నిర్మల ధ్యానాలు - ఓషో - 194
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 194 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనం నామవాచకాలకు అలవాటు పడిపోయాం. నది అంటాం, చెట్టు అంటాం. నది ప్రవహించేది, చెట్టు అనుక్షణం చిగురించేది. మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు. జ్ఞానం మృత విషయం. తెలుసుకోవడం సజీవమైంది. 🍀
జ్ఞానం మృత విషయం. తెలుసుకోవడం సజీవమైంది. ప్రవహించేది. మన భాషలన్నీ కాలం చెల్లినవి. భవిష్యత్తులో ఎప్పుడో మనం కొత్త భాషల్ని ప్రవేశ పెట్టవచ్చు. ఆ కొత్త భాషల్ని విభిన్నవ్యక్తులు. వేరు వేరు ప్రయోజనాల కోసం, విభిన్న పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు. మత దృష్టితో చూసినా, శాస్త్రీయ దృష్టితో చూసినా ఉనికిలో ఏదీ నిశ్చలం కాదు. ప్రతిదీ కదలికలో వుంటుంది. సాగుతూ వుంటుంది.
అందువల్ల జ్ఞానం అన్నమాట కన్న నేను తెలుసుకోవడం అంటాను. ప్రేమ అన్నమాట కన్న ప్రేమించడం అన్న మాటని యిష్టపడతాను. మనం నామవాచకాలకు అలవాటు పడిపోయాం. నది అంటాం, చెట్టు అంటాం. నది ప్రవహించేది, చెట్టు అనుక్షణం చిగురించేది. ఆ పదాలు వాటిని అందివ్వలేవు. పాత ఆకులు రాల్తాయి. కొత్త ఆకులు వస్తాయి. మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
13 Jun 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment