శ్రీ మదగ్ని మహాపురాణము - 67 / Agni Maha Purana - 6


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 67 / Agni Maha Purana - 67 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 24

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


🌻. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -5‌ 🌻


ఆజ్యము చేత మూర్తినితృప్తిపరచవలెను. వదన అంశము అంగహోమము చేయవలెను. ఆజ్యము మొదలైనవాటితో లేదా తిలలతో గూడిన సమిధలతో మూరు లేదా వేయి హోమములు చేయవలెను.

హోమము అంతమునందు గల పూజను సమాప్తి చేసి ఉపవాస మున్న పవిత్రులైన శిష్యలను పిలచి, తన ఎందుట ఉంచుకొని, ఆ పశువులను అస్త్రమంత్రముచే ప్రోక్షించవలెను.

శిష్యులను విద్యాకర్మనిబంధనములచే తనలో కలుపుకొని, లింగ శరీరమును అనుసరించి ఉన్నదియు, లింగ శరీరముతో కూడా పాలింపబడినదియు అగు చైతన్యమును ధ్యానమార్గమున సంప్రోక్షించి, వాయుబీజములచే శుష్కింపచేయవలెను. పిమ్మట బ్రహ్మాండ మను పేరు గల ఈ సృష్టి యంతయు అగ్నిబీజముచే కాల్చివేయబడి భస్మరాశి వలె ఉన్నట్లుగా ధ్యానము చేయవలెను. ఆ భస్మము నీటితో ముంచెత్తవెలను. ప్రపంచ మంతయు జలమయముగా ఉన్నట్లు స్మరించవలెను.

పిమ్మట దానియందు పృథివాకార మైనదియు, బీజ మను పేరు గలదియు అగు శక్తిని ఉంచవలెను. సమస్తమైన తన్మాత్రలచే ఏర్పడినది, పృథివీవికారము, శుభమైనదియు, అఖండము, దాని (శక్తి) నుండి పుట్టినది. తత్స్వరూపమును అగు దాని ఆధారమునుధ్యానించవలెను. దాని మధ్యయందు ప్రణవరూపమైన పురుషమూర్తిని ధ్యానించవలెను. 48

పిమ్మట అండము ఒక సంవత్సరము పాటు ఉండి బ్రద్ధలైనట్లును అ ముక్కలు ద్యులోక పృథివీలోకములైనట్లును, వాటి మధ్య ప్రజాపతి జనించి నట్లును ధ్యానించవలెను. మరల చూచి, ఆ శిశువును ప్రణవముచే, పూర్వము చెప్పనట్లుగా న్యాసములు చేసి మంత్రాత్మక మగు శరీరము కలవానినిగా చేయవలెను. 50


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 67 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 24

🌻 Mode of constructing the sacrificial pit and the oblations unto fire - 5 🌻

41-42. One has to offer oblation with clarified butter to the deity and a tenth part to the limbs. (Having offered) oblations of clarified butter and other things hundred times or thousand times, or of the twigs or of the sesamum, and concluding the worship ending with the oblation and calling the disciples who are pure, and placing the fed beasts in front, (they are) sacrificed by means of weapons.

43-45. Having united the disciples with one’s own self with the fetters of knowledge and action and the consciousness which follows the liṅga[11] and which is protected along with the liṅga, having been consecrated by means of contemplation, (they) have to be purified by the syllables of Vāyu. Then the creation of the whole egg (the universe), consumed by the fire (and) reduced into a heap of fire is contemplated upon with the syllables of the Fire god. (Then one should sprinkle ashes on the water and meditate on the world.

46. Then one has to assign the creative power which is known as the seed of the earth and which is enveloped by all the subtle principles.

47. Then one has to meditate on the egg produced out of it, (which) is its base and identical with the self. Then one has to meditate on the form of the puruṣa (the Supreme Being) identical with the praṇava (the syllable Om) at its centre (centre of the egg).

48. The liṅga, situated in one’s self, (and) (which) has been purified earlier, is then to be transferred. Then the positions of the different important organs are to be thought of.

49. Then, having remained for one year, the egg is split. The heaven and earth (are placed) in a part. Prajāpati (the creator) (is placed) in between the parts.

50. Having meditated on his form and again having consecrated that child with the praṇava (syllable Om) and having made his body made up of the mystic formulae, (one has to do) the assignment (of limbs to different, deities) as described before.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


22 Jun 2022

No comments:

Post a Comment