి. ఆ సంగతి గ్రహిస్తే మనసుని మంచి సేవకుడుగా మార్చుకోవచ్చు. వివేకం రూపాంతరం కలిగిస్తుంది. స్వేచ్ఛని తెస్తుంది. జ్ఞానం కేవలం సమాచారాన్ని తెస్తుంది. 🍀


దేవుడికి హృదయంతో సరాసరి సంబంధముంది. మెదడుతో కాదు. కాబట్టి వ్యక్తి హృదయం గుండా దేవుణ్ణి సమీపించాలి. ఆ సంగతి గ్రహిస్తే మనసుని మంచి సేవకుడుగా మార్చుకోవచ్చు. హృదయం చెప్పినట్లు అప్పుడు మనసు వింటుంది. మనసంటే మేథస్సు. నీ శక్తి యుక్తుల్ని హృదయం వేపు మళ్ళించు. మరింత ప్రేమగా వుండు.

అప్పుడు నీ ప్రేమ పుష్పం వికసించి నీ హృదయం పద్మంగా మారుతుంది. గొప్ప పరివర్తన జరుగుతుంది. ఎప్పుడు పరిణామం సంభవిస్తుందో అదే వివేకం. వివేకం స్వేచ్ఛని తెస్తుంది. జ్ఞానం సమాచారాన్ని తెస్తుంది. వివేకం రూపాంతరం కలిగిస్తుంది.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


07 Jun 2022

No comments:

Post a Comment