14 - JULY - 2022 THURSDAY MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 14, గురువారం, జూలై 2022 బృహస్పతి వాసరే Thursday🌹
2) 🌹 కపిల గీత - 38 / Kapila Gita - 38 🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 78 / Agni Maha Purana - 78 🌹 
4) 🌹. శివ మహా పురాణము - 594 / Siva Maha Purana - 594 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 213 / Osho Daily Meditations - 213 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 386 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 386 - 1 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹14, July 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 2 🍀*

*2. స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూ భృత్ప్రతిభటం*
*సుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనం*
*అనంతైస్త్రయ్యంతైరనువిహిత హేషాహలహలం*
*హతాశేషావద్యం హయవదనమీడేమహిమహః ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఒక నక్షత్రకాంతి ఆ నక్షత్రం అంతరించి పోయిన ఎన్నో వందల సంవత్సరాల తరువాత భూమికి చేరునటుగా ఆదిలో బ్రహ్మము నందు ఇదివరకే సాధించబడిన ఘటన ఈనాడు అభివ్యక్తమై భౌతిక ప్రపంచంలో మన అనుభవానికి వస్తూ వుంటుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాఢ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ పాడ్యమి 20:17:54 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: ఉత్తరాషాఢ 20:18:59 వరకు
తదుపరి శ్రవణ
యోగం: వైధృతి 08:27:37 వరకు
తదుపరి వషకుంభ
కరణం: బాలవ 10:12:15 వరకు
వర్జ్యం: 06:18:40 - 07:42:36
మరియు 23:50:20 - 25:15:16
దుర్ముహూర్తం: 10:11:04 - 11:03:23
మరియు 15:24:59 - 16:17:19
రాహు కాలం: 13:59:58 - 15:38:04
గుళిక కాలం: 09:05:40 - 10:43:46
యమ గండం: 05:49:28 - 07:27:34
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 14:42:16 - 16:06:12
సూర్యోదయం: 05:49:28
సూర్యాస్తమయం: 18:54:17
చంద్రోదయం: 19:48:50
చంద్రాస్తమయం: 06:05:20
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మకరం
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 15:02:59
వరకు తదుపరి ధ్వాo క్ష యోగం -
ధన నాశనం, కార్య హాని 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 38 / Kapila Gita - 38🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. 16. స్వచ్ఛమైన భక్తుల ఆధ్యాత్మిక సంపద - 2 🌴*

*38. న కర్హిచిన్మత్పరాః శాన్తరూపే నఙ్క్ష్యన్తి నో మేऽనిమిషో లేఢి హేతిః
యేషామహం ప్రియ ఆత్మా సుతశ్చ సఖా గురుః సుహృదో దైవమిష్టమ్

నేనిచ్చే వాటిని గానీ, లోకములో లభించే ప్రాకృతికమైన భోగములు కోరని వారికి నాశము లేదు. కర్మ ప్రకృతి సంసారము అనే తీక్షణమైన ఆయుధాలు. ఈ పదునైన ఆయుధాలను వారు (సామాన్యజనులలాగ) నాలికతో స్పృశించరు. నేను వారికి ప్రియున్ని, ఆత్మను, పుత్రున్ని, మిత్రున్ని, గురువునీ సుహృత్, ఇష్ట దైవాన్ని.

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 38 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 16. The Pure Devotees' Spiritual Opulences - 2 🌴*

*38. na karhicin mat-parah santa-rupe nanksyanti no me 'nimiso ledhi hetih
yesam aham priya atma sutas ca sakha guruh suhrdo daivam istam

The Lord continued: My dear mother, devotees who receive such transcendental opulences are never bereft of them; neither weapons nor the change of time can destroy such opulences. Because the devotees accept Me as their friend, relative, son, preceptor, benefactor and Supreme Deity, they cannot be deprived of their possessions at any time.

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 78 / Agni Maha Purana - 78 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 27*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. దీక్షా విధి - 4 🌻*

హరిని స్మరించుచు "నమో భూతేభ్యః" అని భూతబలిని కుశములపై ఇవ్వవలెను. పిదప వితానము (చందన) చేత, ఘటముచేత, లడ్డుల చేత మండలమును అలంకరించి, మండలముపై విష్ణువును పూజింపవలెను. పిమ్మట అగ్నిని పూజించి పద్మాసనము కట్టి కూర్చున్న éశిష్యులను పిలచి వారికి దీక్ష ఇవ్వవలెను.

విష్ణువును హస్తముచే ప్రోక్షించి, శిరస్సును స్పృశించి, క్రమముగా ప్రకృతి మొదలు వికృతులు వరకును గల, అధిభూతాధి దైవతములతో కూడిన సృష్ణినిగూర్చి మనస్సులో భావనచేసి దానిని మరల క్రమముగా ఉపసంహరించి, ఆసృష్టి యంతయు తన్మాత్రలగా అయిపోయినట్లును, జీవునితో సమానమైననట్లును భావన చేయవలెను.

పిమ్మట గురువు కుంభేశును ప్రార్థించి, సూత్రమును ప్రోగుచేసి, అగ్ని దగ్గరకు వచ్చి, దానిని అగ్ని పార్శ్వము నందుంచి, సృష్టికి అధిపతియైన ఆ అగ్నిని మూలమంత్రముతో నూరు అహుతులతోను, పిమ్మట పూర్ణాహుతితోను పూజించ వలెను. మూలమంత్రముతో నూరుసార్లు అభిమంత్రించిన తెల్లనిర జస్సుతోహృదయతాడనముచేయవలెను, వియోగపద సంయుక్తములను, పాదాదీంద్రియ ఘటితములను, బీజయుక్తములును అగు వాక్యములతో క్రమముగా పృథి వ్యాది తత్త్వ విశ్లేషణము చేసి హోమము చేవలెను.

పండితుడు అఖిలత త్త్వములకును నిలయమైన వహ్నియమందును, వ్యహృతుడగు హరియందును సమస్తమైన అర్చనామార్గము క్రమముగ ఉంచబడుచున్నట్లు స్మరిచంపవలెను. తాడనముచే విడదీసి, గ్రహించి, శమింపచేసి ప్రకృతిచే స్వీకరించిన, పూర్వోక్తమైన అగ్నియందు హోమము చేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 78 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 27*
*🌻 Mode of performing the initiation rite - 4 🌻*

34. He should then say “Salutations, (I offer) the food to the goblins on the kuśa grass”. Then having contemplated upon Hari, the sacrificial yard is adorned with multitudes of vessels of sweet meats.

35. Viṣṇu is then worshipped in a circular altar. Then after offering oblations to the fire, the pupils who are seated in the Padmāsana[6] posture are called upon and are initiated.

36-37. Having sprinkled water on Viṣṇu, and touching the head gradually, all the principles from the primordial down to the transformations as well as their presiding deities, the entire divine creation is conceived in the heart and all the subtle principles which have become one with the soul are absorbed gradually.

38-40. Then the preceptor has to pray the presiding deity of the pitcher and draw the thread. Then having come near the fire and placing it (the thread) by the side of the fire, he (should offer) hundred oblations to the passive Lord of creation with the principal mystic syllable. Then the preceptor having reached him, and having offered the final oblation, has to collect the white dust and strike the heart with that sanctified by the basic mystic syllable and ending with the syllables huṃ and phaṭ.

41. Then oblations are separately offered in order to the earth and other principles with mystic syllables made up by subtracting syllables.

42. When Hari has been uttered unto the fire which is the abode of all principles, the wiseman has to remember the method that is being followed there.

43. Separating by means of beating and collecting (them) one has to remain quiet. Then after collecting by the Primordial, an offering is made into the fire as instructed.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 594 / Sri Siva Maha Purana - 594 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 04 🌴*

*🌻. కార్తికేయుని కొరకై అన్వేషణ - 3 🌻*

భూమాతా పలికెను -

ఓ పరమాత్మా ! నేను సహింప శక్యము కాని ఆ తేజస్సును ధరించుటకు శక్తి లేని దాననై అగ్ని యందు నిక్షేపించితిని. నేను అబలను. నన్ను క్షమించవలెను (22).

అగ్ని ఇట్లు పలికెను -

ఓ శంకరా! పాపురము రూపములోనున్న నేను దుస్సహమగు నీ తేజస్సును ధరింప జాలక కైలాస పర్వతమునందు వెను వెంటనే నిక్షేపించితిని (23).

పర్వతము ఇట్లు పలికెను -

లోకములను రక్షించు ఓ శంకరా! పరమేశ్వరా! దుస్సహమగు నీ తేజస్సును సహింప జాలక నేను వెంటనే గంగ యందు నిక్షేపించితిని (24).

గంగ ఇట్లు పలికెను -

లోకములను రక్షించు ఓ శంకరా! ప్రభూ! నాథా! నీ తేజస్సును సహింపజాలని నేను చాల కంగారు పడి రెల్లుగడ్డి యందు నిక్షేపించితిని (25).

వాయువు ఇట్లు పలికెను -

ఓ శంభూ! ఆ తేజస్సు రెల్లు గడ్డి యందు వెంటనే బాటకుడాయెను. గంగానదీపావన తీరమునందు ఆ సుందర బాలకుడు మిక్కిలి ప్రకాశించెను (26).

సూర్యుడిట్లు పలికెను -

ఓ ప్రభూ! కాలచక్రముచే ప్రేరితుడనగు నేను ఏడ్చుచున్న బాలకుని చూచి రాత్రియందు అచట నిలిచి యుండుటకు సామర్ఢ్యము లేనివాడనగుటచే అస్తాద్రికి వెళ్లితిని (27).

చంద్రుడిట్లు పలికెను -

ఓ శంభూ! బాలుడు ఏడ్చు చుండుటను గాంచి కృత్తికలు తీసుకొని బదరికాశ్రమములోని తమ గృహములోనికివెళ్లిరి || (29)

జలాధి దేవత ఇట్లు పలికెను -

ఓ ప్రభూ! వారు సూర్యకాంతితో వెలుగొందే ఆ శివసుతుని ఏడ్చుచుండగా తీసుకొని వెళ్లిస్లన్యము నిచ్చి పెంచిరి (29).

సంధ్య ఇట్లు పలికెను -

ఆ కృత్తికలు అడవిలో దొరికిన ఆ బాలకుని ప్రేమతో పోషించి, ఆతనికి ఉత్సాహముతో కార్తీకుడని పేరు పెట్టిరి (30).

రాత్రి ఇట్లు పలికెను -

వారా బాలకుని తమ దృష్ఠి పథమునుండి తప్పుకోని విధముగా పెంచిరి. ఆబాలకుడు వారికి ప్రాణముల కంటె ఎక్కువ ప్రియమయ్యెను. ఎవరు శిశువును పోషించెదరో, వారికే ఆ శిశువు పుత్రుడగును (31).

దినాధి దేవత ఇట్లు పలికెను -

వారా బాలకునిచే శ్రేష్టులగు వస్త్రములను, అలంకారములను ఏరి కోరి ధరింపసజేసిరి. రుచ్యములు, శ్రేష్ఠములు అగు పదార్ధములను తినిపించిరి (32).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 594 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 04 🌴*

*🌻 Search for Kārttikeya and his conversation with Nandin - 3 🌻*

The Earth said:—
22. I was unable to bear the terrible semen. Hence I dropped it into the fire. O lord, please forgive me.

The fire said:—
23. O Śiva, assuming the form of a dove I gulped the semen but could not bear the terrible thing. Hence I immediately dropped it on the mountain Kailasa.

The mountain said:—
24. O lord of the worlds, I too was unable to bear the terrible thing. O lord, I dropped it in the Gaṅgā.

Gaṅgā said:—
25. O lord of the worlds, I too was unable to bear your terrible semen. O lord, completely exhausted, I dropped it in the grove of Sara plants.

Vāyu said:—
26. O Śiva, the semen that fell among the Śara plants immediately became a very beautiful boy on the holy banks of the celestial river.

The sun said:—
27. On seeing the crying boy, O lord, I went to the western mountain, urged by the revolving wheel of time, being unable to stay there at night.

The moon said:—
28. Taking the crying boy, the Kṛttikās returned to their abode. O Śiva, they went to Badarikā hermitage.

The waters said:—
29. O lord, taking the crying child with them and feeding him with their own breast milk they nurtured your son, as refulgent as the sun.

The dusk said:—
30. Now, he is the nursling son of the Kṛttikās in the forest. In their eagerness they named him Kārttikeya lovingly.

The night said:—
31. They never let the boy go out of their sight. He is the object of their love, dearer to them than their own lives. Verily he who nurtures, possesses the son.

The day said:—
32. They fed him on the choicest delicacies. They gave him the rarest garments and excellent ornaments.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 213 / Osho Daily Meditations - 213 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 213. సంతోషం ఒక గందరగోళం 🍀*

*🕉. మనసుంటే స్పష్టత. మొత్తం ఉంటేనే ఆనందం. సజీవంగా ఉన్నదంతా ఎప్పుడూ గందరగోళంగానే ఉంటుంది. చనిపోయిన విషయాలు మాత్రమే స్పష్టంగా ఉన్నాయి. 🕉*
 
*స్పష్టత కోసం వెతకకండి, లేకుంటే మీరు మీ కష్టాలకు అతుక్కోవడం ప్రారంభిస్తారు, ఎందుకంటే కష్టాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు వైద్యుని వద్దకు వెళ్లండి మరియు మీకు ఏదైనా వ్యాధి ఉన్నట్లయితే, అతను దానిని చాలా స్పష్టంగా గుర్తించగలడు. మీకు క్యాన్సర్ లేదా వెయ్యి విభిన్న వ్యాధులు ఉంటే అతను నిర్ధారించగలడు. కానీ మీరు ఆరోగ్యంగా ఉంటే, డాక్టర్ నిర్ధారణకు రావడానికి ఏమీ లేదు. నిజానికి, ఆరోగ్యం అంటే ఏమిటో నిర్వచించడానికి వైద్య శాస్త్రానికి మార్గం లేదు. గరిష్టంగా మీరు అనారోగ్యంతో లేరని వారు చెప్పగలరు, కానీ ఆరోగ్యం అంటే ఏమిటో వారు ఖచ్చితంగా చెప్పలేరు. ఆరోగ్యాన్ని పట్టించలేము. ఆరోగ్యం కంటే సంతోషం పెద్దది. ఆరోగ్యం శరీరం యొక్క ఆనందం, ఆనందం ఆత్మ యొక్క ఆరోగ్యం.*

*కాబట్టి స్పష్టత గురించి బాధపడకండి. మనం ఇక్కడ అంకగణితం చేయడం లేదు; దాని గురించి అన్ని మర్చిపో. మనకు ఖచ్చితంగా గందరగోళం, అస్తవ్యస్తం భయపెట్టేదిగా ఉంది. కానీ సాహసం మరియు సవాలు ఉన్నాయి. కాబట్టి సవాలుగా తీసుకోండి. ఆనందంపై ఎక్కువ దృష్టి పెట్టండి మరియు గందరగోళాన్ని మరచిపోండి. ఎందుకంటే గందరగోళం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇంతకు ముందెన్నడూ రుచి చూడని కొత్త భూమికలోకి, భాగంలోకి వెళుతున్నప్పుడు, మీ పాత నమూనాలు గందరగోళానికి గురవుతాయి. ఆనందాన్ని వినండి; అది సూచికగా ఉండనివ్వండి. ఆనందం మీ దిశను నిర్ణయించనివ్వండి, ఆపై దానిలోకి వెళ్లండి.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 213 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 213. HAPPY CONFUSION 🍀*

*🕉. Clarity i s if the mind. Happiness is if the total. All that is alive is always confusing. Only dead things are clear. 🕉*
 
*Don't seek clarity, otherwise you will start clinging to your misery, because misery is very clear. You go to a doctor, and if you have any disease he can diagnose it in a very clear-cut way. He can diagnose if you have cancer or a thousand and one different diseases. But if you are healthy, the doctor has nothing to diagnose. In fact, medical science has no way to define what health is. At the most they can say that you are not ill, but they cannot be very definite about what health is. Health cannot be pigeonholed. Happiness is bigger than health. Health is the happiness of the body, happiness is the health of the soul.*

*So don't be bothered about clarity. We are not doing arithmetic here; forget all about it. Confusion is chaotic, certainly, even frightening--but the adventure is there and the challenge. So take the challenge. Focus more on happiness and forget about confusion, because confusion is bound to be there. When you are moving in new territory that you have never tasted before, your old patterns will be confused. Listen to happiness; let it be the indicator. Let happiness decide your direction, and then move into that.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 386 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 386 - 1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా*
*షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀*

*🌻 386. 'షడంగ దేవతాయుక్తా' - 1🌻* 

*షడంగ దేవతలతో కూడి యున్నది శ్రీదేవి అని అర్థము. షడంగ దేవత లనగా ఆరు అంగముల దేవతలు. ఆరు అంగములు వరుసగా యిట్లున్నవి. 1. హృదయము, 2. శిరస్సు, 3. శిఖ, 4. నేత్రము, 5. కవచము, 6. అస్త్రములు (అనగా శక్తులు). షడంగ దేవతలకు దేవత శివుడు. అతడు పై ఆరు దేవతలపై ఈశ్వరత్వము వహించి జీవుల హృదయమున ఈశ్వరుడై వర్ధిల్లును.*

*అట్లు ఈశ్వరుడై హృదయమున నుండి ఆరు అంగములను ఆరు దేవతలచే నిర్వర్తింపచేయును. శ్రీమాత శివుని దేవతలను, అంగము లను నిర్వర్తింపచేయు చైతన్య స్వరూపము. ఆమెయే షడంగ దేవతలతో కలసి శివునితో కూడి సమస్తమును నిర్వర్తించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 386 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita
Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻*

*🌻 386. षडङ्ग-देवदायुक्ता ṣaḍaṅga-devadāyuktā -1 🌻*

*ṣaḍ (six) + aṅaga (parts) means six parts. For every mantra there are six parts and each such part is under the control of a god/goddess called aṅaga devatā-s of the presiding deity. These six parts are heart, head, tuft of hair, arms, eyes and weapons. Before and after the recitation of a mantra, the deities of these parts are worshipped in our bodies by touching the respective body parts with fingers. This is with regard to the external worship.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment