నిర్మల ధ్యానాలు - ఓషో - 215
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 215 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. శూన్యంగా వుండండి. అది అసాధారణ అనుభవం. ఏమీ కానీతనంగా వుండంలో హెచ్చుతగ్గులొద్దు. పోటీలు వద్దు. వ్యక్తి మౌనంగా, వినయంగా, ఎవరూ కానితనంగా వుంటే అప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి.🍀
ఒకడు ఏమీ కావాలని అనుకోనప్పుడు, ఎవరూ కావాలని అనుకోనప్పుడు ఒకడు గొప్ప వాడవుతాడు. శూన్యంగా వుండండి. అది అసాధారణ అనుభవం. ఏమీ కానీతనంగా వుండంలో హెచ్చుతగ్గులొద్దు. పోటీలు వద్దు. అది గొప్పతనానికి, ఔన్నత్యానికి అర్థం కాదు. ఔన్నత్యమన్నది సహజంగా వచ్చేది. అది లక్ష్యం కాదు, అంతం కాదు. అది పరిమళం లాంటిది. పువ్వే దానికి అంతం. అక్కడ నీ చైతన్యం పరిమళిస్తుంది.
పరిమళాన్ని వెతుకుతూ పువ్వును మరచి పోకూడదు. పువ్వుని అన్వేషిస్తే పరిమళం దానంతట అదే వస్తుంది. వ్యక్తి మౌనంగా, వినయంగా, ఎవరూ కానితనంగా వుంటే అప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. అప్పుడు నువ్వు స్వర్గానికి అతిథి అవుతావు. అప్పుడు నువ్వు జీవితంలోని ఉన్నతోన్నత శిఖరాన్ని అధిరోహిస్తావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
25 Jul 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment