నిర్మల ధ్యానాలు - ఓషో - 203


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 203 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మన అస్తిత్వం అపరిమితం. శాశ్వతం. దానికి మూడు లక్షణాలున్నాయి. మొదటిది సత్యం. నువ్వు నీ అస్తిత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నపుడు మొదటిసారి సత్యాన్ని రుచి చూస్తావు. రెండోది చైతన్యం. చైతన్నాన్ని రుచి చూస్తావు. మూడోది పరమానందం. అది అంతిమమైనది. 🍀


మన శరీరం చిన్నది. మన మనసు చిన్నది. కానీ మన అస్తిత్వం విశాలమైంది. సముద్రమంత విశాలమైంది. పెద్ద సముద్రాల కన్నా గొప్పది. సముద్రాలకు సరిహద్దులుంటాయి. మన అస్తిత్వం అపరిమితం. శాశ్వతం. దానికి మూడు లక్షణాలున్నాయి.

మొదటిది సత్యం. నువ్వు మొదటిసారి నీ అస్తిత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నపుడు మొదటిసారి సత్యాన్ని రుచి చూస్తావు. అంత వరకూ నీకు సత్యానికి సంబంధించిన సిద్ధాంతాలు మాత్రమే తెలిసి వుంటాయి. ఆహారం గురించి వినడం లాంటిదది. తినడంలాంటింది. శరీరాన్ని దాటి, మనసును దాటి మొదటి సారి సత్యాన్ని రుచి చూస్తావు.

రెండోది చైతన్యం. చైతన్నాన్ని రుచి చూస్తావు. లేకుంటే అది పదంగానే వుంటుంది. జనాలు నిద్రపోతుంటారు. వాళ్ళకు చైతన్యమంటే ఏమో తెలీదు. వాళ్ళు యంత్రప్రాయంగా రోబోట్లలా వుంటారు.

మూడోది పరమానందం. అది అంతిమమైనది. శిఖరప్రాయం. నీలోలోతుల్లోకి వెళితే మొదట సత్యం ఎదురవుతుంది. తరువాత చైతన్యం వస్తుంది. అంతిమంగా ఆనందం అల్లుకుంటుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


01 Jul 2022

No comments:

Post a Comment