శ్రీ శివ మహా పురాణము - 579 / Sri Siva Maha Purana - 579
🌹 . శ్రీ శివ మహా పురాణము - 579 / Sri Siva Maha Purana - 579 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴
🌻. శివ విహారము - 6 🌻
దేవతలకు ఇష్టుడగు విష్ణువు నాతో, మరియు దేవతలతో గూడి అచటకు వెళ్లి శంకరుని చూచు కోరికతో ఆయన నివాసమునకు వెళ్లెను (49). అచట శివుడు కానరాలేదు. దేవతలతో గూడియున్న విష్ణువు ఆశ్చర్యమును పొందెను. ఆయన వినయముతో అచట నున్న శివగణములను ఇట్లు ప్రశ్నించెను (50).
విష్ణువు ఇట్లు పలికెను--
ఓ శంకర గణములారా! సర్వేశ్వరుడగు శివుడు ఎచటకు వెళ్లినాడు? దుఃఖితులమగు మాకు దయగలవారై ప్రీతితో ఈ విషయమును చెప్పుడు (51).
బ్రహ్మ ఇట్లు పలికెను--
ఆ శంకర గణములు దేవతలతో గూడియున్న లక్ష్మీపతి యొక్క ఆ మాటలను విని ప్రీతితో ఇట్లు నుడివిరి (52).
శివగణములు ఇట్లు పలికిరి-
హే విష్ణో! శివుని ప్రీతి కొరకై మేము సత్యమును పలికెదము. బ్రహ్మతో, దేవతలతో గూడి వృత్తాంతమునంతనూ వినుము (53). సర్వేశ్వరుడు, అనేక లీలాపండితుడు అగు మహాదేవుడు మమ్ములనిక్కడ ఉంచి ఆనందముతో పార్వతి ఇంటికి వెళ్లినాడు (54) ఓ లక్ష్మీపతీ! ఆ ఇంటిలోపల మహేశ్వరుడు ఏమి చేయుచున్నాడో మేము ఎరుంగము. అనేక సంవత్సరములు గడిచినవి (55).
బ్రహ్మ ఇట్లు పలికెను--
ఓ మునిశ్రేష్ఠా! వారి ఈ మాటను విని ఆ విష్ణువు నాతో, మరియు దేవతలతో కూడి మిక్కిలి విస్మితుడై శివుని ద్వారము వద్దకు వెళ్లెను (56). ఓ మునీ! నాతో దేవతలతో కలిసి దేవతలకు ఇష్టుడగా ఆ విష్ణువు అచటకు వెళ్లి బిగ్గరగా ఆర్తితో కూడిన కంఠముతో పిలిచెను (57).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 579 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 01 🌴
🌻 The dalliance of Śiva - 6 🌻
Brahmā said:—
49. After saying this, O great sage, all the depressed gods, stood silent along with me in front of Viṣṇu with great misery.
50. On hearing those words, Viṣṇu took us all immediately to the mountain Kailāsa, the favourite haunt of Śiva.
51. After going there in the company of the gods and me, the favourite deity of the gods went to the excellent resort of Śiva with a desire to see Śiva.
52. Unable to see Him there, Viṣṇu and the gods became surprised. With humility he asked the Gaṇas of Śiva who were there.
Viṣṇu said:—
53. O Gaṇas of Śiva, where has Śiva, the lord of all gone? Sympathetically intimate this to us who are depressed.
Brahmā said:—
54. On hearing these words of Viṣṇu in the company of the gods, the Gaṇas of Śiva lovingly replied to Viṣṇu.
The Gaṇas of Śiva said:—
55. O Viṣṇu, please listen along with Brahmā and the gods, we shall tell you the truth and the details out of love for Śiva.
56. Śiva, the lord of all, had gone into the apartment: of Pārvatī after stationing us here with love. He is an expert in indulging in divine sports.
57. O lord of Lakṣmī, many years have gone by. We do not know what Śiva, the great lord, is doing within her apartment.
Continues....
🌹🌹🌹🌹🌹
14 Jun 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment