శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 390 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 390-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 390 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 390-1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀

🌻 390. 'నిర్వాణ సుఖదాయిని' - 1 🌻


అశరీర సుఖము నిచ్చునది శ్రీమాత అని అర్థము. శరీరమందు వసించు జీవునకు సుఖ మంతంత మాత్రమే. ప్రజ్ఞను పరిమితము చేయునది శరీరము. పరిమితత్త్వము పూర్ణ సుఖము నీయదు. వాయువు వలె స్వేచ్ఛగా జీవించుటకు వలను పడదు. ఆకాశమువలె వ్యాపించుటకు వీలుపడదు. రూపమెట్టిదైనను ప్రజ్ఞను పరిమితము చేయును. అపరిమితమే పూర్ణము. అపరిమితులై నిలచి పరిమిత రూపము ద్వారా పని చేయవచ్చును.

యోగీశ్వరులైన మహర్షుల ట్లుందురు. వారికి రూపము వాహనమే గాని బంధించునది కాదు. ఎంత పెద్ద రూపమైననూ పరిమితి కలిగి యుండును. కావున సుఖము కూడ అపరిమితమై యుండదు. అశరీర స్థితియే నిజమగు సుఖము. రూపము లన్నియూ క్షరములు. అనగా నశించునవి. జీవులక్షరులు. అక్షరులైన జీవులు క్షరమైన దేహము నందు బంధింప బడుట వలన సుఖముండదు. శరీరములోనికి ప్రవేశించి పని చేయుట, శరీరము వెలుపల నుండుట (అశరీరులై యుండుట), సిద్ధులు, ఋషులు, యోగులు చేయు పని.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 390 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini
Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻

🌻 390. Nirvāṇa-sukha-dāyinī निर्वाण-सुख-दायिनी -1 🌻


Nir (freed) + vāṇa (derived from bāṇa, meaning body). When mind is freed from body, it leads to bliss. When higher level of consciousness is reached, physical body is forgotten. When bodily afflictions are dissolved, what is derived is eternal bliss. She confers this bliss to those who worship Her as per nāma-s 381 and 382.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


24 Jul 2022

No comments:

Post a Comment