2) 🌹. శ్రీమద్భగవద్గీత - 224 / Bhagavad-Gita - 224 - 5- 20 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 623 / Vishnu Sahasranama Contemplation - 623🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 302 / DAILY WISDOM - 302🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 202 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 141 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹29 June 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : జేష్ఠ అమావాస్య, Jeshta Amavasya 🌺*
*🍀. నారాయణ కవచము - 10 🍀*
*17. సనత్కుమారోఽవతు కామదేవాద్ధయాననో మాం పథి దేవహేలనాత్ |*
దేవర్షివర్యః పురుషార్చనాంతరాత్కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్*
18. ధన్వంతరిర్భగవాన్పాత్వపథ్యాద్ద్వంద్వాద్భయాదృషభో నిర్జితాత్మా |*
*యజ్ఞశ్చ లోకాదవతాజ్జనాంతాద్బలో గణాత్క్రోధవశాదహీంద్రః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : అంతఃకరణ ఆకాంక్షలే పరిస్థితులను నిర్మిస్తాయి. లక్ష్యము ఏదైతే చేతన యొక్క అన్ని ప్రయత్నాలు దాని కొరకే ఉపయోగపడతాయి. సద్గురు శ్రీరామశర్మ. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: అమావాశ్య 08:23:05 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: ఆర్ద్ర 22:09:02 వరకు
తదుపరి పునర్వసు
యోగం: వృధ్ధి 08:50:21 వరకు
తదుపరి ధృవ
కరణం: నాగ 08:22:06 వరకు
వర్జ్యం: 04:34:42 - 06:22:50
దుర్ముహూర్తం: 11:53:10 - 12:45:48
రాహు కాలం: 12:19:29 - 13:58:11
గుళిక కాలం: 10:40:47 - 12:19:29
యమ గండం: 07:23:23 - 09:02:05
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45
అమృత కాలం: 10:53:10 - 12:41:18
సూర్యోదయం: 05:44:42
సూర్యాస్తమయం: 18:54:17
చంద్రోదయం: 05:38:39
చంద్రాస్తమయం: 19:18:47
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: జెమిని
ముసల యోగం - దుఃఖం 22:09:02
వరకు తదుపరి గద యోగం -
కార్య హాని , చెడు
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 224 / Bhagavad-Gita - 224 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 20 🌴*
*20. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ |*
*స్థిరబుద్ధిరసమ్మూడో బ్రహ్మవిద్ బ్రాహ్మణి స్థిత: ||*
🌷. తాత్పర్యం :
*ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగక అప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నత నొందనివాడును, స్థిరబుద్ధిని కలిగనవాడును, మోహపరవశుడు కానివాడును, భగవద్విజ్ఞానమును పూర్ణముగా నెరిగినవాడును అగు మనుజుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగియున్నట్టివాడే యగును.*
🌷. భాష్యము :
ఆత్మానుభవమును పొందిన మహాత్ముని లక్షణములు ఇచ్చట పేర్కొనబడినవి. మిథ్యాతాదాత్మ్యముచే దేహమునే ఆత్మగా భావించెడి మోహగ్రస్థుడు కాకపోవుట అతని ప్రథమలక్షణము.
దేహాత్మభావనను కలిగియుండక తానూ శ్రీకృష్ణభగవానుని అంశనని అతడు సంపూర్ణముగా ఎరిగియుండును. కనుకనే దేహమును సంబంధించినదేదైనను లభించినప్పుడు పొంగుట గాని, నష్టపోయినప్పుడు చింతించుట గాని అతడు చేయడు.
మనస్సు యొక్క ఈ స్థిరత్వమే “స్థిరబుద్ధి” అనబడును. కనుక అతడు దేహమును ఆత్మగా భ్రమించుట గాని, దేహమును శాశ్వతమని తలచి ఆత్మను తృణికరించుట గాని చేయడు.
ఇట్టి జ్ఞానము అతనిని బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనెడి పరతత్త్వజ్ఞానమును అవగాహన చేసికొనగలిగెడి స్థితికి చేర్చగలడు. తద్ద్వారా ఆ భక్తుడు భగవానునితో అన్ని విధములుగా సమానము కావలెను మిథ్యాయత్నమును త్యజించి తన నిజస్థితి తెలిసికొనగలడు.
ఇదియే వాస్తవమునకు బ్రహ్మానుభవము లేదా ఆత్మానుభావము అనబడును. అట్టి స్థిరమైన భావనయే కృష్ణభక్తిరస భావనము.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 224 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 5 - Karma Yoga - 20 🌴*
*20. na prahṛṣyet priyaṁ prāpya nodvijet prāpya cāpriyam*
*sthira-buddhir asammūḍho brahma-vid brahmaṇi sthitaḥ*
🌷 Translation :
*A person who neither rejoices upon achieving something pleasant nor laments upon obtaining something unpleasant, who is self-intelligent, who is unbewildered, and who knows the science of God is already situated in transcendence.*
🌹 Purport :
The symptoms of the self-realized person are given herein. The first symptom is that he is not illusioned by the false identification of the body with his true self. He knows perfectly well that he is not this body but is the fragmental portion of the Supreme Personality of Godhead.
He is therefore not joyful in achieving something, nor does he lament in losing anything which is related to his body. This steadiness of mind is called sthira-buddhi, or self-intelligence.
He is therefore never bewildered by mistaking the gross body for the soul, nor does he accept the body as permanent and disregard the existence of the soul.
This knowledge elevates him to the station of knowing the complete science of the Absolute Truth, namely Brahman, Paramātmā and Bhagavān. He thus knows his constitutional position perfectly well, without falsely trying to become one with the Supreme in all respects.
This is called Brahman realization, or self-realization. Such steady consciousness is called Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://www.tumblr.com/blog/bhagavadgitawisdom
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 623 / Vishnu Sahasranama Contemplation - 623🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻623. ఛిన్నసంశయః, छिन्नसंशयः, Chinnasaṃśayaḥ🌻*
*ఓం ఛిన్నసంశయాయ నమః | ॐ छिन्नसंशयाय नमः | OM Chinnasaṃśayāya namaḥ*
*కరతలామలకవత్ సర్వసాక్షాత్కృతేర్హరేః ।*
*సంశయః క్వాపి నాస్తి ఛిన్నసంశయ ఉచ్యతే ॥*
*ఏవని సంశయములన్నియు తెగినవియో, ఎవనికి ఏ సంశయములును లేవో అట్టివాడు. కరతలము నందలి అమలకమును అనగా అరచేతి యందు ఉన్న ఉసిరికాయ వలె ప్రతియొక విషయమును సాక్షాత్కరింప జేసినొనిన వాడగు ఈ పరమాత్మకు ఏ విషయము నందును సంశయము ఉండదు. అంతటి జ్ఞాన స్వరూపుడగు పరమాత్మ ఛిన్నసంశయః.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 623🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻623. Chinnasaṃśayaḥ🌻*
*OM Chinnasaṃśayāya namaḥ*
करतलामलकवत् सर्वसाक्षात्कृतेर्हरेः ।
संशयः क्वापि नास्तिछिन्नसंशय उच्यते ॥
*Karatalāmalakavat sarvasākṣātkrterhareḥ,*
*Saṃśayaḥ kvāpi nāstichinnasaṃśaya ucyate.*
*One who has no doubts as everything is directly discernible. He understands everything as clearly has holding a Amalika (Indian gooseberry) in ones palm. To whom there is no doubt whatever is Chinnasaṃśayaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥
స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥
Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 302 / DAILY WISDOM - 302 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 28. మృత్యుభయం మరేమీ కాదు, ఆనందాన్ని కోల్పోతామనే భయం 🌻*
*మన అభౌతిక అనుభవాలు సూక్ష్మ వాస్తవికతపై నమ్మకంతో పాటు మనలో భయం యొక్క అనుభూతిని కూడా సూక్ష్మంగా సృష్టిస్తుంది. ఇది మనం అనుకున్న నమ్మకానికి విరుద్ధంగా ఉంటుంది. మనం విషయాలకు ఎందుకు భయపడుతున్నాము? ఇంద్రియ వస్తువులతో సంపర్కం కోల్పోతామని భయం. మృత్యుభయం అనేది భౌతిక ఆనందాన్ని కోల్పోతామనే భయం తప్ప మరొకటి కాదు. ' మృత్యువు కబళిస్తే మన ఆనందాలన్ని కోల్పోతాము'. అనే భయం. ప్రతి వ్యక్తిలో జీవితం పట్ల ప్రేమ తో పాటు, మృత్యు భయం కూడా ఉంటుంది. రెండు కూడా విషయ వాంఛలపై మోహం తప్ప మరొకటి కాదు. లేకుంటే చావు అంటే భయం ఎందుకు?*
*ఎందుకంటే అస్మిత (అహంకారం) సృష్టించిన సంబంధాలు ఇక్కడ ఆనందానికి కేంద్రాలుగా ఉన్నాయని మరియు అవి మాత్రమే వాస్తవాలు మరియు వాటిని మించినది ఏమీ లేదు అనే అభిప్రాయాన్ని కలిగి ఉండడమే. ఇంద్రియ భోగాలకు మించిన ఆనందం ఏదయినా సాధ్యమవుతుందని, ఎవరైనా ఊహించగలరా? ఎవరూ ఊహించలేరు. మనం మేధోపరంగా, విద్యాపరంగా మాత్రమే ఊహించుకుంటాము - ఇంద్రియ సుఖాలలో ప్రతిదీ చేర్చబడింది, అదే సర్వస్వం అని భావిస్తాము. కాని నిజంగా, ఆచరణాత్మకంగా చూస్తే అలాంటిది ఏదీ లేదు అని తెలుస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 302 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 28. The Fear of Death is Nothing but the Fear of Loss of Pleasure 🌻*
*The confirmed belief in the substantiality of our phenomenal experiences subtly creates a feeling of fear in us simultaneously, which is contrary to the apparent belief in the reality of things. Why are we afraid of things? The fear is due to the subtle feeling of the possibility of one's being wrenched out of one's contact with the objects of sense. The fear of death is nothing but the fear of loss of pleasure. “I may lose all my centres of pleasure if the forces of death come and catch hold of my throat.” The love of life which is so inherent in every individual, accompanied by the fear of death, is another form of the love of pleasure; otherwise, why should one fear death so much?*
*It is because the so-called phenomenal relationships created by asmita have formed the impression that there are centres of joy here, and they are the only realities—there is nothing beyond. Can anyone imagine, even with the farthest stretch of thought, that there is any delight possible, or even conceivable, beyond the pleasures of sense? There is nothing conceivable. We only imagine intellectually, academically — Everything is included within sense pleasures. They are everything. But when we see practically, we understand there is none like that.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 202 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. జ్ఞానానికి మొదటి అడుగు 'నాకేమీ తెలియదు' అని అంగీకరించడం. అట్లా ఆమోదిస్తే మార్పు జరుగుతుంది. అంతర్దృష్టి ఏర్పడుతుంది. జ్ఞానం నీ లోపలి నించీ రావాలి. అధ్యయనం ద్వారా రాదు. ధ్యానం గుండా వస్తుంది. బయటి నించీ నేర్చుకున్నవన్నీ వదిలిపెట్టు. అప్పుడు లోపల వున్నది నీతో మాట్లాడుతుంది. 🍀*
*ఇతరుల్ని సంపాందించిన జ్ఞానం నిజమైన జ్ఞానం కాదు. అది నీ అజ్ఞానాన్ని దాచిపెడుతుంది. కానీ నిన్ను వివేకవంతుణ్ణి చెయ్యలేదు. అది నీ గాయాల్ని దాచిపెడుతుంది. కానీ గాయాన్ని మాన్పలేదు. వ్యక్తి తన గాయాన్ని మరచి పోతాడు. అది ప్రమాదకరం. గాయం పెరుగుతూనే వుంటుంది. కాన్సర్గా మారే ప్రమాదముంది. గాయాల్ని గ్రహించడం మంచిది. గాయాలకు కాంతి తగలాలి. దాచిపెట్టడం వినాశకరం. బహిరంగపరిస్తే గాయాలు మానతాయి. జ్ఞానానికి మొదటి అడుగు 'నాకేమీ తెలియదు' అని అంగీకరించడం. అట్లా ఆమోదిస్తే మార్పు జరుగుతుంది. అంతర్దృష్టి ఏర్పడుతుంది.*
*జ్ఞానం నీ లోపలి నించీ రావాలి. అది ఆలోచనల నించీ రాదు. నీలోని ఆలోచనారహిత స్థలం నించే అది ఆవిర్భవిస్తుంది. అధ్యయనం ద్వారా రాదు. ధ్యానం గుండా వస్తుంది. మనసు మలినపడనపుడు, మనసు మాయమైనపుడు వస్తుంది. అన్ని అడ్డంకులూ తొలిగినపుడు నీలో నించీ అది పొంగి పోర్లుతుంది. అక్కడ వసంతం ప్రవహిస్తుంది. కానీ దారిలో ఎన్నో రాళ్ళుంటాయి. అది జ్ఞానమని భ్రమించే అవకాశముంది. అవి జ్ఞానం కాదు, జ్ఞానానికి శత్రువులు, బయటి నించీ నేర్చుకున్నవన్నీ వదిలిపెట్టు. అప్పుడు లోపల వున్నది నీతో మాట్లాడుతుంది. అప్పుడు నువ్వు నిజమైన జ్ఞానానికి సంబంధించిన పరిమళమవుతావు. తెలుసుకోవడమన్నది స్వేచ్ఛనిస్తుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 141 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 106. విచికిత్సలు - 2🌻*
*హాస్యమునకు పలికిన మాటలలో సత్యముల ప్రయత్నముగ బయల్పడును. ఈ సదస్సుల యందు ప్రజలు విశ్వాసమును కూడ కోల్పోయెదరు. కంటి తుడుపు సదస్సులే కాని మరియొకటి కాదను భావన కూడ వ్యక్తమగుచుండును. ఉదాహరణకు ప్రజాస్వామ్యమని ప్రస్తుత శతాబ్దముల యందు మీరు చేయు కేకలు మిన్నంటుచున్నవి కాని మచ్చునకైనను మానవ సంఘములలో ప్రజాస్వామ్యము గోచరింపదు.*
*సదస్సులు, విచికిత్సలు, తీర్మానములు, ఉల్లంఘనలు జాతి జీవనశైలియై నిలచినది. త్రికరణ శుద్ధి, దీక్షాయుత జీవనము మృగ్య మైనప్పుడు, వ్యక్తికిని సంఘమునకు కీడేగాని మేలు జరుగదు. పై కారణముగ నా అనుయాయులకును తెలియజేయు విషయమొక్కటే! తెలిసినది ఆచరింపుడు. విచికిత్సలు విసర్జింపుడు.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment