శ్రీ శివ మహా పురాణము - 574 / Sri Siva Maha Purana - 574

🌹 . శ్రీ శివ మహా పురాణము - 574 / Sri Siva Maha Purana - 574 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴

🌻. శివ విహారము - 1 🌻


వందే వందన తుష్ట మానసమతి ప్రేమ ప్రియం ప్రేమదం పూర్ణం పూర్ణకరం ప్రపూర్ణ నిఖిలైశ్వర్యైక వాసం శివమ్‌ |

సత్యం సత్యమయం త్రిసత్యవిభవం సత్యప్రియం సత్యదం విష్ణు బ్రహ్మనుతం స్వకీయకృపయోపాత్తాకృతిం శంకరమ్‌ ||

నమస్కారముచే సంతసించే మనస్సు గలవాడు, అతిశయించిన ప్రేమను కలిగి సర్వులకు ప్రియమైన వాడు, ప్రేమను పంచి ఇచ్చువాడు, పూర్ణుడు, పూర్ణునిగా చేయువాడు, సర్వపూర్ణైశ్వర్యములకు ఏకైక నిధానమైనవాడు, మంగళస్వరూపుడు, సత్తాఘనుడు, సత్య స్వరూపుడు, త్రికాలముల యందు బాధింపబడని వైభవము గలవాడు, మంగళస్వరూపుడు, సత్తాఘనుడు, సత్య స్వరూపుడు, త్రికాలముల యందు బాధింపబడని వైభవము గలవాడు, సత్యమునందు ప్రేమ గలవాడు, సత్యమగు మోక్షము నిచ్చువాడు, విష్ణు బ్రహ్మలచే స్తుతింపబడువాడు, స్వీయకృపచే ఆకృతిని స్వీకరించిన వాడు అగు శివుని నమస్కరించుచున్నాను (1).

నారదుడిట్లు పలికెను--

ఓ బ్రహ్మా! లోకములను కలుగజేయు శంకరుడు పార్వతిని వివాహమాడి తనకైలాసమునకు వెళ్లి ఏమి చేసెనో చెప్పుము (2). శివుడు ఆత్మారాముడే అయిననూ పుత్రుని కొరకు ఉమను వివాహమాడెను. అట్టి శివపరమాత్మకు కుమారుడు జన్మించిన విధమెట్టిది? (3) ఓ బ్రహ్మా| దేవతలకు సుఖకరమగు తారకసంహారము ఎట్లు జరిగెను? ఈ వృత్తాంతము నంతనూ నాయందు దయ ఉంచి, పూర్తిగా చెప్పుము (4).

సూతుడిట్లు పలికెను--

నారదుని ఈ పలుకులను విని మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గల ప్రజాపతి శంకరుని స్మరించి ఇట్లు బదులిడెను (5).

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ నారదా! చంద్రశేఖరుని చరితమును, గుహుని దివ్యమగు జన్మ వృత్తాంతమును, తారకాసుర వధను చెప్పెదను వినుము (6). పాపములను పోగొట్టే ఈ కథను ఇప్పుడు చెప్పెదను వినుము. ఈ కథను విన్న మానవుడు సమస్త పాపముల నుండి నిశ్చితముగా విముక్తుడగును (7).

పాపహారిణి, రహస్యము, మిక్కిలి అద్భుతము, పాపముల వలన కలిగే దుఃఖమును పోగొట్టునది, విఘ్నముల నన్నిటినీ నశింపజేయునది (8), సర్వమంగళముల నిచ్చునది, సారభూతమైనది, అందరికీ వినుటకు ఇంపైనది, సుఖముల నిచ్చునది, మోక్షమునకు బీజమైనది, కర్మమూలమును తెగగొట్టు నది అగు ఈ కథను వినుము (9).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 574 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 01 🌴

🌻 The dalliance of Śiva - 1 🌻


1. I salute Śiva who is satisfied with salutation, who loves great devotion, who bestows affection, who makes others too perfect and complete and who is the abode of all fortune and achievements. I salute Śiva who is eulogised by Viṣṇu and Brahmā, who urged by His sympathy assumes visible forms, who bestows truth, who loves truth, whose assets are the threefold truths and who is identical with truth.

Nārada said:—

2. O Brahmā, after marrying Pārvatī and returning to His mountain what did Śiva the benefactor of the worlds do? Please narrate it to me.

3. Who was the son born to Śiva, the great soul, for which purpose the lord, though He rests and revels in Himself, married Pārvatī?

4. O Brahmā, the benefactor of the gods, how was Tāraka[1] slain? Please have pity on me and narrate all this in full.

Sūta said:—

5. On hearing these words of Nārada, Prajāpati was highly delighted and he replied after thinking on Śiva.

Brahmā said:—

6. O Nārada, listen to the tale of Śiva, the moon-crested lord. I shall narrate the story of Guha’s[2] birth and the slaying of the demon Tāraka.

7. Let it be heard. I shall tell you the story that destroys all sins, on hearing which a man is freed from all sins.

8. This narrative is sinless. It is a wonderful secret. It dispels the distress caused by sin and wards off all obstacles.

9. It bestows everything auspicious. It is the essence of the Vedas and is pleasing to the ears. It is conducive to happiness. It is the cause of liberation and cuts off the roots of all actions.


Continues....

🌹🌹🌹🌹🌹


04 Jun 2022

No comments:

Post a Comment